Janaki Kalaganaledu 24 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 ఫిబ్రవరి 2022 గురువారం ఎపిసోడ్ 244 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అలా అడిగే పరిస్థితులు కూడా రాకుండా నా నిర్ణయాన్ని చెప్పాను. ఐపీఎస్ చదవండి అని అడగడం కానీ.. ఎందుకు చదవమంటున్నారే ప్రశ్నలు కానీ ఇక రావు.. ఉండవు అని జ్ఞానాంబతో చెబుతుంది జానకి. వెన్నెల కోసం మీ బంధువుల సంబంధం చూశావు కదా. వెన్నెలకు ఆ అబ్బాయి నచ్చాడని చెప్పింది. రేపు ఒకసారి మనం వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడేసి వద్దాం అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి, రామా షాక్ అవుతారు. అమ్మ.. ముందు నేను, జానకి గారు ఒకసారి వెళ్ చూసి వస్తాం అమ్మ అంటాడు రామా. దీంతో ముందు మిమ్మల్నే పంపిద్దామని అనుకున్నా కానీ.. నాకు ఎందుకో ఒకసారి నేను వెళ్లి అన్ని విషయాలు తెలుసుకుందామని అందరం వెళ్దాం అంటున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ.
దీంతో ఏం చేయాలో అర్థం కాదు. వెన్నెల కూడా టెన్షన్ పడుతుంది. ఏడాది తిరిగే కల్లా మగపిల్లాడిని కని పోలేరమ్మను నా చెప్పుచేతుల్లో పెట్టుకుంటాను అని అనుకుంటుంది మల్లిక. ఇంతలో మల్లిక అమ్మ ఫోన్ చేసి మీ నానమ్మ ఏం చెప్పిందో తెలుసా అంటుంది మల్లిక తల్లి. వెన్నెల పెళ్లి గురించి అంటుంది. ఆ పిల్లను మీ తమ్ముడు చేసుకుంటే ఆ పిల్ల మీద ఉన్న ఆస్తి మనకే వస్తుంది కదా. అంతే కాదు.. ఆడపిల్లను మన ఇంటికే ఇస్తారు కాబట్టి.. అంటుంది. అర్థం అయింది అమ్మ.. అప్పుడు పోలేరమ్మ జుట్టు నా చేతుల్లో ఉంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మల్లిక. మరోవైపు దిలీప్ తల్లిదండ్రులకు జానకి ఫోన్ చేస్తుంది. అన్ని విషయాలు చెబుతుంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లిలాగానే జరగాలి.. అని చెబుతుంది జానకి.
మా అమ్మ అడిగిన ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు చెప్పండి. పెళ్లి సంబంధం కోసం వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతారో అలాగే మాట్లాడండి అని చెబుతాడు రామా. దీంతో అలాగేనండి అంటాడు దిలీప్ తండ్రి. ఇంతలో జ్ఞానాంబ వస్తుంది. రామా.. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటుంది.
మీరిద్దరూ ఎందుకు ఇలా ఉన్నారు. ఏంటి సమస్య.. ఏమైంది అని అడుగుతుంది జ్ఞానాంబ. మేము మామూలుగానే ఉన్నాం అంటాడు. మరి ఫోన్ లో ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో ఏం లేదమ్మా.. స్వీట్ ఆర్డర్ గురించి అని చెబతాడు.
సరే.. హారతి తీసుకోండి అంటుంది. ఇంతలో మల్లిక వస్తుంది. అత్తయ్య గారు నేను కూడా వస్తాను అంటుంది. నువ్వెందుకు అంటుంది జ్ఞానాంబ. దీంతో అదేంటి అత్తయ్య నేను రాకుండా పెళ్లి చూపులకు ఎలా వెళ్తారు అని అంటుంది. దీంతో మల్లికను కూడా తమతో పాటు తీసుకొని వెళ్తారు పెళ్లి చూపులకు.
మరోవైపు ఇన్ని అబద్ధాలు చెప్పి ఎలా పెళ్లి చేస్తాం అని అనుకుంటుంది దిలీప్ తల్లి. వద్దు.. అబద్ధం చెప్పి పెళ్లి చేస్తే తర్వాత ఏవైనా సమస్యలు వస్తాయి. అందుకే జ్ఞానాంబ గారితో నేను మాట్లాడుతాను. ఎలాగైనా మీ పెళ్లి నేను జరిపిస్తాను అని అంటుంది దిలీప్ తల్లి.
ఆ విషయాన్ని వెంటనే జానకికి ఫోన్ చేసి చెబుతాడు దిలీప్. ఈ విషయం రామాకు ఎలా చెప్పాలో జానకికి అర్థం కాదు. రామా, జానకి టెన్షన్ పడుతున్న విషయాన్ని మల్లిక గమనిస్తుంది. దీంతో ఎలాగైనా వీళ్ల టెన్షన్ కు కారణాన్ని కనిపెట్టాలి అని అనుకుంటుంది మల్లిక.
ఇంతలో జ్ఞానాంబ వాళ్లు దిలీప్ ఇంటికి వస్తారు. వాళ్లను ఇంట్లోకి ఆహ్వానిస్తారు. మా జానకి బంధువులని చెప్పగానే నాకు తెలియని ధైర్యం వచ్చింది. మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా పంపించడానికి మాకు ఎటువంటి సమస్య లేదని అనిపించింది అని అంటుంది.
మరోవైపు దిలీప్ తల్లి.. మీతో ఏదో చెప్పాలి అని జ్ఞానాంబతో అంటుంది. ఇంతలో జానకి కలగజేసుకొని అయ్యో.. పిన్ని గారు ఏవైనా విషయాలు ఉంటే నేను మాట్లాడుతాను కదా. నాకు చెప్పండి అంటుంది జానకి. తనను అక్కడి నుంచి దూరం తీసుకెళ్లి.. మీ భయం గురించి దిలీప్ నాకు చెప్పాడు అంటుంది జానకి.
దీంతో అవునండి.. రేపటి రోజున ఈ విషయం తెలిస్తే అందరూ తలదించుకోవాల్సి వస్తుంది అంటుంది దిలీప్ తల్లి. అందుకే జ్ఞానాంబ గారికి వాళ్లు ప్రేమించుకున్న విషయం చెప్పి.. మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి పెళ్లి చేద్దాం అంటుంది దిలీప్ తల్లి.
దీంతో ప్రేమ పెళ్లి అంటే మా అత్తయ్య గారు అస్సలు ఒప్పుకోరు అంటుంది జానకి. దీంతో అబద్ధం చెప్పి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను అంటుంది దిలీప్ తల్లి. దీంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు మల్లికకు ఏదో డౌట్ కొడుతుంది.
దీంతో అత్తయ్య గారు నేను ఇల్లు చూసి వస్తాను అంటుంది మల్లిక. మీ మాటల్లో న్యాయం ఉంది కానీ.. నిజం చెబితే పెళ్లి జరగడం కాదు.. అటు వెన్నెల.. ఇటు దిలీప్ ఇద్దరూ మనకు దక్కరు అంటుంది జానకి. దీంతో ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటుంది దిలీప్ తల్లి.
అవునండి.. మా వెన్నెలకు వేరే సంబంధం చూశారని ఇద్దరూ కలిసి ప్రాణాలు తీసుకోబోయారు అని అసలు విషయం చెబుతుంది జానకి. సమయానికి నేను మా ఆయన చూసి కాపాడం. లేదంటే ఈపాటికి వాళ్లు మనకు దూరం అయి ఉండేవాళ్లు అని చెబుతుంది జానకి.
ఏమండి.. నిజం గొప్పదే కానీ.. ప్రాణం అంతకంటే గొప్పది. ప్రాణాలు కాపాడటం కోసం ఒక చిన్న నిజాన్ని దాచినా తప్పు లేదండి. అది తప్పనిసరి అవసరం కూడా అని చెబుతుంది జానకి. మా అత్తయ్యకు కూతురు దూరం అయినా తట్టుకొని బతకగలరా చెప్పండి అంటుంది జానకి.
వంద అబద్ధాలు ఆడి అయినా పెళ్లి చేయాలన్నారు. కానీ.. ఈ ఒక్క అబద్ధం చెప్పి ఈ పెళ్లి జరిపిద్దాం.. అంటుంది జానకి. భవిష్యత్తులో ఏ గొడవ రాకుండా నేను చూసుకుంటాను. అది నా బాధ్యత అంటుంది జానకి. మరోవైపు వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి ప్రయత్నిస్తుంది మల్లిక. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.