Janaki Kalaganaledu 22 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 ఫిబ్రవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 242 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ.. రామాకు డబ్బులు ఇచ్చి లాకర్ లో పెట్టమంటుంది. అదే లాకర్ లో జానకి సర్టిఫికెట్లు ఉంటాయి. ఆ విషయం తెలిసి వెంటనే రామా దగ్గరికి వస్తుంది. రామా.. లాకర్ ఓపెన్ చేసి డబ్బులు పెట్టబోతుండగా.. డబ్బులు కింద పడిపోతాయి. దీంతో వాటిని ఏరే సమయానికి జ్ఞానాంబ వస్తుంది. రామా.. నేను డబ్బులు పెడుతానులే అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో సరే అమ్మ అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రామా. మరోవైపు రామా, జానకి ఇద్దరూ కలిసి బండి మీద వెళ్తూ ఉంటారు. రామా, జానకి ఇద్దరూ ముభావంగా ఉంటారు.
ఐపీఎస్ కలను వదిలేయడం అంటే.. ఫ్రాణాన్ని వదిలేయడమే అని జానకి గారు చాలా సార్లు చెప్పారు. అటువంటిది తన కలను ఎలా వదిలేసుకున్నారు. ఎలాగైనా జానకి గారిని ఐపీఎస్ ను చేయాలి అని అనుకుంటాడు రామా. రామా గారికి ఎలాగైనా నచ్చజెప్పాలి. తన మనసులో ఉన్న బాధను పోగొట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఓ చెట్టు కింద ఓ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. పుస్తకాన్ని చింపేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసిన జానకి.. రామా గారు బండి ఆపండి అని అంటుంది. ఏమైంది అమ్మ.. ఎందుకు అలా బుక్స్ చింపేస్తున్నావు అని అంటుంది. దీంతో నా కష్టాన్ని చూసి నవ్వుకునేవారు ఉన్నారు. మీకెందుకు. మీ పని చూసుకోండి అంటుంది ఆ అమ్మాయి.
దీంతో అదేం కాదు కానీ.. నీకు ఏమైందో చెప్పు. నీ కష్టాన్ని మాతో చెప్పుకో. ఇదే నీ కష్టాన్ని చెప్పుకోవడం చివరి అంటాడు. ఓ ఎంపీ కొడుకు నన్ను వేధిస్తున్నాడు అంటుంది. చదువుకోలేకపోతున్నాను అంటుంది. దీంతో ఏం చేయాలో జానకికి అర్థం కాదు.
ఆ ఎంపీ కొడుకుకు నేను బుద్ధి చెబుతాను అంటుంది జానకి. నువ్వు నాతోరా అంటుంది. జానకి గారు ఆగండి అంటాడు రామా. రామా గారు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలనుకున్న వాళ్లను ఇలా చేసే వాళ్లను అస్సలు వదిలిపెట్టకూడదు అంటుంది.
దీంతో జానకి గారు అటువంటి వాళ్లను ఎదుర్కోవడానికి అధికారం ఉండాలి. అని చెప్పి వెంటనే ఎస్పీకి ఫోన్ చేస్తాడు. నీ సమస్య తీరుతుందమ్మా. ఆయన అతడి మీద కేసు ఫైల్ చేస్తానన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా వెళ్లి కాలేజీలో చదువుకో. నువ్వు కన్న కలలను నిజం చేసుకో అంటాడు రామా.
మీరు చేసిన హెల్ప్ కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్ అంటుంది సుమతి. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కంటికి కనిపించేది ఒక్కటే.. ఇలా కనిపించనివి బోలెడు ఉంటాయి అని చెబుతాడు రామా. లేదంటే వాళ్ల ఇష్టాలను కోరికలను కోల్పోవాల్సి ఉంటుంది అని చెబుతాడు రామా.
