Janaki Kalaganaledu 23 June Today Episode : జ్ఞానాంబను కాపాడబోయి జానకి తలకు తీవ్రగాయం.. జానకి చనిపోతుందా? రామా పరిస్థితి ఏంటి?

Janaki Kalaganaledu 23 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 జూన్ 2022, గురువారం ఎపిసోడ్ 329 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కోడలు అంటే ఇలా ఉండాలి.. అని జానకిని పొగుడుతాడు పూజారి. ఆ తర్వాత గుడిలో అర్చన జరిపిస్తాను రండి అని గుడి లోపలికి వాళ్లను తీసుకెళ్తాడు పూజారి. తల్లి నా బలం, బలహీనత అంతా నా కుటుంబమే. నా కుటుంబం భవిష్యత్తు నా పెద్ద కొడుకు మీద ఆధారపడి ఉంది. నా బిడ్డను, నా కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి అని మనసులో మొక్కుతుంది జ్ఞానాంబ. తర్వాత రామా జ్ఞానాంబను ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటాడు. ఎక్కడికి రామా అంటే నువ్వు రా అమ్మ అంటాడు రామా. అన్నయ్య ఏదో సర్ ప్రైజ్ ఇస్తాడు కావచ్చు అంటారు అఖిల్, వెన్నెల. మల్లికకు మాత్రం ఏం అర్థం కాదు. గుడిలో ఓ చోటుకు తీసుకెళ్లి అక్కడ అన్నదానం ఏర్పాటు చేశానని చెబుతాడు. అక్కడ వంటలు అన్నీ చేయించి.. భక్తులకు మీ చేతుల మీదుగా అన్నదానం చేయిస్తే బాగుంటుందని ఈ ఏర్పాట్లు చేశాం అంటుంది జానకి.

janaki kalaganaledu 23 june 2022 full episode

నీకు ఈ విషయం ముందే చెబుదామనుకున్నా కానీ.. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాక నువ్వు ఆశ్చర్యపోతావని, ఆనందపడతావని ముందు చెప్పలేదు అంటాడు. మల్లికకు ఇంకా కోపం ఎక్కువవుతుంది. అత్తయ్య గారు మీరు ఇచ్చిన బహుమతి డబ్బులతో మీకు తెలియకుండా ధ్వజస్తంభానికి విరాళం, అన్నదానం నిర్వహిస్తున్నాం. మిమ్మల్ని క్షమించు అత్తయ్య అంటుంది జానకి. నువ్వు చేసిన ఈ పనుల ద్వారా మా అమ్మ తనలో తనను చూసుకుంటుంది. గర్వంతో పొంగిపోతుంది అని అంటుంది వెన్నెల. అత్తయ్య గారు మీ చేతులతో మీరే అందరికీ వడ్డించండి అంటుంది జానకి. తర్వాత అందరూ వెళ్లి అక్కడికి వచ్చిన వాళ్లకు వడ్డిస్తారు. అందరూ సంతోషంగా భోజనం చేస్తారు.

మల్లికకు కోపం వచ్చి గుడి వెనక్కి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. ఈ దెబ్బతో అత్తాకోడలు పప్పు ఆవకాయలా కలిసిపోయినట్టే.. నన్ను కూరలో కరివెపాకులా తీసేసినట్టే అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తనను చూసి అక్కడికి వెళ్లిన విష్ణు.. మల్లిక ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు.

దీంతో దోమలకు పేలు చూస్తున్నాను… రండి మీరు కూడా పేలు చూద్దురు కానీ అంటుంది. ఎందుకు నీకు అంత కోపం అంటాడు. దీంతో కడుపు మంట అంటుంది. ఉండు.. గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తా అంటాడు విష్ణు. నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు నీ కోపం పోయేలా చేస్తా అంటాడు.

దీంతో మీరు ఏనాడైనా పెళ్లానికి సపోర్ట్ చేశారా.. అని అడుగుతుంది. తర్వాత తనను తీసుకొని జ్ఞానాంబ దగ్గరికి వస్తాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో అన్నయ్య గెలిస్తే మొక్కు చెల్లిస్తా అని మల్లిక మొక్కుకుందట అంటూ మల్లికను ఇరికిస్తాడు విష్ణు.

Janaki Kalaganaledu 23 June Today Episode : మల్లికను జ్ఞానాంబ ముందు ఇరికించిన విష్ణు

ఏమే.. మొక్కుకున్నావా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో అవును అత్తయ్య గారు.. అలా ఇలా కాదు అత్తయ్య గారు చాలా భక్తి శ్రద్ధలతో మొక్కుకున్నాను అంటుంది మల్లిక. ఏమని మొక్కుకున్నావు వదిన అని అడుగుతుంది వెన్నెల. దీంతో అది అది అంటూ ఏదో చెప్పబోతుంది మల్లిక.

ఇంతలో విష్ణు కలిగించుకొని.. అదేం లేదమ్మా.. కోనేటి నుంచి 108 బిందెల నీళ్లు తీసుకెళ్లి శివుడికి అభిషేకం చేస్తా అని మొక్కుకుంది అంటాడు విష్ణు. దీంతో మల్లిక షాక్ అవుతుంది. వెంటనే మొక్కు చెల్లించుకొందువు పదా అని మల్లికను అక్కడి నుంచి తీసుకెళ్తాడు విష్ణు.

కోనేటి నుంచి బిందెలో నీళ్లు తీసుకురావడం స్టార్ట్ చేస్తుంది మల్లిక. 108 బిందెల నీళ్లు తీసుకురాలేక చాలా ఇబ్బందులు పడుతుంది. 54 బిందెలు మోసేసరికే తనకు ఓపిక నశిస్తుంది. చివరకు 108 బిందెల నీళ్లు తెచ్చి శివుడికి అభిషేకం చేస్తుంది మల్లిక. తనకు కాళ్లు చేతులు గుంజుతాయి.

నిజంగా ఏదో పండుగ వచ్చినంత సంబరంగా ఉంది. రామా గెలుపే ఈ సంతోషానికి కారణం అంటుంది జ్ఞానాంబ. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే పదిలంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా అంటుంది జ్ఞానాంబ. అత్తయ్య గారు కుంకుమార్చన చేసి కుంకుమ తీసుకోవడం మరిచిపోయాం. నేను వెళ్లి తీసుకొస్తా అని గుడి లోపలికి వెళ్తుంది జానకి.

ఇక.. మల్లిక అమ్మో… అయ్యో అంటూ అరుస్తూ ఉంటుంది. దీంతో తగ్గిపోతుందిలే అంటుంది జ్ఞానాంబ. దీంతో మల్లిక ఇంకో 108 బిందెలతో ప్రదిక్షణ చేశావనుకో నీ నడుం నొప్పి మొత్తం పోతుంది అంటూ మరోసారి ఆటపట్టిస్తాడు విష్ణు. సరె సర్లే మనం వెళ్దాం.. జానకి వస్తుందిలే అంటూ అందరూ నడుచుకుంటూ వెళ్తుంటారు.

ఇంతలో కరెంట్ తీగ తెగి నీళ్లలో రోడ్డు మీద పడటం గమనిస్తుంది జానకి. ఏం చేయాలో తనకు అర్థం కాదు. విష్ణుతో పాటు మల్లిక, జ్ఞానాంబ, వెన్నెల, చికిత అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇంతలో అక్కడే ఉన్న ఒక కట్టెను తీసుకొని ఆ వైరును అక్కడి నుంచి తొలగిస్తుంది జానకి. అదే సమయంలో తను అక్కడే ఉన్న మెట్లను ఢీకొని కిందపడిపోతుంది.

తన తలకు గాయం అవుతుంది. తనను ఎంత లేపినా లేవదు. ఇంతలో రామా కూడా వస్తాడు. తనను చేతులతో ఎత్తి.. జానకి గారు అని అంటాడు. కానీ.. తను లేవదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా… దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది…?

Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…

37 minutes ago

Hair Loss : అయ్యయ్యో.. బట్టతల వస్తుందని బాధపడుతున్నారా… ఇలా చేయండి వెంటనే వెంట్రుకలు మొలుస్తాయి…?

Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…

2 hours ago

Cluster Beans : గోరుచిక్కుడు కాయను చిన్న చూపు చూడకండి… దీని ఔషధ గుణాలు తెలిస్తే మతిపోతుంది…?

Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…

3 hours ago

Suvsrna Gadde : ఈ కూరగాయ అందరికీ తెలిసినదే…కానీ, దీని ప్రయోజనం అంతగా తెలియదు…?

Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…

4 hours ago

Toli Ekadashi 2025 : తొలి ఏకాద‌శి రోజున ఈ నియ‌మాలు పాటించండి.. ఆ ప‌నులు అస్స‌లు చేయోద్దు..!

Toli Ekadashi 2025  : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…

5 hours ago

Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తింటే మంచిదా, దాని విశిష్ట‌త ఏంటి?

Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…

6 hours ago

7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…

7 hours ago

Coffee : రోజుకి 2 కప్పుల కాఫీ తాగారంటే చాలు… యవ్వనంతో పాటు,ఆ సమస్యలన్నీ పరార్…?

Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…

8 hours ago