Home » Entertainment » Janaki Kalaganaledu 21 January 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 21 Jan Today Episode : జానకి చనిపోలేదు.. బతికే ఉంది అని తెలుసుకున్న రామా.. జానకి గురించి తెలుసుకొని మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్న జ్ఞానాంబ

Authored By
Varun G
The Telugu News | Published on: January 21, 2022, 10:30 am
Advertisement

Janaki Kalaganaledu 21 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 జనవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 220 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆసుపత్రికి వెళ్లి మార్చురీలో జానకి మృతదేహం కోసం వెతుకుతుంటారు రామా, జ్ఞానాంబ, గోవిందరాజు, వెన్నెల. అక్కడ వరుసగా ఉన్న శవాలను చూస్తుంటారు. జానకికి ఏం కాకూడదని మనసులో అనుకొని ఒక్కొక్కరిని చూస్తూ వెళ్తుంటాడు రామా. జ్ఞానాంబ కూడా టెన్షన్ తో భయపడుతూ ఉంటుంది. తన మృతదేహాన్ని చూడలేకపోతాడు రామా. అక్కడున్న మృతదేహాల్లో జానకి మృతదేహం కనిపించకపోవడంతో జానకి బతికే ఉందని అనుకుంటాడు రామా. అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఒరేయ్ రామా.. తను జానకి కాదు. అంటే జానకి బతికే ఉంది అనుకుంటారు. మరి జానకి ఏమైంది అని అనుకుంటారు.

Advertisement

janaki kalaganaledu 21 january 2022 full episode

కట్ చేస్తే జానకి గుడిలో దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. పక్కనే శ్రావణి కూడా ఉంటుంది. పూజ అయిపోయాక.. ఇద్దరూ బయటికి వస్తారు. వెంటనే జానకి.. రామాకు ఫోన్ చేస్తుంది. వెన్నెల లిఫ్ట్ చేస్తుంది. వదిన అంటుంది. వెంటనే రామాకు ఫోన్ ఇస్తుంది. ఎక్కడున్నారండి మీరు అని అడుగుతాడు. శ్రావణి దగ్గర ఉన్నాను అంటుంది జానకి. మరి మీరు బస్సు ప్రమాదంలో చనిపోయారని పేరు చెప్పారు అంటాడు రామా. దీంతో జరిగిన విషయం చెబుతుంది జానకి. మీరు బస్సు ఎక్కించాక నన్ను పికప్ చేసుకుంటానంటే నేను బస్సు దిగిపోయాను. ఆ తర్వాత అదే బస్సుకు యాక్సిడెంట్ అయిందని చెబుతుంది. బస్సు దిగే హడావుడిలో ఫోన్ ను బస్సులోనే మరిచిపోయాను. గమనించుకోలేదు. రామా గారు నేను క్షేమంగానే ఉన్నాను. కంగారు పడకండి అంటుంది. మీరు ఎక్కడున్నారు అంటే పసలపూడి అమ్మవారి గుడిలో ఉన్నాను అంటుంది జానకి. దీంతో వెంటనే అక్కడికి అందరూ బయలుదేరుతారు.

Advertisement

రామా బండి వేసుకొని అక్కడికి వచ్చి జానకిని చూస్తాడు. జానకిని గట్టిగా హత్తుకుంటాడు. మీరు కాల్ చేసి నాకు ఊపిరి పోశారు జానకిగారు. మీరు ఫోన్ చేయడం ఒక్క క్షణం ఆలస్యమైనా నేను మీ ముందు ఇలా ఉండేవాడిని కాదండి. అసలు ఉండేవాడినో కాదో కూడా తెలియదు అంటాడు రామా. మన ప్రాణాలు వేరైనా ఒకే ఊపిరిగా బతుకుతున్నాం. మీకు ఏమైనా అయితే ఈ ఊపిరి ఉంటుందా చెప్పండి అంటాడు రామా.

మన ప్రేమ నాకు తోడుగా ఉంది. ఆ ప్రేమ నన్ను చాలాసార్లు.. చాలా కష్టాల నుంచి కాపాడింది. ఇప్పుడు కూడా మీ ప్రేమే నన్ను ఈ ప్రమాదంలో పడకుండా తప్పించింది అంటుంది జానకి. మీకు ప్రమాదం జరిగిందని తెలియగానే ఈ ప్రాణం ఉందో లేదో పోయిందో కూడా తెలియలేదు.

Advertisement

Janaki Kalaganaledu 21 Jan Today Episode : ఇక నుంచి మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టను అని జానకికి మాటిచ్చిన రామా

జానకి గారు.. ఈ గుడి సాక్షిగా మీకు మాటిస్తున్నాను. మరోసారి మీకిలాంటి పరిస్థితి రానివ్వను అంటాడు రామా. ఇంతలో కారులో జ్ఞానాంబ, గోవిందరాజు, వెన్నెల వస్తారు. జానకిని చూసి మురిసిపోతారు. వదిన అంటూ వెన్నెల వచ్చి హత్తుకుంటుంది. జ్ఞానాంబ మాత్రం జానకి దగ్గరికి రాదు.

జ్ఞానాంబ.. జానకి దగ్గరికి రాకపోయేసరికి.. గోవిందరాజు వెళ్లి దేవుడి దయవల్ల కోడలుకు ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. జరిగిందేదో జరిగిపోయింది. కోడలును ఇంటికి తీసుకెళ్దాం పదా జ్ఞానం అంటాడు గోవిందరాజు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ పంతాలు పట్టింపులు ఏంటి అంటాడు.

వాడికి అమ్మంటే ఎంత ప్రేమో.. భార్య అంటే కూడా అంతే ప్రేమ అంటాడు. నీ మాటకు నీ కొడుకు ఎంత విలువను ఇస్తాడో భార్య విషయంలో కూడా అంతే బాధ్యతగా ఉంటాడు. జానకి దూరం అయితే వాడు బతకలేడు. వాళ్లిద్దరూ ఒకరిని వదిలిపెట్టి మరొకరు ఉండలేరు అంటాడు గోవిందరాజు.

ఆ బాధతో వాళ్లు మనకు దక్కకుండా పోతారు. నీకొడుకుకు ఏదైనా అయితే నువ్వు బతకగలవా చెప్పు.. అని గోవిందరాజు అంటాడు. అన్నీ తెలిసిన నీకు మరొకరు చెప్పాలా చెప్పు. ఇంకేం ఆలోచించకు. కోడలును ఇంటికి తీసుకెళ్దాం పదా అంటాడు.

Advertisement

జానకి ఇంటికి రావాలంటే మేమిద్దరం ఒకచోటుకు వెళ్లాలి అంటుంది జ్ఞానాంబ. జానకి దగ్గరికి వెళ్లి తనను తీసుకొని వెళ్తుంది జ్ఞానాంబ. తోటకు జానకిని తీసుకొని వస్తుంది జ్ఞానాంబ. ఇంతలో కన్నబాబు బండి మీద అక్కడికి వస్తాడు. పరిగెత్తుకుంటూ జ్ఞానాంబ దగ్గరికి వస్తాడు.

అర్జెంట్ గా రమ్మని కబురు చేశారు. ఏమైందండి అంటాడు కన్నబాబు. నా కోడలు ఎందుకు నిన్ను కొట్టింది. ఏం గొడవ.. ఏం జరిగింది అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో కన్నబాబు నీళ్లు మింగుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి