Home » Entertainment » Janaki Kalaganaledu 20 September 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 20 Sep Today Episode : జ్ఞానాంబతో జెస్సీ పేరెంట్స్ వాగ్వాదం.. జెస్సీతో అఖిల్ పెళ్లి చేసేది లేదని తెగేసి చెప్పిన జ్ఞానాంబ

Authored By
Varun G
The Telugu News | Updated on: September 20, 2022 9:50 am
Advertisement

Janaki Kalaganaledu 20 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 సెప్టెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 392 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి.. అఖిల్ కు డీఎన్ఏ పరీక్ష చేయించాలని అనుకుంటుందని తెలుసుకున్న మల్లిక.. అఖిల్ తో సూసైడ్ నాటకం ఆడిస్తుంది. నన్ను చివరి క్షణంలో కాపాడినందుకు థాంక్స్ వదిన అంటాడు అఖిల్. దీంతో నేను ఎప్పుడూ నీకు సాయం చేయడానికే ఉన్నా. జానకిలా కాదు. తను నిన్ను అత్తయ్య గారి ముందు బ్లేమ్ చేయబోయింది అని చెప్పి అఖిల్ దగ్గర మార్కులు కొట్టేస్తుంది మల్లిక. మొత్తానికి అఖిల్.. సూసైడ్ నాటకం ఆడాడని జానకికి కూడా తెలుస్తుంది. అఖిల్ నిజంగా చనిపోవాలని అనుకోవడం లేదని, అసలు తనకు డీఎన్ఏ విషయం ఎలా తెలిసిందని రామాతో అంటుంది జానకి. దీంతో నిజమేనండి. మనిద్దరమే మాట్లాడుకున్న విషయం నిజంగానే అఖిల్ కు ఎలా తెలిసింది అని అనుమానిస్తాడు రామా.

Advertisement

janaki kalaganaledu 20 september 2022 full episode

దీంతో అఖిల్ కావాలనే సూసైడ్ నాటకం ఆడాడని, అత్తయ్య గారి ముందు డీఎన్ఏ పరీక్ష చేయించకుండా, సూసైడ్ నాటకం ఆడాడని చెబుతుంది. మనం వద్దు వద్దు అని అంతగా అంటుంటే లోపల ఉన్న అఖిల్ అప్పటి దాకా విషం ఎందుకు తాగలేదు. సరిగ్గా డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లే టైమ్ కే ఎలా విషం తాకబోయాడు. ఇదంతా నాటకమే కదా. అంటే.. అఖిల్ మనల్ని ప్రతి రోజు ఫాలో అవుతున్నాడు. అబ్జర్వ్ చేస్తున్నాడు. తెలివిగా తను చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నాడు. ఏది ఏమైనా.. అఖిల్ తో జెస్సీ పెళ్లి చేయాలి అని రామాతో జానకి అంటుంది.

Advertisement

మరోవైపు నీలావతి.. మల్లికకు జెస్సీ తండ్రి పీటర్ ఫోన్ నెంబర్ మెసేజ్ చేస్తుంది. దీంతో వెంటనే పీటర్ కు ఫోన్ చేసి.. జెస్సీ గురించి అఖిల్ గురించి చెబుతుంది. మీరెవరు అంటే మీ శ్రేయోభిలాషిని అంటుంది మల్లిక. జానకి మిమ్మల్ని మోసం చేస్తోంది. అఖిల్ తో  జెస్సీ పెళ్లి చేయదు అని అంటుంది. మీ కూతురు జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఆ జానకిని గుడ్డిగా నమ్ముతున్నారు అంటుంది మల్లిక.

దీంతో పీటర్, ఆయన భార్యకు అనుమానం వస్తుంది. రేపు ఉదయమే జ్ఞానాంబ ఇంటికి వెళ్దాం అని అంటాడు పీటర్. కట్ చేస్తే తెల్లవారుతుంది. జెస్సీ పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మల్లిక. వీళ్లు ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటుంది.

Advertisement

Janaki Kalaganaledu 20 Sep Today Episode : జ్ఞానాంబ ఇంటికి వచ్చిన పీటర్, ఆయన భార్య

అందరూ కలిసి టిఫిన్ చేస్తుండగా జ్ఞానాంబ గారు అంటూ పీటర్, ఆయన భార్య ఇద్దరూ వస్తారు. వాళ్లను చూసి జానకి, రామా షాక్ అవుతారు. ఎవరండి మీరు.. అని అడుగుతుంది జ్ఞానాంబ. ఇంట్లోకి వచ్చే ముందు అనుమతి తీసుకొని రావాలనే సంస్కారం లేదా అని అంటుంది జ్ఞానాంబ.

దీంతో పీటర్ కు కోపం వస్తుంది. మేము ఎవరమో, ఎందుకు వచ్చామో, ఎందుకు సంస్కారం లేకుండా ప్రవర్తించాల్సి వచ్చిందో మీ పెద్దకొడుకును, మీ పెద్ద కోడలును అడగండి. లేదంటే నా కూతురు జీవితంతో ఆడుకున్న మీ చిన్నకొడుకు అఖిల్ ను అడగండి. ఇంకా క్లియర్ గా తెలుస్తుంది.

మీ వాడు చేసిన పనికి నా కూతురు జెస్సీ ప్రాణాలు తీసుకోబోయింది. మీరు మాత్రం హాయిగా సకుటుంబ సపరివార సమేతంగా కూర్చొని టిఫిన్లు హాయిగా చేస్తున్నారు అంటాడు పీటర్. దీంతో చూడండి.. మా అఖిల్ అమాయకుడు అంటుంది మల్లిక.

దీంతో పెళ్లి కాకుండానే ప్రేమ పేరుతో ఆడపిల్లకు కడుపు చేసిన వీడు అమాయకుడా అని పీటర్ భార్య అంటుంది. చూస్తూ నిలబడ్డావు ఏంటి.. మీ అమ్మ గారికి చెప్పు అని అంటాడు పీటర్. కూర్చొని మాట్లాడుకుందాం అని గోవిందరాజు.

Advertisement

పది మంది వింటే పరువు పోతుందని మీరు బాధపడుతున్నారు. పెళ్లి కాకుండానే నా కూతురు గర్భవతి అయిందని పది మందికి తెలిస్తే ఆమె పరిస్థితి ఏంటి.. మా పరిస్థితి ఏంటి అని అంటాడు పీటర్.

నాలుగు రోజులు సమయం ఇస్తే మేమే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పాం కదా. ఇంతలోనే ఇంటికి వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటాడు రామా. దీంతో వాళ్లను ఏంట్రా బతిమిలాడేది అంటుంది జ్ఞానాంబ.

మీ కూతురు మీద మీకు నమ్మకం ఉన్నట్టే నాకొడుకు మీద కూడా నాకు నమ్మకం ఉంది అంటుంది జ్ఞానాంబ. మీ కోడలు, కొడుకు మాట విని మీతో ఇప్పటి దాకా మాట్లాడకుండా వెయిట్ చేశాను.

ఇప్పుడు మిమ్మల్నే అడుగుతున్నాను. చెప్పండి జ్ఞానాంబ గారు. మీ అబ్బాయితో నా కూతురు పెళ్లి చేస్తారా లేదా అని అడుగుతాడు పీటర్. ఇంతలో అక్కడికి జానకి వచ్చి తొందరపడకండి అంటుంది. కానీ.. పీటర్ వినడు.

Advertisement

ఇంత దూరం వచ్చాక ఇక ఆగేది లేదు. చెప్పండి జ్ఞానాంబ గారు. అర్థం చేసుకొని పిల్లల పెళ్లి చేస్తారా లేదా అని నిలదీస్తాడు పీటర్. దీంతో గొంతు పెద్దది చేసినంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదు. నా కొడుకు ఏ తప్పు చేయలేదు అని అంటుంది జ్ఞానాంబ. మీ కూతురుతో పెళ్లి చేయడం అనేది అసలు జరగని పని.. అని అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి