Home » Entertainment » Janaki Kalaganaledu 22 October 2021 Friday Episode
Entertainment

Janaki Kalaganaledu 22 Oct Today Episode : రామాకు జానకి విడాకులు.. భర్త నుంచి దూరంగా వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డ జానకి

Authored By
Varun G
The Telugu News | Published on: October 22, 2021, 1:00 pm
Advertisement

Janaki Kalaganaledu 22 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 అక్టోబర్ 2021, శుక్రవారం, 155 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీకు నిజం చెప్పకపోవడంలో జానకి గారి కంటే నేనే ఎక్కువ తప్పు చేశానని జ్ఞానాంబతో రామా అంటాడు. అసలు నన్ను మోసం చేసింది జానకి కాదు.. నా కొడుకే అన్నమాట అని బాధపడుతుంది జ్ఞానాంబ. ఇప్పుడు నా పెంపకం మీదనే నాకు సిగ్గేస్తుంది.. అని అంటుంది జ్ఞానాంబ. మీకు కావాలని అబద్ధం చెప్పలేదు అమ్మ అంటాడు రామా. నేను కూడా మీలాగే గుడ్డిగా నమ్మాను. ప్రపంచంలో ఎవరి కొడుకైనా మారుతాడేమో కానీ.. నా కొడుకు మారడు అనుకున్నా. నా కొడుకు ఈ తల్లిమాట జవదాటడు అని అనుకున్నా కానీ.. భార్య కోసం మారిపోతావు అని చెప్పి ఈ తల్లి పెంపకాన్ని మోసం చేశావు. శభాష్ రా.. భలే గుణపాఠం చెప్పావు అంటుంది జ్ఞానాంబ.

Advertisement

janaki kalaganaledu 22 october 2021 friday episode

అమ్మ నేను ఎలాంటి పరిస్థితుల్లో చెప్పలేదో ఒక్కసారి అర్థం చేసుకో అమ్మ.. అంటే వద్దు నన్ను అమ్మ అని పిలవద్దు అని రామాకు చెబుతుంది జ్ఞానాంబ. ఇంతకుముందు నువ్వు అమ్మ అని పిలిస్తే కన్నపేగు కదలాడేది. ఇప్పుడు బాధతో మెలిపెడుతున్నట్టు ఉంది. నువ్వు అలా బాధపడుతుంటే నా మనసుకు చాలా కష్టంగా ఉందమ్మా అంటాడు రామా. దయచేసి అర్థం చేసుకో అమ్మా అంటాడు రామా. నా కొడుకు ఊళ్లో జరిగే విషయాలు అన్నీ నాతో చెప్పేవాడు. కానీ.. వాడి జీవితంలో జరిగే విషయాలను మాత్రం ఈ అమ్మ దగ్గర దాచాడు. ఈ అమ్మను పిచ్చిదాన్ని చేశాడు.. అంటుంది. నన్ను అమ్మ అని అస్సలు పిలవద్దు అని అంటుంది జ్ఞానాంబ. కొన్ని క్షణాల క్రితమే మన మధ్య ఆ బంధం తెగిపోయింది. ఏ క్షణం అయితే నువ్వు నీ భార్య కోసం నన్ను మోసం చేశావో.. అప్పటి నుంచి నువ్వు నా కొడుకువు కాదు. నేను నీ అమ్మను కాదు.. ఈ క్షణం నుంచి నువ్వు నాతో మాట్లాడొద్దు. మాట్లాడాలని చూస్తే నా మీద ఒట్టే.. అని చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

Janaki Kalaganaledu 22 Oct Today Episode : తన తమ్ముడి ఫోటోను చూస్తూ భయపడిపోయిన జ్ఞానాంబ

జ్ఞానాంబ తన తమ్ముడి ఫోటోను చూస్తూ బాధపడుతుంది. ఇంతలో జానకి అక్కడికి వెళ్లి జ్ఞానాంబ కాళ్లు పట్టుకుంటుంది. తప్పు ఒకరు చేస్తే మరొకరికి శిక్ష ఎందుకు వేస్తున్నారు అని అడుగుతుంది జానకి. మీరు ఏదైనా శిక్ష వేయాలనుకుంటే నాకు వేయండి. ఏ తప్పు చేయని ఆయనకు శిక్ష వేయడం కరెక్ట్ కాదు అత్తయ్య గారు అంటుంది జానకి. నేను ఎవరికీ శిక్ష వేయలేదు. నా కొడుకును గుడ్డిగా నమ్మినందుకు నాకు నేను వేసుకునే శిక్ష ఇది అని అంటుంది జ్ఞానాంబ. అత్తయ్య గారు ఆయనకు ఈ ప్రపంచంలో అమ్మ అంటేనే చాలా ఇష్టం. మీతో మాట్లాడుకుండా ఆయన ఎలా ఉంటారు. ఆయన బతకగలరా చెప్పండి. మీతో మాట్లాడకుండా ఉండటం అంటే.. ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. దయచేసి ఆయన గురించి ఆలోచించండి అత్తయ్య గారు అంటుంది జానకి. మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్లిపోండి అంటుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 22 october 2021 friday episode

Advertisement

కేవలం నీ కారణంగా వాడు ఇంతలా మారిపోయాడు. రేపటి రోజున నువ్వు వాడిని అవమానిస్తే అప్పుడు వాడు ఏమైపోతాడో అనే భయం.. అని జ్ఞానాంబ అంటుంది. ఇక నుంచి నేను ఎవ్వరినీ నమ్మను. నాతో ఎవ్వరూ మాట్లాడొద్దు.. వెళ్లండి.. అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకిని తన అన్నయ్య యోగి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఉదయమే జానకి లాయర్ దగ్గరికి వెళ్లి విడాకుల కోసం అప్లయి చేస్తుంది. ఉదయమే జానకి ఎక్కడికి వెళ్లిందోనని టెన్షన్ పడతాడు రామా. యోగికి కాల్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి