Home » Entertainment » Janaki Kalaganaledu 21 April 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 21 April Today Episode : జానకికి షాకిచ్చిన జ్ఞానాంబ… తనను క్షమించేది లేదని చెప్పిన జ్ఞానాంబ… ఈ విషయం రామాకు తెలుస్తుందా? జానకి నిర్ణయం ఏంటి?

Authored By
Varun G
The Telugu News | Published on: April 21, 2022, 11:30 am
Advertisement

Janaki Kalaganaledu 21 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 ఏప్రిల్ 2022, గురువారం ఎపిసోడ్ 284 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ.. రామా, జానకి ఇద్దరికీ హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. దీంతో జానకి, రామా ఇద్దరూ సంతోషిస్తారు. కానీ.. జ్ఞానాంబ పైకి మాత్రం నవ్వుతున్నట్టు కనిపించినా.. లోపల బాధపడుతూనే ఉంటుంది. నువ్వు, కోడలు ఇద్దరూ కుడి కాలు పెట్టి ముందుకు రండి అని అంటాడు గోవిందరాజు. దీంతో ఇద్దరూ జ్ఞానాంబ కాళ్ల మీద పడతారు. దీంతో నిండు నూరేళ్లు చల్లగా ఉండు నాన్న అని ఒక్క రామాను మాత్రమే దీవిస్తుంది జ్ఞానాంబ. జానకిని ఆశీర్వదించదు.

Advertisement

janaki kalaganaledu 21 april 2022 full episode

ఆ తర్వాత అందరూ సంతోషంగా ఉంటారు. మల్లికకు మాత్రం వాళ్లను ఇంట్లోకి రానివ్వడం అస్సలు నచ్చదు. జ్ఞానాంబ జానకితో పెద్దగా మాట్లాడదు. జానకి.. అందరూ భోం చేశాక మనం భోం చేద్దాం అని జ్ఞానాంబ చెబుతుంది. దీంతో సరే అత్తయ్య గారు అంటుంది జానకి. ఇంతలో జ్ఞానాంబ భోజనం కలిపి తీసుకొచ్చి రామాకు ఇస్తుంది. ఏమైంది అని అడుగుతుంది రామాను. తిను అంటుంది. అమ్మ నీ చేతి ముద్ద తిని చాలా రోజులు అయింది అమ్మ. ఇన్నాళ్లూ నీకు దూరంగా ఉండి.. నీ ప్రేమకు దూరం అయ్యాను. నీ చేతి ముద్దతో మళ్లీ ఆ ప్రేమను నాకు అందించమ్మా అంటాడు రామా.

Advertisement

దీంతో ముద్దలు కలిపి రామాతో పాటు అందరికీ తినిపిస్తుంది జ్ఞానాంబ. ఆ తర్వాత జ్ఞానాంబ, జానకి ఇద్దరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. నువ్వు వడ్డించుకో.. నాకు వద్దు అంటుంది జ్ఞానాంబ. తనది తాను వడ్డించుకుంటుంది జ్ఞానాంబ.

అత్తయ్య గారు మీరు ఏమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అంటుంది జానకి. దీంతో నువ్వు ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు. అందుకే.. నిన్ను ఒంటరిగా ఇక్కడ కూర్చోబెట్టాను. నేను నీతో ముభావంగా ఉంటున్నాను. నీతో సరిగ్గా మాట్లాడటం లేదు.

Advertisement

దానికి కారణం.. నేను క్షమించింది నా కొడుకును మాత్రమే.. కానీ నిన్ను కాదు అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి షాక్ అవుతుంది. మరోవైపు రామా.. తన బెడ్ రూమ్ లోకి వెళ్లి రూమ్ సర్దుతూ ఉంటాడు. నిన్ను మీ అన్నయ్య యోగి మాట్లాడేటప్పుడు నా కొడుకు ఒక మాట అన్నాడు.

Janaki Kalaganaledu 21 April Today Episode : నువ్వు నాకు చేసిన అవమానాలను జన్మలో మరిచిపోను అన్న జ్ఞానాంబ

నువ్వు లేకపోతే వాడు బతకలేడు అని. వాడు లేకపోతే నేను బతకలేను. వాడి కోసం.. వాడి క్షేమం కోసం నేను ఒక మెట్టు దిగి నిన్ను ఇంట్లోకి రానిచ్చాను తప్ప.. నువ్వు చేసినవన్నీ మరిచిపోయి కాదు.. క్షమించి అంతకన్నా కాదు. నిన్ను, నువ్వు నాకు చేసిన అవమానాలను ఈ జన్మలో మరిచిపోలేను అంటుంది జ్ఞానాంబ.

నీ చదువుకున్న తెలివితేటలతో నా కొడుకును నీ కొంగున కట్టేసుకున్నావు. నీ మాటలతో వాడిని ఆడిస్తున్నావు. నీ చదువుకున్న తెలివితేటలు నా కొడుకుకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందుకే.. నువ్వు ఏం చెబితే అది చేస్తున్నాడు వాడు. వాడిని చూస్తుంటే నాకు ఒక్కటే భయం. ఎక్కడ నా తమ్ముడికి పట్టిన గతి.. నా కొడుకుకు కూడా పడుతుందేమోనని.

ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. జానకి కూడా తన రూమ్ లోకి వస్తుంది. రామా సంతోషంగా ఉండటం చూస్తుంది జానకి. మా అమ్మ అవన్నీ మరిచిపోయి మీతో ప్రేమగా ఉండటం చూసి నాకు ఆనందంగా ఉంది అంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి