janaki kalaganaledu 21 february 2022 full episode
Janaki Kalaganaledu 21 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 ఫిబ్రవరి 2022, సోమవారం ఎపిసోడ్ 241 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకు ఈ ప్రేమికుల రోజును ఒక గొప్ప అనుభూతిగా ఉంచండి. నాకు మీరు ఇచ్చే బహుమతి ఇదే. నా మీద ఒట్టేసి చెప్పండి.. మీరు ఐపీఎస్ కలను వదిలేసుకోవడం వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి అని అడుగుతాడు రామా. దీంతో తన అత్తయ్య చెప్పిన మాటలే తనకు గుర్తొస్తాయి. ఐపీఎస్ కలను నీటిలో దీపాన్ని వదిలేసినట్టు వదిలేయాలని జ్ఞానాంబ చెప్పిన విషయమే తనకు గుర్తొస్తుంది. దీంతో ఏం చెప్పాలో తెలియక.. అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది జానకి. దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు.
janaki kalaganaledu 21 february 2022 full episode
మరోవైపు దిలీప్.. జ్ఞానాంబ ఇంటికి వస్తాడు. తన వెనుక ఏదో గిఫ్ట్ పట్టుకొని వస్తాడు. అదే సమయంలో జ్ఞానాంబ ఇంటికి వస్తుంది. దిలీప్ ను చూసి వెన్నెల షాక్ అవుతుంది. ఏంటి నువ్వసలు.. నీకు మైండ్ పనిచేస్తుందా. నువ్వు అసలు ఎందుకు వచ్చావు. నీకు మైండ్ పని చేస్తుందా అంటుంది. రిలాక్స్ అని అంటాడు దిలీప్. హ్యాపీ వాలెంటైన్స్ డే వెన్నెల అని తను తీసుకొచ్చిన గిఫ్ట్ ఇస్తాడు. థ్యాంక్స్ అని చెబుతాడు. సరే.. సరే.. ఇక నువ్వు వెళ్లు. అమ్మ చూస్తే ప్రాబ్లమ్ అవుతుంది. వెళ్లిపో అంటుంది వెన్నెల. అంతలోనే జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. దిలీప్, వెన్నెలను చూస్తుంది. ఎవరు నువ్వు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో ఏం చెప్పాలో అర్థం కాదు దిలీప్ కు. వెన్నెల ఎవరే అని అడుగుతుంది.
దీంతో వెంటనే అక్కడికి వచ్చిన జానకి.. దిలీప్ అత్తయ్య అంటుంది. దిలీపా.. నేను ఎప్పుడూ ఇక్కడ చూడలేదే అంటాడు. దీంతో అదే అత్తయ్య.. నేను చెప్పాను కదా.. మా చుట్టాలబ్బాయి ఉన్నాడని. అతడే ఈ అబ్బాయి అని చెబుతుంది జానకి.
మరి నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు అని వెన్నెలను ప్రశ్నిస్తుంది. దీంతో మాట్లాడటం లేదు అమ్మ.. జానకి వదిన గురించి అడుగుతుంటే చెబుతున్నాను అంతే అంటుంది వెన్నెల. దీంతో సరే.. నువ్వు వెళ్లు అంటుంది. దిలీప్ ను కూర్చోబెట్టి అన్ని విషయాలు అడుగుతుంది జ్ఞానాంబ.
ఏం చేస్తావు అంటే.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంటాడు. ఎక్కడ అంటే హైదరాబాద్ అంటాడు. ఇంతలో మల్లిక వచ్చి అనుమానంగా దిలీప్ ను చూస్తూ ఉంటుంది మల్లిక. ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టు ఉంది అత్తయ్య గారు అంటుంది మల్లిక.
ఎక్కడ చూశాను అని ఆలోచిస్తుంటుంది మల్లిక. దీంతో ముందు నువ్వు వెళ్లి టీ తీసుకురా అని మల్లికతో చెబుతుంది జ్ఞానాంబ. దీంతో ఆగండి.. నాకు టీ తాగడం అలవాటు లేదు అంటాడు. ఇక నేను వెళ్లొస్తాను అంటాడు దిలీప్. దీంతో సరే అంటుంది జ్ఞానాంబ.
దిలీప్ వెళ్లిపోయాక.. అమ్మ.. పిల్లాడు చూస్తే మంచోడిలా ఉన్నాడు. మన వెన్నెలకు ఈడుజోడు బాగానే ఉంటుంది అంటాడు. కానీ.. రామచంద్రాపురం సంబంధంలా కాకుండా.. అన్ని విషయాలు తెలుసుకొని ఈ సంబంధం ఖాయం చేసుకుందాం అని చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇంతలో జ్ఞానాంబకు ఎస్ఐ శ్రీనివాసరావు ఫోన్ చేస్తాడు. మీ పెద్దకోడలు ఐపీఎస్ గురించి మీతో మాట్లాడటానికి మొన్న మీ ఇంటికి వచ్చాం కదా. మీ ఇంట్లో వాళ్లు మాట్లాడుకొని ఒక నిర్ణయం చెబుతామన్నారు కదా. మీవైపు నుంచి ఎటువంటి సమాచారం లేదు. మీ నిర్ణయం చెబితే డీజీపీకి చెబుతాను అంటాడు ఎస్ఐ.
దీంతో రేపు మా కొడుకు, కోడలు వచ్చి వాళ్ల నిర్ణయం చెబుతారు.. అంటుంది. అప్పుడే జానకి వచ్చి జ్ఞానాంబకు మజ్జిగ ఇస్తుంది. మజ్జిగ తాగాక.. అప్పుడే రామా కూడా వస్తాడు. దీంతో రామా ముందే.. నాకు చదువుకోవడం ఇష్టం లేదని చెప్పా కదా అత్తయ్య. మీరు ఎస్ఐ గారికి నా నిర్ణయం చెప్పలేకపోయారు అంటుంది జ్ఞానాంబ.
దీంతో నీ నిర్ణయం నాకు ఎందుకు. వెళ్లి రేపు ఎస్ఐతో చెప్పు అంటుంది జ్ఞానాంబ. దీంతో రామాకు కోపం వస్తుంది. సాక్షాత్తూ నువ్వే ఒప్పుకున్నాక.. జానకి గారరు ఎందుకు ఐపీఎస్ చదవాలని అనుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. నువ్వైనా జానకి గారికి చెప్పమ్మా అంటాడు రామా.
కానీ.. జ్ఞానాంబ ఏం మాట్లాడదు. జానకి మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకండి. నాకు చదువు కోవడం ఇష్టం లేదు అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రామా.. జానకికి ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పు.. ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని చెబుతుంది జ్ఞానాంబ.
మరోవైపు రామాను పిలిచి.. రాజవరం వాళ్లు డబ్బులు పంపించారని.. వాటిని లాకర్ లో పెట్టాలని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో సరే అమ్మ అంటాడు. జానకి చదువు కాగితాలు అందులోనే పెట్టాను. ఒకవేళ రామా చూస్తే జానకి చదువు ఆపడానికి కారణం నేనే అని తెలుస్తుంది అని అనుకొని టెన్షన్ పడుతుంది జ్ఞానాంబ.
ఇంతలో రామా లాకర్ ఓపెన్ చేస్తాడు. డబ్బు అందులో పెట్టబోతుండగా.. కొన్ని నోట్లు కింద పడిపోతాయి. ఆ నోట్లను తీసి అందులో పెట్టబోతాడు. అప్పుడే జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Amala Paul : తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అమలాపాల్. తెలుగులో ఆరు సినిమాలే…
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం మనందరకి తెలిసిందే.. పాకిస్తాన్‌తో…
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంతలు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
This website uses cookies.