Home » Entertainment » Janaki Kalaganaledu 22 November 2021 Episode Highlights
Entertainment

Janaki Kalaganaledu 22 Nov Episode Highlights : నీ పెళ్లాం చెంప పగులగొట్టు అని రామాకు చెప్పిన మైరావతి.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామా

Authored By
Varun G
The Telugu News | Published on: November 21, 2021, 2:00 pm
Advertisement

Janaki Kalaganaledu 22 Nov Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. శని, ఆదివారాల్లో సీరియల్ ప్రసారం కాదు. తిరిగి.. సోమవారం ప్రసారం అవుతుంది. 22 నవంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 176 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి పూజకు లేట్ గా వచ్చిందని పూజను మైరావతి ఆపించేసిన విషయం తెలిసిందే. అలా పూజను అర్ధాంతరంగా ఆపేయడం మంచిది కాదని.. జ్ఞానాంబ మైరావతికి సలహా ఇస్తుంది. దీంతో నువ్వు నాకు చెబుతున్నావా? ఒక్కసారి నేను చెప్పానంటే ఇక అంతే ఫైనల్ అని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది మైరావతి.

Advertisement

janaki kalaganaledu 22 november 2021 episode highlights

మైరావతి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఏం చేయాలో జ్ఞానాంబకు అర్థం కాదు. పూజను ఎలాగైనా కొనసాగించాలని అనుకుంటుంది. దీంతో మైరావతి దగ్గరికి వెళ్లి.. జానకి ఎందుకు పూజకు లేటుగా వచ్చిందో చెబుతుంది. జానకి కాలికి గాయం అవడం వల్ల జానకి పూజకు లేట్ గా వచ్చిందని చెబుతుంది జ్ఞానాంబ. అయినా కూడా మైరావతి వినదు. పట్టించుకోదు. నాకు ఇవేమీ చెప్పొద్దు. నేను మాటంటే మాటే. ఈ పూజ జరగదు. జరగడానికి వీలు లేదు.. అని కరాఖండిగా చెప్పేస్తుంది.

Advertisement

ఈ పూజ జరుగుతుంది. జరిగితీరుతుంది అని జ్ఞానాంబ అంటుంది. దీంతో మైరావతి షాక్ అవుతుంది. మైరావతితో పాటు.. ఇంట్లోని వాళ్లంతా షాక్ అవుతారు. ఎట్టెట్టా.. ఈ పూజ జరుగుతుందా? ఎలా అంటుంది మైరావతి. నేను జరిపిస్తాను అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 22 Nov Episode Highlights : మైరావతి వద్దన్నా పూజలో కూర్చున్న జ్ఞానాంబ

దీంతో మైరావతి షాక్ అవుతుంది. చూశావా.. చివరకు నా కోడలు కూడా నామాట వినడం లేదు. నా మాట కాదని ఈ పూజ ఎలా చేస్తావో నేనూ చూస్తాను అంటుంది మైరావతి. మనం చేసే పూజలో పితృదేవతలకు చేసే పూజ కూడా ఉంటుంది. ఆ పూజను అర్ధాంతరంగా ఆపేస్తే.. వాళ్ల ఆత్మకు శాంతి కలగదు. అందుకే.. ఈ పూజను నేను ఎలాగైనా చేస్తాను.. అని అంటుంది జ్ఞానాంబ.

Advertisement

వెంటనే అందరినీ తీసుకెళ్లి పూజలో కూర్చోబెడుతుంది. రామా, జానకితో కలిసి పూజ చేయిస్తుంది. నా మాట కాదని.. పూజ చేస్తారా అని మైరావతి చాలా బాధపడుతుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఒరేయ్ రామా.. నువ్వయినా చెప్పురా.. మీ అమ్మను ఈ పూజ ఆపేయమని చెప్పురా అంటుంది.

అయినా రామా కూడా వినడు. లేదు నానమ్మా.. పూజ మధ్యలో ఆపేయడం మంచిది కాదు. నువ్వు కూడా వచ్చి పూజలో కూర్చో అంటాడు. అయినా కూడా మైరావతి వినదు. ఏం చేయాలో అర్థం కాదు మైరావతికి. నేను వద్దన్నా పూజ జరిగిపోతోందని టెన్షన్ పడుతుంది మైరావతి.

మరోవైపు నేను ఏం చెప్పినా చేస్తా అని అన్నావు కదా అని రామాను అడుగుతుంది మైరావతి. చేస్తాను నానమ్మా.. నువ్వు ఏం చెప్పినా చేస్తా అంటాడు. అయితే కొట్టరా.. అంటుంది. నీ పెళ్లాం చెంప పగులగొట్టు అంటుంది. దీంతో జానకి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి