Janaki Kalaganaledu 27 Aug Today Episode : జానకి స్వీట్ల ఆర్డర్ ను సరైన సమయానికే పూర్తిచేసినా.. జానకి చదువు విషయం తెలుసుకున్న జ్ఞానాంబ? జానకి చదువుకుందని తెలియడంతో జ్ఞానాంబ ఏం చేసింది?

Janaki kalaganaledu 27 august 2021 full episode 115 highlights

Janaki Kalaganaledu 27 Aug Today Episode : జానకి కలగనలేదు సీరియల్ 27 ఆగస్టు 2021, శుక్రవారం లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పనివాళ్లను స్వీట్లు తయారు చేయడానికి రానివ్వకుండా.. వాళ్లకు డబ్బులు ఇచ్చి వెనక్కి పంపించేస్తుంది మల్లిక. పనివాళ్లు ఇంకా రావడం లేదేంటి.. అని జానకి ఎదురు చూస్తుంటుంది. అందరూ కలిసి స్వీట్లు తయారు చేస్తుంటారు. జ్ఞానాంబ కూడా పనిలో ఇన్వాల్వ్ అవుతుంది.

Janaki kalaganaledu 27 august 2021 full episode 115 highlights

ఇంతలో మల్లిక అక్కడికి వస్తుంది. ఖార్ఖానాలో అందరూ పనిచేయడం చూసి షాక్ అవుతుంది. వామ్మో.. పోలేరమ్మ నన్ను ఇప్పుడు చూసిందంటే.. ఏం చేస్తుందో ఏమో.. ఎలాగైనా మేనేజ్ చేయాలి.. అనుకొని వెళ్తుంది. నేను ఆలస్యంగా వచ్చినా.. అద్భుతంగా పనిచేస్తాను.. అత్తయ్య గారు అంటుంది మల్లిక. కాసేపట్లో ఉంటుంది అసలు మజా.. అనుకుంటుంది.

Janaki kalaganaledu 27 august 2021 full episode 115 highlights

ఇంతలోనే విష్ణు కూడా వస్తాడు. పనిలో సాయం చేస్తుంటాడు. నా ఏటీఎం కార్డు ఏది? అని అడుగుతాడు. ఇస్తానులే.. ముష్టి 500 రూపాయలు ఉన్నాయి కదా అంటాడు. 30 వేల రూపాయలు ఏం చేశావే అని అడుగుతాడు. లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టానులే అంటుంది. ఇద్దరూ కలిసి స్వీట్ల తయారీలో పనిచేస్తుంటారు. పనివాళ్లు రారులే.. అంటూ ఎంజాయ్ చేస్తుంటుంది మల్లిక.

Janaki kalaganaledu 27 august 2021 full episode 115 highlights

Janaki Kalaganaledu 27 Aug Today Episode : పనివాళ్ల కోసం ఎదురు చూసిన జానకి

మరోవైపు పనివాళ్లు ఇంకా రాలేదు ఏంటి? అని అటూ ఇటూ చూస్తుంటుంది జానకి. ఇంతలో జ్ఞానాంబ వచ్చి.. జానకి ఏమైంది.. అని అడుగుతుంది. ఇంతలో మల్లిక అక్కడికి వెళ్తుంది.

Janaki kalaganaledu 27 august 2021 full episode 115 highlights

జానకి.. పనివాళ్లు ఇంకా రాలేదు ఏంటి.. అని అడుగుతుంది. అంటే.. వాళ్లు త్వరగా వస్తే పనులన్నీ చకచకా పూర్తవుతాయి కదా. ఆలస్యం అయితే.. పనులు పూర్తికావేమో.. అని అత్తయ్యగారు.. అని అంటుంది.

పది నిమిషాల్లో వస్తా అన్నారు ఇంకా రాలేదు.. అని అంటుంది జానకి. ఈ మాట చెప్పి అర్ధగంట అవుతోంది. ఇప్పటి వరకు వాళ్లు రాలేదు. వాళ్లు ఈ పాటికి పనిలో ఉండాల్సింది.. అని అంటుంది జ్ఞానాంబ. అందరూ తెగ టెన్షన్ పడుతుంటారు. ఇంతలో వాళ్లకు ఫోన్ చేయమని జానకి మామయ్య చెబుతాడు. కానీ.. వాళ్లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో ఏం చేయాలో జానకికి అర్థం కాదు.

Janaki kalaganaledu 27 august 2021 full episode 115 highlights

Janaki Kalaganaledu 27 Aug Today Episode : పనికి రాకుండా.. ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకున్న పనివాళ్లు

స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి? అని జానకి, రామా టెన్షన్ పడతారు. ఇంతలోనే జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. ఇందులో తెలియకపోవడానికి, అర్ధం కాకపోవడానికి ఏముంది. వాళ్లు పని ఎగ్గొట్టారు. వాళ్లు ఇప్పటికే వచ్చి ఉండాలి. కానీ.. ఇప్పటికీ రాలేదు అంటే అర్థం ఏంటి? ఈ పని ఎంత ముఖ్యమో వాళ్లకు తెలుసు కదా. అయినా కూడా వాళ్లు రాలేదంటే.. వాళ్లు ఇక రారు.. అని అర్థం. ఒక విషయం ముందు ఆలోచించేముందు.. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సమయం తక్కువగా ఉంది.. అందించడం కష్టం.. మాట పోతుంది అని చెప్పా. కానీ.. ఏవో ఖాఖీ లెక్కలు చెప్పి.. చేస్తాం.. అందిస్తాం.. అని చెప్పింది. ఇదేనా నువ్వు చేసేది. నిన్ను నమ్మినందుకు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు ఏదైనా కాంట్రాక్ట్ తీసుకుంటే మాట పోవడం అంటూ లేదు. ఇప్పుడు నేను వాళ్లకు ఏం సమాధానం చెప్పాలి.. చెప్పు.. అంటూ నిలదీస్తుంది జ్ఞానాంబ.

Janaki kalaganaledu 27 august 2021 full episode 115 highlights

చేతగానప్పుడు ఎందుకు ఆర్డర్ తీసుకున్నారు అని అడిగితే.. నేను ఏం చేయాలి. వాళ్ల ముందు తలదించుకోవాలా? అంటూ జ్ఞానాంబ అంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? మీరే చెప్పండి. పొరపాటు పడ్డాను. ఇటువంటి విషయాల్లో గుడ్డిగా నమ్మకూడదు.. అని తెలిసి కూడా అనవసరంగా పొరపాటు పడ్డాను. నామీద నాకే అసహ్యం వేస్తుంది.. అని జ్ఞానాంబ అనగానే.. నేను ఇప్పుడే వస్తాను.. అత్తయ్య అని చెప్పి జానకి ఎక్కడికో వెళ్లిపోతుంది. ఇక.. మల్లిక సంతోషానికి హద్దులు లేకుండా పోతాయి.

Janaki kalaganaledu 27 august 2021 full episode 115 highlights

వెంటనే జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి.. అత్తయ్య గారు.. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది. జానకికి ఈ విషయాలు తెలియదని తెలుసు కదా. అయినా కూడా ఎందుకు ఈ పని అప్పగించారు.. అనగానే.. నీ నోట్లో నుంచి ఇంకో మాట వస్తే.. అస్సలు బాగోదు.. అని గట్టిగా అరుస్తుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 27 Aug Today Episode : రంగయ్య ఇంటికి వెళ్లిన జానకి

జానకి.. ఊళ్లోకి వెళ్తుంది. వీళ్ల అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వీళ్లు ఇళ్లు కూడా తెలియవు.. ఏం చేయాలి.. అని ఆలోచిస్తుంటుంది. ఏం చేస్తే బాగుంటుంది.. అని ఆలోచించి.. పరిగెత్తుకుంటూ వెళ్తుంది. రంగయ్య ఇంటికి వెళ్తుంది. ఏంటమ్మా.. ఏమైంది అని అడుగుతాడు రంగయ్య. టౌన్ స్వీట్ షాపులో స్వీట్లు తయారు చేస్తారు కదా. మీ షాపులో స్వీట్లు తయారు చేసే వర్కర్లు ఉన్నారా? స్వీట్లు తయారు చేయాలి.. ప్లీజ్ పంపించండి.. అనగానే.. నువ్వేం టెన్షన్ పడకు అమ్మా.. నేను స్వీట్ల తయారీకి పంపిస్తాను. మీరు కంగారు పడకండి.. మీరు నిశ్చింతగా ఉండండి.. అని చెబుతాడు రంగయ్య. పర్లేదు అమ్మ.. అని చెప్తాడు రంగయ్య. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది జానకి.

Janaki kalaganaledu 27 august 2021 full episode 115 highlights

కట్ చేస్తే.. జ్ఞానాంబ టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతుంది. జానకి గారు ఇంకా రాలేదు. తన కోసం వెళ్తా అమ్మా.. అనగానే అక్కర్లేదు.. వెళ్లినదానికి రావడం తెలియదా? అంటుంది జ్ఞానాంబ. ఏమండీ.. ఆ బాబ్జీ గారికి ఫోన్ చేసి మనం ఆర్డర్ ఇవ్వలేమని చెప్పండి.. అని చెబుతుంది జ్ఞానాంబ. ఆర్డర్ ఒప్పుకొని ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు చెబుతున్నామని చెప్పండి.. అని అంటుంది. జానకి వెళ్లింది కదా.. పనివాళ్లను తీసుకొస్తుందేమో అని అంటాడు జ్ఞానాంబ భర్త. తనేంటి.. తీసుకొచ్చేది ఇప్పటికే తన మాట విని.. క్షమాపణలు చెప్పించుకునే వరకు వచ్చా.. అని అంటుంది. వెంటనే ఫోన్ చేయండి.. అని అంటుంది.

Janaki kalaganaledu 27 august 2021 full episode 115 highlights

Janaki Kalaganaledu 27 Aug Today Episode : సైకిళ్లు వేసుకొని ఖార్ఖానాకు వచ్చిన పనివాళ్లు

ఇంతలోనే పనివాళ్లు సైకిళ్లు వేసుకొని అక్కడికి వస్తారు. దీంతో అందరూ కాస్త రిలాక్స్ అవుతారు. జ్ఞానాంబ కూడా కుదుటపడుతుంది. వెంటనే పనివాళ్లు రంగంలోకి దిగి.. పని చేయడం ప్రారంభిస్తారు. ఇక.. మల్లికకు పెద్ద షాక్ తగిలినట్టు అవుతుంది. మల్లికకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో జ్ఞానాంబ వచ్చి పని చేయ్ ముందు అని మల్లికను ప్రశ్నిస్తుంది.

Janaki kalaganaledu 27 august 2021 full episode 115 highlights

కట్ చేస్తే.. స్వీట్ల తయారీ పూర్తి కావస్తుంది. దీంతో జ్ఞానాంబ సంతోషిస్తుంది. అత్తయ్య గారు పని మొదలు పెడదాం అంటుంది జానకి. పదా.. అని చెప్పి తనను తీసుకెళ్తుంది జ్ఞానాంబ. నీ తెలివి తేటలతో ఈ ఇంటిని నడిపించగలవు.. అనే నమ్మకం నాకు వచ్చేసింది జానకి.. అంటుంది జ్ఞానాంబ.

Janaki kalaganaledu 27 august 2021 full episode 115 highlights

అవును అమ్మ.. జానకి గారు బాగా తెలివైన వారు. ఎందుకంటే అంత బాగా చదువుకున్నారు కదా.. అని చెబుతాడు రామా. రామా చెప్పిన మాట విని.. షాక్ అవుతుంది జ్ఞానాంబ.

Janaki kalaganaledu 27 august 2021 full episode 115 highlights

మల్లిక కూడా అక్కడే ఉండి.. రామా అనే మాటలు విని షాక్ అవుతుంది. ఏంటి.. జానకి చదువుకుందా? అని అడుగుతుంది జ్ఞానాంబ. ఏం చదువుకుంది తను.. అని అడుగుతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. తరువాయిభాగంలో చూడాల్సిందే.

Janaki kalaganaledu 27 august 2021 full episode 115 highlights

Recent Posts

Rajinikanth : శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన ర‌జ‌నీకాంత్‌.. ప్ర‌పోజ్ చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో..!

Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…

57 minutes ago

Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు

Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…

2 hours ago

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం..!

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…

3 hours ago

Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…

4 hours ago

Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మ‌రి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!

Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…

5 hours ago

Samudrika Shastra : పురుషుల‌కి ఈ భాగాల‌లో పుట్టు ముచ్చ‌లు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్ట‌మంటే..!

Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…

6 hours ago

Olive Oil vs Coconut Oil : గుండెకి మేలు చేసే ఆయిల్ గురించి మీకు తెలుసా.. ఇది వాడ‌డ‌మే ఉత్త‌మం

Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…

7 hours ago

Gowtam Tinnanuri : కింగ్‌డమ్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది : గౌతమ్ తిన్ననూరి

Gowtam Tinnanuri  : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్‌డమ్' kingdom movie . గౌతమ్…

7 hours ago