Janaki Kalaganaledu 22 August 2022 Episode : తల్లి కాబోతున్న మల్లిక.. సంతోషంతో పొంగిపోతున్న జ్ఞానాంబ.. జానకి .. !

Janaki Kalaganaledu 22 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 371 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. జానకి చదువుతూ ఉండగా రామ పక్కన పడుకొని ఉండగా జ్ఞానంబ చూస్తూ తనకి చెప్పిన కానీ రామాని పక్కన ఉన్న కానీ పట్టించుకోవడం లేదు అని అనుకుంటూ జ్ఞానంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మల్లిక సరదాగా పనులు చేస్తూ ఉంటుంది. ఇంతలో జ్ఞానం బ జానకిని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు జానకిని నీకు నేను నీ చదువుకోవడానికి ఒప్పుకున్నప్పుడు నేను కొన్ని షరతులు పెట్టాను. కానీ నువ్వు వాటిని ఫాలో అవ్వడం లేదు. నీ భర్తకి నీకు ఏకాంతం దూరం కావద్దనే కదా నేను రాత్రి చదువును వద్దని ఉదయం కాలేజీకి వెళ్లమని చెప్పాను కదా మరి నా మాట అంటే నీకు లెక్క లేదా ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావ్.. అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు జానకి అయ్యో మీ మాటంటే నాకు చాలా గౌరవం అత్తయ్య గారు మీ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టను అని అంటుంది.

ఇదేనా నమ్మకం పోగొట్టను అనేది అని జ్ఞానంబా అంటుంది.. అంతలో మల్లిక మధ్యలో దూరి జానకి ఒక తప్పు చేసింది. అత్తయ్య గారు ఒక నెంబర్ ని కొట్టియండి అని అరుస్తుంది. అప్పుడు గోవిందరాజు ఎప్పుడు పుల్లలు పెడదామా తోట తోటి కోడలు,మీద జాడీలు చెబుదామా ఇదే పని నీకు అని తనని తిడతాడు. అంతలో రామ తనకి పరీక్షలు ఉన్నాయి కదా అమ్మ నేనే సమయం వృధా చేయకు చదువుకో అని చెప్పానమ్మా అని అంటాడు. తను నా విషయంలో నిర్లక్ష్యం చేయదమ్మ అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ ఈ విషయం గురించి చర్చించడం ఇదే చివరి చారి కావాలి. ఇంకోసారి ఈ చర్చ వస్తే నా కోపానికి నువ్వు భలేవాల్సి వస్తుంది అని చెప్పి తను వెళ్ళిపోతుంది. అప్పుడు మల్లికా నేనంటే ఎవరికీ లెక్కలేదు అని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే కాలేజీలో జెస్సి అఖిల్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో జానకి అక్కడికి వెళ్లి ఏమైంది జెసి అని అడుగుతుంది. అప్పుడు జెసి ఆవిడ మీ అత్తగార అని అడుగుతుంది. అవును జెస్సి అని చెప్తుంది.అప్పుడు ఆవిడకి నామీద పీకలు దాకా కోపం ఉంది.

Janaki Kalaganaledu 22 August 2022 Full Episode

నా మీద చెడు అభిప్రాయం ఉన్నది ఇప్పుడు మా పెళ్ళికి ఎలా ఒప్పుకుంటుందో ఏంటో అని అనగానే.. పెళ్లేంటి జెసి మీరిద్దరూ ఫ్రెండ్స్ మాత్రమే కదా.. కాదక్కా నేను అఖిల్ రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం.. ఇప్పుడు నువ్వే మా పెళ్ళికి హెల్ప్ చేయాలి అక్క నువ్వు మీ అత్తయ్య గారికి నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలి అని జెస్సి అంటుంది. అప్పుడు జానకి చూడు జెసి మీది ఇప్పుడు తెలిసి తెలియని వయసు కేవలం అట్రాక్షన్ మాత్రమే అని జానకి అంటుండగా.. లేదక్కా అఖిల్ మీద నాకు జెన్యూన్ లవ్ ఉంది. తన లేకుండా నేను బ్రతకలేను తన దూరమైతే నాకు చావే గతి అని అంటుంది. అప్పుడు జానకి జెసి ఎందుకు అలా మాట్లాడుతున్నావ్.. నువ్వు అర్థం చేసుకో మా అత్తయ్య గారు సంప్రదాయాలలో అలాగే కొన్ని విషయాలు చాలా నిక్కచ్చిగా ఉంటారు. తను అన్ని పద్ధతి ప్రకారంగానే నడవాలి అని అనుకుంటుంది. ఆవిడకి నీకు ఒక చిన్న ఘర్షణ జరిగింది కదా ఆవిడ నిన్ను అంగీకరించడం కూడా చాలా కష్టమే జెస్సి… అని అంటుంది జానకి. అప్పుడు జెస్సి నేను తనకి సారీ చెప్తాను అక్క అని అంటుంది.

