
janaki kalaganaledu 20 july 2022 full episode
Janaki Kalaganaledu 20 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 జులై 2022, బుధవారం ఎపిసోడ్ 348 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి అబద్ధం ఆడిందని తెలుసుకున్న రామా.. ఏంటి మీరు ఇలా చేస్తున్నారు. నేను కొట్టుకు వెళ్తా అంటాడు రామా. దీంతో మీకూ నాతో ఏకాంతంగా గడపాలని ఉంది కానీ.. కేవలం నా చదువు కోసం మీరు నాకు దూరంగా ఉంటున్నారు అంటుంది. దీంతో వద్దు నేను వెళ్తాను కొట్టుకు అంటాడు. దీంతో ఇవాళ మొత్తం నాతోనే ఉండాలని అత్తయ్య గారు చెప్పారు. ఇప్పుడేమో నువ్వు వెళ్తా అంటే.. ఏం చెప్పి వెళ్తారు అని అంటుంది జానకి. దీంతో అవునా.. అయితే ఒక పని చేద్దాం. మీరు ఈరోజు మొత్తం ఈ పుస్తకాలు చదువుతూ ఉండండి. ఇదే మీకు శిక్ష అంటాడు రామా.
janaki kalaganaledu 20 july 2022 full episode
జానకి చేతుల్లో పుస్తకాలను చూసి షాక్ అవుతుంది మల్లిక. వామ్మో.. జానకి చదువుకోవడం ఏంటి.. వెంటనే ఈ విషయం అత్తయ్యకు చెప్పాలి అని వెంటనే జ్ఞానాంబ దగ్గరికి వెళ్తుంది మల్లిక. అత్తయ్య గారు.. తను చదువుతోంది. పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. తన దగ్గర ఉన్న పుస్తకాలను మీరే మీ కళ్లతో చూద్దురు కానీ రండి అంటుంది మల్లిక. దీంతో జ్ఞానాంబ అస్సలు మల్లిక మాటలు నమ్మదు. తనకే కాళ్లకు దెబ్బ తాకితే నువ్వేంటి చదువు గిదువు అంటున్నావు. వెళ్లు ఇక్కడి నుంచి అంటుంది జ్ఞానాంబ. తను మాములుగా నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మా మల్లిక నీ కాళ్ల మీద వేడి నీళ్ళు పడ్డాయి అన్నావు కదా మామూలుగానే నడుస్తున్నావు కదా అంటాడు గోవిందరాజు. దీంతో రూమ్ లో ఇంకో కాలు ఉంటే.. వేడి నీళ్లు పడ్డ కాలును తీసేసి ఈ కాలును పెట్టుకున్నా అంటుంది మల్లిక. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
జానకి చదువుకుంటుందన్న విషయాన్ని వీళ్లకు ఎలా తెలిసేలా చేయాలి అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు నేను చదువుకోను అంటుంది జానకి. చిన్న పిల్లలా చేస్తున్నారు ఎందుకు అంటాడు రామా. దీంతో నాకు ఏదైనా తాయిలాలు ఇస్తే నేను చదువుకుంటాను అంటుంది జానకి.
మళ్లీ వెళ్లి జ్ఞానాంబను జానకి చదువుకునే విషయాన్ని చెబుతుంది. ఒకవేళ జానకి చదువుకోకపోతే నేను గుండు తీయించుకుంటాను అంటుంది మల్లిక. దీంతో తన రూమ్ దగ్గరికి జ్ఞానాంబ, గోవిందరాజు వెళ్తారు. లోపల చూడగా రామా, జానకి ఇద్దరూ కౌగిలించుకుంటూ ఉంటారు.
దీంతో మల్లిక తల మీద ఒక మొట్టికాయ ఇస్తుంది జ్ఞానాంబ. నోర్మూసుకొని ఒకసారి లోపల చూడు అంటుంది జ్ఞానాంబ. దీంతో వాళ్లను చూసి షాక్ అవుతుంది మల్లిక. అసలు ఏం జరిగిందంటే. తనకు తాయిలాలు ఇవ్వమనేసరికి.. ఏం కావాలి చాక్లెట్లు కావాలా అని అంటాడు రామా.
దీంతో కాదు కాదు.. నాకు హగ్ కావాలి అంటుంది జానకి. దీంతో తప్పదా అంటాడు. తప్పదు అంటుంది. దీంత తనను కౌగిలించుకుంటాడు రామా. తనను గట్టిగా హత్తుకుంటాడు. తర్వాత ఇక బుద్ధిగా చదువుకోండి అంటాడు రామా. దీంతో సరే అని పుస్తకాలు తీస్తుంది జానకి.
మరోవైపు మల్లికను తిడుతుంది జ్ఞానాంబ. ఇంకోసారి నువ్వు జానకి మీద ఇలా చాడీలు చెబితే మరుక్షణమే నువ్వు నీ పుట్టింట్లో ఉంటావు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. అసలు జానకి ఏం చేస్తుంది అని చెప్పి మరోసారి రూమ్ లోకి వెళ్లి చూస్తుంది మల్లిక.
అప్పుడు జానకి రూమ్ లో చదువుతూ ఉంటుంది. నేను చూసినప్పుడు చదువుతుంది. అత్తయ్య చూసినప్పుడు మాత్రం చదవదు అని అనుకుంటుంది మల్లిక. వాళ్ల రూమ్ లోకి మల్లిక తొంగి చూస్తుండటంతో ఏయ్ ఏం చేస్తున్నావు అక్కడ ఇటురా అంటుంది జ్ఞానాంబ.
పదా అంటుంది. ఎక్కడికి అంటుంది. వంట చేయడానికి అంటుంది జ్ఞానాంబ. ఈరోజు అందరికీ వంట నువ్వే చేయాలి అంటుంది జ్ఞానాంబ. దీంతో ఏం చేయాలో తెలియదు మల్లికకు. జానకి చదువుతున్న విషయం చూపించి పోలేరమ్మతో శిక్ష వేయించాలనుకున్నాను. చివరకి నాకే శిక్ష పడింది అని అనుకుంటుంది మల్లిక.
మరోవైపు సాయంత్రం కాగానే.. బ్యాగ్ లో బుక్స్ పెట్టుకొని అకాడెమీకి బయలుదేరుతుంది జానకి. వాళ్లను మల్లిక గమనిస్తుంది. మరోవైపు బయటికి వెళ్దాం అనుకునేలోపు అక్కడే జ్ఞానాంబ, గోవిందరాజు కూర్చొంటారు. వాళ్లను చూసి షాక్ అవుతారు రామా, జానకి.
వాళ్లను చూసి జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. దీంతో బయట ఏదో వస్తువులు కొనుక్కోవాలట జానకి గారు అని అంటాడు. అసలే తనకు కాలు నొప్పి ఉంది ఇప్పుడు బయటికి ఎందుకు బావ గారు అంటుంది మల్లిక. దీంతో జానకి, రామా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.