Janaki Kalaganaledu 24 Dec Today Episode : అఖిల్ ఫెయిల్ అయినందుకు జానకిపై జ్ఞానాంబ సీరియస్.. అఖిల్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న జ్ఞానాంబ

Advertisement
Published by
Advertisement

Janaki Kalaganaledu 24 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 డిసెంబర్ 2021, శుక్రవారం 200 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అఖిల్ ను జ్ఞానాంబ తిడుతుంది. పరీక్షలో ఫెయిల్ అవ్వడానికి సిగ్గు లేదు అంటుంది. గోవింద రాజు కూడా అఖిల్ ను తిడుతాడు. ఇంతలో మధ్యలో దూరుతుంది మల్లిక. ఇప్పుడు జానకిని ఇరికించాలని.. ముందు మీరు అఖిల్ కంటే ముందు మీ పెద్ద కోడలును తిట్టండి అంటుంది మల్లిక. అఖిల్ ఫెయిల్ అవ్వడానికి జానకే కారణం అంటుంది. తన గాజులు అమ్మి మరీ గిటార్ కొనిచ్చింది జానకి. అందుకే.. అఖిల్ సరిగ్గా చదవలేకపోయాడు. ఫెయిల్ అయ్యాడు. జానకి గిటార్ కొని ఇచ్చి ఉండకపోతే.. అఖిల్ బాగా చదువుకొని పాస్ అయ్యేవాడు అంటుంది మల్లిక.

Advertisement

janaki kalaganaledu 24 december 2021 full episode

వెంటనే అఖిల్ ను తీసుకొని జ్ఞానాంబ బయటికి వెళ్తుంది. జ్ఞానం ఆగు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటాడు గోవింద రాజు. వీడిని మన స్వీట్ కొట్టులో పనిలో పెడతా. ఈరోజు నుంచి షాపులోనూ ఖార్ఖానాలోనూ పనిచేస్తాడు అని చెప్పి.. స్వీట్ కొట్టు దగ్గరికి అఖిల్ ను తీసుకెళ్తుంది జ్ఞానాంబ. మరోవైపు జానకి.. స్వీట్ కొట్టు వద్ద ఉంటుంది. ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటుంది జానకి. దీంతో రామాకు ఏం అర్థం కాదు. ఎందుకు జానకి అంతగా బాధపడుతుంది అని అనుకుంటాడు రామా. ఏమండోయ్ శ్రీవారు ఏంటి అలా చూస్తున్నారు అంటుంది. మీరు ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు అంటాడు రామా. రేపో మాపో.. ఖార్ఖానాలో కేకులు తయారు చేయాల్సి ఉంటుంది. ఇక నుంచి కోచింగ్ కు వెళ్లే అవకాశం ఉండదు కదా. అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటుంది జానకి.

Advertisement

జానకి గారు ఇప్పటి దాకా మీ చదువుకు ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగిపోయింది. ఇక నుంచి కూడా సాఫీగా సాగిపోతుంది. నేను చూసుకుంటాను. ఈ విషయాన్ని మీరు నాకు వదిలేయండి అంటాడు రామా. ఇంతలో జ్ఞానాంబ.. అఖిల్ ను తీసుకొని స్వీటు కొట్టుకు వస్తుంది.

అమ్మ.. ఏమైంది. ఎందుకు అంత కోపంగా ఉన్నావు అంటాడు రామా. ఈరోజు నుంచి వీడు ఈ షాపులో పనిచేస్తాడు. వీడితో షాపులోనూ, ఖార్ఖానాలోనూ పని చేయించు.. అంటుంది జ్ఞానాంబ. దీంతో ఏంటమ్మా.. ఈ పనులు ఏంటి.. చదువుకునే వాడితో ఈ పనులు ఏంటి అంటాడు రామా.

వీడేదో అద్భుతంగా చదువుతున్నడని మనం భ్రమల్లో ఉన్నాం. వీడు పరీక్షల్లో తప్పాడు.. అంటుంది జ్ఞానాంబ. దీంతో రామా, జానకి షాక్ అవుతారు. అఖిల్.. అమ్మ చెప్పింది నిజమా అని అడుగుతాడు రామా. దీంతో అఖిల్ ఏం మాట్లాడడు. ఏంట్రా ఇది.. నీకు ఎంత ఫీజు కావాలంటే అంత.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చాను కదరా.. ఇప్పుడు పరీక్షల్లో తప్పడం ఏంట్రా అని అడుగుతాడు రామా.

మనింటి పరిస్థితి గురించి నీకు ఎన్నిసార్లు చెప్పాను. మనింట్లో నాకు చదువు లేదు. విష్ణుకు చదువు అబ్బలేదు. కనీసం నువ్వు అయినా చదువుకొని మనింట్లో బాగా చదువుకునే వాళ్లు ఉన్నారని గర్వంగా చేస్తావని అనుకున్నానురా. నువ్వు ఇలా పరీక్షల్లో తప్పితే మేమందరం తలెత్తుకొని ఎలా బతకగలం అంటాడు రామా.

Janaki Kalaganaledu 24 Dec Today Episode : జానకిని నువ్వు మాట్లాడకు అంటూ సీరియస్ అయిన జ్ఞానాంబ

సారీ అన్నయ్య. నేను తప్పు చేశాను. నన్ను క్షమించు అన్నయ్య. మరోసారి ఫెయిల్ అయి మీరు బాధపడే పరిస్థితిని తీసుకురాను అంటాడు అఖిల్. పరీక్ష ఫెయిల్ అయినందుకు ఒక్క అవకాశం ఇద్దాం. ట్యూషన్ పెట్టిద్దాం. పాస్ అవుతానని చెబుతున్నాడు కదా అంటుంది జానకి.

దీంతో నువ్వు మాట్లాడకు అంటుంది జ్ఞానాంబ. అసలు ఇదంతా నీవల్లే అంటుంది జ్ఞానాంబ. వాడు అలా పరీక్షల్లో తప్పడానికి కారణం నువ్వే అంటుంది జ్ఞానాంబ. ఏంటమ్మా.. అలా అంటున్నావు అంటాడు రామా. దీంతో అవును.. వీడు పరీక్షల్లో తప్పడానికి ముమ్మాటికీ కారణం నీ భార్యే అంటుంది జ్ఞానాంబ.

వీడు గిటారు కావాలన్నప్పుడు నేను కొనివ్వలేదు. పిల్లలకు అడిగిందల్లా ఇస్తే వాళ్ల జీవితం నాశనం అవుతుందని ఆరోజే చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. నేను వద్దన్నప్పుడు తను అర్థం చేసుకొని నోర్మూసుకొని ఉండాలి కదా. కానీ.. సొంత పెత్తనం చేసి వీడికి గిటారు కొనిచ్చింది అని జానకిపై సీరియస్ అవుతుంది జ్ఞానాంబ.

నా కొడుకుకు గిటారు కొనివ్వడం నాకు చేతకాదా.. నాకు తెలియదా.. చదువు అంటే ఇష్టం ఉన్న పెద్దకొడుకు ఇంటికి నిలబెట్టడం కోసం చదువును త్యాగం చేయాల్సి వచ్చింది. రెండోవాడి కోసం లక్షలు ఖర్చు పెట్టాను కానీ.. వాడు చదవుకోకుండా చదువు వదిలేశాడు. బట్టల కొట్టు పెట్టుకున్నాడు. కనీసం ఒక్కడైనా చదువుకొని ఉద్యోగం చేసే అవకాశం లేదా అని ఎంత బాధపడ్డానో మీకేం తెలుసురా అంటుంది జ్ఞానాంబ.

బిడ్డల భవిష్యత్తు కోసం నేను పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. వీడు కూడా ఇలాగే చేశాడు. ఏమ్మా జ్ఞానాంబ. నీ చిన్న కొడుకు కూడా పరీక్షల్లో తప్పాడట కదా. నీ కొడుకులకు చదువు అబ్బదేమో అని అంటే ఆ అమ్మ మనసు ఎంత అల్లాడుతుందో మీకేం తెలుసు అంటుంది.

మీ అన్నయ్య చిన్నప్పటి నుంచి పడ్డ కష్టం విలువ నీకు తెలియాలి.. అని చెప్పి అఖిల్ ను అక్కడ వదిలేసి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. దీంతో అఖిల్ ఖార్ఖానాకు వెళ్లి పనులు చేస్తుంటాడు. తనకు పొగ పడక కండ్లు మండుతాయి. తప్పని పరిస్థితుల్లో అలాగే పని చేస్తుంటాడు. అఖిల్ పని చేయడం చూసి రామా బాధపడతాడు.

రామా గారు కళ్లలో ఆ నీళ్లు ఏంటండి అని అడుగుతుంది జానకి. నా తమ్ముళ్లు నాలా కష్టపడకూడదు అని అనుకున్నా అంటాడు రామా. నా తమ్ముళ్లను గొప్ప స్థాయిలో ఉంచాలనుకున్నాను అంటాడు రామా. ఇంటికి వెళ్లాక.. అఖిల్ కు నేను ట్యూషన్ చెబుతాను అంటుంది జానకి.

దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఒకవేళ వాడు మళ్లీ పాస్ కాకపోతే అంటుంది జ్ఞానాంబ. నాది హామీ అంటుంది జానకి. ఒకవేళ అలా జరగకపోతే నేను ఏం చేస్తానో నువ్వు కూడా చూస్తావు అని జ్ఞానాంబ జానకితో అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

TRS : ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే .. కవిత కొత్త పార్టీ పై బీఆర్ఎస్ విమర్శలు ..!

TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…

14 hours ago

Kavitha : మారిన మర మనిషిలా కేసీఆర్‌ .. తండ్రి పై కవిత సంచలన వ్యాఖ్యలు .!

Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…

15 hours ago

PM Kisan Maandhan : రైతన్నకు భరోసా .. ప్రతి నెలా రూ.3 వేలు ..కేంద్రం అందిస్తున్న ఈ పథకం తెలుసా? .. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే..!

PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…

18 hours ago

Rice Porridge : గంజి నీళ్లను పారబోస్తున్నారా? .. ఇలా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…

20 hours ago

Sugarcane,lemon, coconut water : చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు .. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏది తాగితే మంచిది?

Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…

21 hours ago

Zodiac Signs : రాహు–కేతువుల సంచారం .. ఈ మూడు రాశులపై చెడు ప్రభావం .. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…

22 hours ago

Virat Kohli : మ‌రో చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..!

Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొద‌టి స్థానంలో…

1 day ago

Double Bedroom Houses : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం కొత్త విధానం .. వారికి కేటాయించిన ఇళ్లు వెనక్కి ..!

Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…

1 day ago

Rain Alert : తెలుగు రాష్ట్రాలకు వాతావరణం హెచ్చరిక .. తుఫాన్‌లా గాలులు.. 2 రోజులు భారీ వర్షాలు..!

Rain Alert : ఏప్రిల్ నెల అంటే సాధారణంగా మండే ఎండలు, వడగాల్పులు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి తెలుగు…

1 day ago

Tollywood : చిరంజీవి వదిలిన కథ .. నాగార్జునకు సూపర్ హిట్ .. సినిమా ఏదంటే.?

Tollywood : సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి…

1 day ago

Puranapanda Srinivas : మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! పురాణపండ శ్రీనివాస్

హైదరాబాద్ : వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన…

1 day ago

Jabardasth : జబర్దస్త్‌ను వదిలిన సౌమ్యారావు .. అసలు కారణం బయటపెట్టిన యాంకర్ ..!

Jabardasth : తెలుగు కామెడీ షోలలో ప్రత్యేక గుర్తింపు పొందిన జబర్దస్త్ లో యాంకర్‌గా సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చిన…

1 day ago