అది కాదు జెసి మా అత్తయ్య కొన్ని సాంప్రదాయాన్ని చాలా నమ్మకంగా పాటిస్తుంది. తన నమ్మకాలను వమ్ము చేయకూడదు అలాగే తన చెప్పిన పద్ధతులను కచ్చితంగా పాటించాలి అని అంటుంది. అప్పుడు జెస్సి చావైనా బతుకైనా అఖిల్ తోనే.. తనతో పెళ్లి జరగకపోతే ఇద్దరం కలిసి చచ్చిపోతాం అని జెస్సి అంటుంది. కట్ చేస్తే జ్ఞానాంబ గోవిందరాజు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా.. మల్లిక వచ్చి వాంతులు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏమైందే మల్లికా అని అడుగుతుంది. అప్పుడు గోవిందరాజు రాత్రి ఏ చికెన్, మటన్ తిని ఉంటుంది అందుకే అలా వామిటింగ్స్ చేసుకుంటుంది అని అంటాడు. అప్పుడు మల్లికా లేదు మావయ్య గారు నేను రాత్రి నుంచి కూడా ఏమీ తినలేదు అని అంటుండగా అంతలో అక్కడికి ఒక ఆవిడ వస్తుంది. అప్పుడు ఆవిడ మల్లికను వాంతులు చేసుకుంటూ ఉండగా.. చూసి నీ చెయ్యి ఇలా ఇవ్వు అని అంటుంది. అప్పుడు ఆవిడ మల్లికా చెయ్యి పట్టుకుని చూసి గోవిందరాజుని నువ్వు తాతయ్య కాబోతున్నావు.. జ్ఞానం బా నువ్వు నాయనమ్మ కాబోతున్నావు.. నాకు పట్టుచీర పెట్టాలి అని చెప్తుంది.

అప్పుడు అందరూ సంతోష పడిపోతూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ మల్లిక ఆసుపత్రికి వెళ్దాం పద అని అంటుంది. అప్పుడు ఆ పెద్దావిడ నేను చెప్పాక కూడా మళ్లీ ఆసుపత్రి అంటావేంటి జ్ఞానంబ అని అంటుంది. అప్పుడు అందరూ తనకి శుభాకాంక్షలు తెలియజేస్తారు స్వీట్స్ పంచి పెడుతూ సంతోషంతో పొంగిపోతూ ఉంటారు. కట్ చేస్తే జ్ఞానంబ, గోవిందరాజు మల్లిక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ ఈ సంతోషాన్ని సంబరంగా జరుపుకోవాలని ఉంది అని అంటుంది. అప్పుడు గోవిందరాజు నువ్వే ఒకరోజు మల్లికా కంటే ముందు జానకి కడుపు పండాలి లేదంటే అందరూ ఏదో ఒకరకంగా మాట్లాడుకుంటారు అని చెప్పావు కదా.. మరి నువ్వు రేపు ఏదైనా ప్రోగ్రాం పెట్టినప్పుడు మల్లికను దీవిస్తూ జానకిని సూట్ పోటు మాటలు అంటుంటే తను తట్టుకోగలదా.. అని అంటాడు గోవిందరాజు .తనకోసం మల్లిక నా సంతోషాన్ని ఎందుకు దూరం చేసుకోవాలి అని ఏలెత్తి చూపిస్తే మనం ఏం సమాధానం చెప్పగలం అని జ్ఞానంబ అంటుండగా.. అదంతా జానకి వింటూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

Recent Posts

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

17 minutes ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

2 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

5 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

7 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

19 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

22 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 day ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

1 day ago