Janaki Kalaganaledu 24 May Today Episode : వంటల పోటీల్లో పాల్గొనబోతున్న రామా.. ఈ విషయం జ్ఞానాంబకు తెలుస్తుందా?జానకి ప్లాన్ ఏంటి?

Janaki Kalaganaledu 24 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 మే 2022, మంగళవారం ఎపిసోడ్ 307 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పూజ పూర్తి కాగానే.. రామాను బయటికి తీసుకొచ్చి లూసీ వెళ్లిపోయేలా ఉంది అంటుంది. మనం త్వరగా వెళ్లి అప్లికేషన్ పూర్తి చేసి తనకు ఇచ్చి వద్దాం అని అంటుంది. వీళ్ల మాటలు అన్నీ నీలావతి చాటుగా వింటుంది. కరెక్టే కానీ.. ఈ రోజు బయటికి వెళ్లకూడదని చెప్పారు కదా అంటాడు రామా. మనం ఇప్పుడు ఒక మంచి పని కోసం వెళ్తున్నాం కదా. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్లామని దేవుడు పగ సాధించడు కదా అంటుంది జానకి. అమ్మకు చెప్పకుండా వెళ్తే ఏమంటుందో అంటాడు రామా. కానీ.. ఇప్పుడు అత్తయ్య గారిని ఒప్పించలేం. అది అసాధ్యం అంటుంది. మనం వెళ్లడం లేట్ అయితే లూసీ వెళ్లిపోతుంది. బంగారం లాంటి అవకాశం చేజారిపోతుంది అంటుంది జానకి.

janaki kalaganaledu 24 may 2022 today episode

మనం ఇప్పుడు ఆలోచించి ఆగిపోవడం కంటే.. దైర్యం చేసి ముందుకెళ్లడం చాలా అవసరం. లేదంటే ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. మనం తిరిగి వచ్చాక అత్తయ్య గారితో మాట్లాడి.. తనను ఒప్పించాకనే పోటీలకు వెళ్దాం. ఇప్పుడు మాత్రం అప్లికేషన్ పూర్తి చేసి లూసీకి ఇచ్చి వద్దాం అంటుంది జానకి. మన కళ్ల ముందు ఉన్న సమస్యలు అన్నింటికీ ఆ దేవుడు చూపించిన ఒకే ఒక్క దారి అదే రామా గారు. దీన్ని మనం ఉపయోగించుకోలేకపోతే మనం చాలా ఇబ్బందుల్లో పడతాం అంటుంది జానకి. రామా గారు.. అత్తయ్య గారు అర్థం చేసుకుంటారు. అంతా మంచే జరుగుతుంది.. మీరు పదండి.. మనం వెళ్లి వద్దాం అంటుంది జానకి. వీళ్ల మాటలన్నీ చాటుగా వింటుంది నీలావతి.

రామా గారు.. బండి స్టార్ట్ చేయకుండా.. బయటి వరకు తోసుకుంటూ వెళ్దాం అంటుంది. ఈ విషయం జ్ఞానాంబకు చెప్పి నట్టింట్లో మంట పెట్టాలి అని అనుకుంటుంది నీలావతి. బయటికి వెళ్లి అక్కడి నుంచి బైక్ మీద బయలుదేరుతారు రామా, జానకి.

వెంటనే లూసీకి ఫోన్ చేసి మనం వస్తున్నామని చెప్పండి అంటాడు రామా. దీంతో జానకి లూసీకి ఫోన్ చేస్తుంది. లూసీ ఫోన్ కలవకపోవడంతో టెన్షన్ పడుతుంది జానకి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే.. అదే అర్థం కావడం లేదు అంటుంది జానకి.

తను ఉందో వెళ్లిపోయిందో అని అంటుంది. తను మన కోసం వెయిట్ చేస్తుందనే నమ్మకం నాకు ఉంది రామా గారు అంటుంది జానకి. మీరు త్వరగా పదండి.. తను గెస్ట్ హౌస్ లోనే ఉండి ఉంటుంది అంటుంది జానకి. వెంటనే గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తారు.

Janaki Kalaganaledu 24 May Today Episode : అప్లికేషన్ ఫామ్ నింపి లూసీకి ఇచ్చిన జానకి

మేడమ్ గారు ఇప్పటి వరకు మీకోసం వెయిట్ చేసి ఇంతకుముందే కారులో వెళ్లిపోయారు అంటాడు సెక్యూరిటీ గార్డ్. దీంతో జానకి, రామాకు ఏం చేయాలో అర్థం కాదు. అమ్మ నిర్ణయాన్ని కాదని మనం ఏ పని చేసినా అది అవడం లేదు అని అంటాడు రామా.

లూసీ బయలుదేరి ఎంత సేపు అవుతోంది అని అడుగుతుంది. దీంతో ఇప్పుడే 5 నిమిషాలు అవుతోంది అంటాడు సెక్యూరిటీ గార్డ్. దీంతో తనను కలవడం కోసం వెంటనే బండి మీద బయలుదేరుతారు రామా, జానకి. చివరకు లూసీ కారును చూసి.. తనను పిలుస్తుంది జానకి. దీంతో లూసీ కారును ఆపిస్తుంది.

తను అప్లికేషన్ ఫామ్ ఇస్తుంది. దీంతో రామా సంతకం పెట్టి ఇచ్చేస్తాడు. కాంపిటిషన్ మూడు రోజుల్లో స్టార్ట్ అవుతుంది. మీరు రేపే హైదరాబాద్ కు రండి అంటుంది లూసీ. దీంతో తప్పకుండా వస్తాం అంటుంది జానకి. తర్వాత లూసీ వెళ్లిపోతుంది.

చీకటి పడేలా ఉంది. అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. ఇంటికి వెళ్దాం పదండి అంటుంది జానకి. మరోవైపు ఇంటి దగ్గర జానకి, రామా కోసం జ్ఞానాంబ, కుటుంబ సభ్యులు అందరూ ఎదురు చూస్తుంటారు. నీలావతి కూడా అక్కడే ఉంటుంది.

ఎంత సేపని అలా నిలబడతావు.. కూర్చోవచ్చు కదా అని అంటాడు గోవింద రాజు. దీంతో కూర్చోపోతే ఏమౌతుంది అని అంటుంది జ్ఞానాంబ. నా కొడుకు కోసం చేసిన ఆయుష్షు పూజకు ఫలితం ఎక్కడ దక్కకుండా పోతుందోనని నా ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ.. అంటుంది.

ఇంతలో మల్లిక ఇంటికి వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతోందని టెన్షన్ పడుతుంది. ఓయమ్మో.. ఏందబ్బా ఇది. ఏదో సంతాప సభ జరుగుతున్నట్టు అందరూ ఇంత సైలెంట్ గా ఉన్నారేంటబ్బా అని అనుకుంటుంది మల్లిక. నీలావతిని పిలుస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. దీంతో నీలావతి మొత్తం మల్లికకు చెబుతుంది.

కరెక్ట్ సీన్ లో ఎంటరయ్యానన్నమాట.. అని మనసులో అనుకుంటుంది మల్లిక. ఇంతలో రామా, జానకి ఇద్దరూ బైక్ మీద వస్తారు. ఒరేయ్ రామా.. అమ్మా జానకి.. ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో ఏమండి.. మీరు ఉండండి అంటుంది జ్ఞానాంబ.

అది కాదు జ్ఞానం.. ఏదైనా సమస్యేమో తెలుసుకోనివ్వు అంటాడు గోవిందరాజు. దీంతో మిమ్మల్ని ఉండమని చెప్పానా అంటుంది జ్ఞానాంబ. రామా, జానకి తన దగ్గరికి వెళ్లి అమ్మ.. అది అంటూ రామా మాట్లాడబోతే.. ఆపుతుంది జ్ఞానాంబ. నువ్వు మాట్లాడకు రామా అంటుంది జ్ఞానాంబ.

నా కొడుకు ప్రాణాలంటే నీకు లెక్కలేదా అంటుంది జ్ఞానాంబ. వాడి ఆయుష్షుకు ఏమైనా నీకు బాధ కానీ.. భయం కానీ ఉండవా అంటుంది జ్ఞానాంబ. దీంతో నా భర్తంటే నాకు ప్రాణం. ఆయనకు ఏమైనా నేను ఎలా బతకగలను అత్తయ్య గారు అంటుంది జానకి.

నిజంగా నీకు అంత బాధగా ఉంటే.. నా కొడుకును ఇలా బయటికి తీసుకెళ్తావా అని అంటుంది జ్ఞానాంబ. వాడు నిండు నూరేళ్లు ఉండాలని ఈ ఆయుష్షు పూజ చేయించాను. రేపు ఉదయం వరకు గుమ్మం దాటకూడదని మీకు చిలక్కు చెప్పినట్టు చెప్పాను కదా.

నేను అంతలా చెప్పాక కూడా నువ్వు లెక్కలేకుండా ప్రవర్తించావంటే.. ఏంటి నీ ఉద్దేశం. నా మాటంటే విలువ లేదా.. లేదంటే నా కొడుకంటే నీకు విలువ లేదా అని ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ. ఓవైపు పూజ పెట్టుకుంటే.. ఇంతలో బయటికి వెళ్లేంత కొంపలు అంటుకుపోయే పనులు ఏముంటాయి చెప్పండి అంటుంది జ్ఞానాంబ.

ఇంతలో మల్లిక కలగజేసుకుంటుంది. బావ గారంటే అత్తయ్యకు పంచ ప్రాణాలు అని తెలుసు కదా. అత్తయ్య గారు చెప్పాక కూడా నువ్వు అలా తీసుకెళ్తే ఎలా అంటుంది మల్లిక. మాట్లాడవేంటి.. నీకు చెప్పానా లేదా.. నా మాటంటే లెక్కలేకుండా నువ్వు ఎందుకు ఇలా చేశావు అని ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ.

పూజ రోజున నా కొడుకును బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తుంది జ్ఞానాంబ. దీంతో మాస్టర్ చెఫ్ పోటీల కోసం అప్లికేషన్ పూర్తి చేయడానికి వెళ్లాం అని అసలు నిజం చెబుతుంది జానకి. దీంతో జ్ఞానాంబతో పాటు అందరూ షాక్ అవుతారు.

ఏంటి.. ఏమన్నావు అని అడుగుతుంది జ్ఞానాంబ. ఆయన వంటల పోటీల్లో పాల్గొనడానికి ఈరోజే చివరి తేదీ అని చెబుతుంది జానకి. సొంత పెత్తనాలు చేస్తున్నావా అని అడుగుతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?

Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…

30 minutes ago

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

1 hour ago

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

2 hours ago

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

3 hours ago

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌ పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !

Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…

4 hours ago

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

5 hours ago

Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా…?

Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…

6 hours ago

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

7 hours ago