ఆ తర్వాత జానకిని ఒక చోటుకు తీసుకొని వస్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది జానకి. దీంతో పదండి అంటాడు రామా. అక్కడ తన అమ్మానాన్న సమాధులు ఉంటాయి. వాటిని చూసి జానకి వెక్కి వెక్కి ఏడుస్తుంది.
ఐపీఎస్ చదవడం ఇష్టం లేదు అని మీరు ఇప్పుడు డీజీపీ గారికి చెప్పాలి. ఎందుకు ఇష్టం లేదు. కారణం ఏంటి అని నేను మిమ్మల్ని నిన్న అడిగాను. ఇప్పుడు మీరు ఐపీఎస్ చదవి తీరాలని కూడా చెప్పాను. దీంతో కారణం చెప్పలేదు.. నిర్ణయం కూడా చెప్పలేదు అంటాడు రామా.
దీంతో నేను మీకు ముందే చెప్పాను కదా రామా గారు.. నాకు ఐపీఎస్ చదవాలంటే ఇంట్లో పనులు చూసుకోవడం ఇబ్బంది అవుతోంది అంటుంది. దీంతో మీరు ఐపీఎస్ వదిలేయడానికి కారణం మా అమ్మే కదా అంటాడు రామా. దీంతో అయ్యో అదేం లేదు రామా గారు అంటుంది.
కానీ.. అందుకే మీ సర్టిఫికెట్లు అమ్మ తీసుకుంది అంటాడు రామా. అమ్మ గదిలో మీ సర్టిఫికెట్స్ నేను చూశాను అంటాడు రామా. ఏం జరిగి ఉంటుందో.. అమ్మ దగ్గర మీ సర్టిఫికెట్లు ఎందుకు ఉన్నాయో నేను ఊహించగలను. నేను ఎంత అడిగినా.. మీరు కారణం ఎందుకు చెప్పట్లేదో నేను అర్థం చేసుకోగలను అంటాడు రామా.
దీంతో ఇందులో అత్తయ్య గారి తప్పేమీ లేదు రామా గారు.. అంటుంది జానకి. మీ మీద ప్రేమతోనే నా సర్టిఫికెట్లు అత్తయ్య గారు తీసుకున్నారు. అందుకే అత్తయ్య గారికి నా సర్టిఫికెట్లు ఇచ్చేశాను.. అని అసలు నిజం చెప్పేస్తుంది జానకి.
భవిష్యత్తులో నాకేం అవుతుందో అని అమ్మ మీ సర్టిఫికెట్లు తీసుకుంది. అమ్మ ఏమనుకుంటుందో అని మీ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. బాగుంది జానకి గారు. మీరిద్దరూ నా గురించి మాత్రం ఆలోచించలేకపోయారా.. అని అంటాడు రామా. నా ఐపీఎస్ కలను మీ ద్వారా తీర్చుకోవాలనుకున్నాను.
కానీ.. అమ్మ భయం, మీ త్యాగం ఆ కలను చంపేశాయి అంటాడు రామా. మీరు మీ చదువును త్యాగం చేసి ప్రతిక్షణం మీలో నరకాన్ని చూస్తున్నారు. నా కారణంగా నా భార్య ఐపీఎస్ కలను వదిలేసుకుందని నేను అనుక్షణం బాధపడుతున్నాను. మనిద్దరం ఇలా బాధపడుతూనే జీవితాంతం ఉండాలా అని ప్రశ్నిస్తాడు రామా.
చిన్నప్పటి నుంచి ఊపిరిగా పెరిగిన మీ కలను వదిలేసుకొని మీరు ఉండగలరా? అని ప్రశ్నిస్తాడు రామా. మూడు ముళ్ల బంధం.. ఏడు అడుగులతో మొదలైన నూరెళ్ల బంధం. ఎనిమిది నెలలుగా జీవిత ప్రయాణం. నా భార్య మనసు ఏంటో తెలిసిన నాకు.. ఆ మనసులోని బాధ అర్థం కాదా. వదిలేశాను అని చెప్పినంత తేలిక కాదు జానకి గారు.. బాధను వదిలేయడం అంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.