Home » Entertainment » Janaki Kalaganaledu 23 December 2021 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 23 Dec Today Episode : అఖిల్ ఫెయిల్.. జానకిని ఇరికించిన మల్లిక.. అఖిల్ విషయంలో జ్ఞానాంబ సంచలన నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Updated on: December 23, 2021 11:58 am
Advertisement

Janaki Kalaganaledu 23 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 డిసెంబర్ 2021, గురువారం 199 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మామయ్య గారు మీకు ఏం అర్థం అయిందో నాకు అర్థం అయ్యేలా చెప్పండి మామయ్య గారు.. అంటూ రామా ప్లేట్ లో భోజనం పెట్టుకొని వెళ్లడంపై అడుగుతుంది మల్లిక. రాముడు.. తన భార్యకు తినిపించడం కోసం భోజనం తీసుకెళ్లాడు అంటాడు గోవింద రాజు. మామయ్య గారు ఎంత ఆలోచించినా.. ఈ విషయం నాకు అర్థం కాలేదు. మరి మీకు ఎలా అర్థం అయింది అని అడుగుతుంది మల్లిక. దీంతో నేను కూడా మాకు పెళ్లయిన కొత్తలో నేను కూడా నా భార్యకు ఇలాగే తినిపించేవాడిని అంటాడు. మామయ్య గారు మీరు సిగ్గుపడుతున్నారా అని అంటుంది. ఇంతలో జ్ఞానాంబ వస్తుంది. మామయ్య గారు అత్తయ్య గారు వచ్చారు. భోజనం తీసుకెళ్లి అత్తయ్య గారికి తినిపించండి అంటుంది మల్లిక. దీంతో ఏంటి మల్లిక.. తిక్కతిక్కగా ఉందా అని అంటుంది జ్ఞానాంబ.

Advertisement

janaki kalaganaledu 23 december 2021 full episode

అంటే.. మామయ్య గారే చెప్పారు.. మీకు భోజనం తినిపించేవారట కదా అంటుంది మల్లిక. దీంతో కోపంతో గోవింద రాజు వైపు సీరియస్ గా చూస్తుంది. అది సరే గాని ముందు నువ్వు రేపు ఖార్ఖానాకు వెళ్లి కేకులు నేర్చుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో చికితను పిలుస్తుంది మల్లిక. నేను ఎవరిని అని అడుగుతుంది. దీంతో మీరు మల్లికంబగారు అని అంటుంది. నా పేరు కాదు.. ఈ ఇంట్లో నా స్థానం ఏంటి అని అడుగుతుంది మల్లిక. మీరు ఈ ఇంటికి చిన్న కోడలు అండి అంటుంది. కదా.. నేను చిన్న కోడలును కదా. అయినప్పటికీ.. పెద్ద కోడలు కంటే నేను ముందు వచ్చాను. నేను జానకి దగ్గర నేర్చుకోవడం ఏంటి అని అంటుంది. మరోవైపు రామా ప్లేట్ లో అన్నం పెట్టి జానకికి తీసుకెళ్తాడు. జానకిని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తాడు. కానీ.. తను లేవదు. ఇంతలో తన చీర గాలికి పైకి ఎగిరి తన నడుము కనిపిస్తుంది. దీంతో నడుము చూసి తట్టుకోలేకపోతాడు రామా.

Advertisement

ఏం చేయాలో రామాకు అర్థం కాదు. ఆ చీర కొంగును.. సెట్ చేయబోతాడు కానీ.. అది సెట్ కాదు. దీంతో తనకు పిచ్చెక్కుతుంది. దీంతో తన నడుమును ఒకసారి టచ్ చేస్తాడు. తనకు కరెంట్ షాక్ కొట్టినంత పని అవుతుంది. ఇంతలో జానకికి మెళుకువ వస్తుంది. రామా గారు ఎప్పుడొచ్చారు అంటుంది జానకి.

దీంతో నాకేం తెలియదు.. నేనేం చేయలేదు అంటాడు. ఏమైంది అంటుంది. భోజనం అండి. నడుము తిందామని తీసుకొచ్చాను.. భోజనం.. నడుము… రాగానే వేళ్లు.. నాకేం తెలియదు అండి అంటూ వెనక్కి తిరిగి సిగ్గు పడతాడు. రామా గారు ఇటు తిరగండి.. అంటుంది జానకి.

Advertisement

ఏం జరిగిందో ఇప్పుడు చెప్పండి అంటుంది. అసలే నాకే ఏం జరిగిందో అర్థం కావడం లేదు. మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండి అంటాడు రామా. మీరు పవన్ కళ్యాణ్ గారి ఖుషీ సినిమా చూశారా అని అడుగుతాడు రామా. అందులో పవన్ కళ్యాణ్ గారికి భూమిక గారితో వచ్చిన పరిస్థితే ఇంచు మించు నాకూ వచ్చిందండి అంటాడు రామా.

Janaki Kalaganaledu 23 Dec Today Episode : అఖిల్ ఫెయిల్ అయిన విషయాన్ని పెంట పెంట చేసి మల్లిక

చీర సర్దుదామని ప్రయత్నిస్తుంటే.. అలా అలా వేళ్లు తగిలాయి అంటాడు రామా. అంతే కదా.. లేదా ఇంకేమైనా అంటుంది జానకి. మీరు మరోలా అనుకోకండి అంటాడు రామా. దీంతో నేను మీ భార్యను మీరు కావాలని తాకినా నేనెందుకు ఏమనుకుంటాను అంటుంది జానకి. ఇంత చిన్న విషయానికి అంత హడావుడి చేయడం ఎందుకు. ఇంకా నయం బయటికి వెళ్లి చెప్పలేదు అంటుంది జానకి.

అది సరే కానీ.. ముందు మీరు భోజనం చేయండి. బాగా లేట్ అయిపోయింది.. అంటాడు రామా. మీరు నాకోసం భోజనం తీసుకురావడం ఏంటండి అని అడుగుతుంది జానకి. నా కోసం ఎందుకు మీరు ఇంత శ్రమ పడుతున్నారు అంటుంది. ఇందులో శ్రమ ఏముందండి అంటాడు రామా.

తనకు ముద్దలు కలిపి తినిపిస్తాడు రామా. దీంతో తను ఏడుస్తుంది. ఏడుపు ఆపుకోలేకపోతుంది. ఏంటండి ఆ కన్నీళ్లు అని అడుగుతాడు రామా. దీంతో మా నాన్న గుర్తొచ్చారు అని అంటుంది జానకి. ఊరుకోండి అని ఓదార్చుతాడు రామా. కట్ చేస్తే తెల్లారుతుంది. అఖిల్ టెన్షన్ పడుతూ ఇంటికి వస్తాడు.

Advertisement

ఇప్పుడు నేను ఫెయిల్ అయిన విషయం అమ్మకు ఎలా చెప్పాలి. ఇంట్లో ఎలా చెప్పాలి. అమ్మకు తెలిస్తే చంపేస్తుంది అని అనుకుంటాడు అఖిల్. ఏం చేయాలో అర్థం కాదు అఖిల్ కు. అఖిల్ డౌట్ డౌట్ గా ఉండటం.. చూసి మల్లిక ఏదో మనకు పనికొచ్చే పనిలా ఉందే అనుకుంటుంది.

వెన్నెలకు నేను ఫెయిల్ అయ్యా అని అఖిల్ చెబుతుండగా వింటుంది మల్లిక. అబ్బ.. నాకు భలే అస్త్రం దొరికింది. జానకి గిటార్ కొనివ్వడం వల్లనే అఖిల్ ఫెయిల్ అయ్యాడు అని పోలేరమ్మకు చెప్పి పెద్ద కోడలును మరోసారి ఈ ఇంట్లో ఇరికిస్తా అని తెగ సంబురపడిపోతుంది మల్లిక.

వెంటనే జ్ఞానాంబను పిలుస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. ఏమైంది అని అడుగుతారు. అఖిల్ పరీక్ష తప్పాడని చెబుతుంది మల్లిక. దీంతో అందరూ షాక్ అవుతారు. అఖిల్ నిజమేనా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో నిజమే అంటాడు.

వెంటనే అఖిల్ ను కొట్టుకు తీసుకెళ్తుంది. అక్కడ రామా, జానకి ఉంటారు. అఖిల్ పరీక్ష తప్పడానికి కారణం నువ్వే అని జానకిని నిలదీస్తుంది జ్ఞానాంబ. సొంత పెత్తనాలు చేసి వాడికి గిటారు కొనిచ్చి వాడిని తప్పుదారి పట్టించిందని జానకిపై జ్ఞానాంబ విరుచుకుపడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి