
janaki kalaganaledu 27 december 2021 episode
Janaki Kalaganaledu 27 Dec Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 27 డిసెంబర్ 2021, 201 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అఖిల్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడని.. అఖిల్ ఫెయిల్ అవ్వడానికి కారణం ముమ్మాటికీ జానకే అని జ్ఞానాంబకు చెప్పడంతో.. జ్ఞానాంబ కూడా బాధపడుతుంది. వీడొక్కడైనా బాగా చదువుకొని ప్రయోజకుడు అవుతాడని అనుకున్నా కానీ.. పరీక్షలో ఫెయిల్ అయ్యి ఈ ఇంటి పరువు తీశాడని జ్ఞానాంబ అనుకుంటుంది. ఒకవేళ జానకి.. అఖిల్ కు గిటార్ కొనిచ్చి ఉండకపోతే.. అఖిల్ ఈ పరీక్షలో పాస్ అయి ఉండేవాడు అని అనుకుంటుంది జ్ఞానాంబ. ఇక లాభం లేదు.. వీడిని ఖార్ఖానాలో పనికి పెట్టాల్సిందనేని.. వెంటనే స్వీటు కొట్టు వద్దకు అఖిల్ ను తీసుకొస్తుంది జ్ఞానాంబ.
janaki kalaganaledu 27 december 2021 episode
అఖిల్ పరీక్షలో తప్పాడని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో రామా కూడా అఖిల్ కు వార్నింగ్ ఇస్తాడు. దీంతో తప్పు అయింది అన్నయ్య. ఇంకోసారి ఇలా చేయను. ఇంకోసారి బాగా రాసి పాస్ అవుతా. నాకు ట్యూషన్ పెట్టించండి అంటాడు అఖిల్. దీంతో అవునండి.. అఖిల్ పశ్చాతాప పడుతున్నాడు కదా. ఈ ఒక్కసారి అఖిల్ కు అవకాశం ఇచ్చి చూద్దాం అంటుంది జానకి. దీంతో జానకిపై సీరియస్ అవుతుంది జ్ఞానాంబ. నువ్వు మాట్లాడకు. అంతా నీవల్లే అని చెప్పి సీరియస్ అవుతుంది జ్ఞానాంబ. దీంతో షాక్ అవుతుంది జానకి. అంతా నీవల్లే అంటుంది. నువ్వు గిటార్ కొనిచ్చి ఉండకపోతే.. ఇప్పుడు వాడికి ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సొంత పెత్తనాలు చేసి గాజులు అమ్మి వాడికి గిటార్ కొనివ్వాల్సిన అవసరం ఏంటి.. అంటూ జ్ఞానాంబ సీరియస్ అవుతుంది.
అందుకే వీడిని ఈరోజు నుంచి ఖార్ఖానాలో పనికి పెడుతున్నా అని చెబుతుంది జ్ఞానాంబ. వద్దు అంటాడు రామా. కానీ.. జ్ఞానాంబ వినదు. ఈరోజు నుంచి ఖార్ఖానాలో పని చేయాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. దీంతో రామాకు చాలా బాధేస్తుంది. తన తమ్ముడిని ఎలాగైనా గొప్ప చదువు చదివించాలని అనుకున్న రామా ఆశలు అడియాశలయ్యాయని రామా బాధపడటం చూసి తట్టుకోలేకపోతుంది.
కట్ చేస్తే.. అఖిల్ ఖార్ఖానాలో అన్ని పనులు చేస్తుంటాడు. అఖిల్ చేస్తున్న పనులను చూసి తట్టుకోలేకపోతాడు రామా. నేను ఎలాగూ చదువుకోలేదు. విష్ణుకు చదువు అబ్బలేదు. చివరకు అఖిల్ అయినా బాగా చదువుకుంటే చూద్దామనుకున్నా అని జానకితో చెబుతాడు రామా.
వాళ్లను గొప్పస్థాయిలో ఉంచాలని చాలా చాలా కష్టపడ్డాను. నా తమ్ముళ్లలో నన్ను నేను చూసుకున్నాను అని చెబుతాడు రామా. దీంతో జానకి చాలా బాధపడుతుంది. తన కల కోసం రామా ఎంతో కష్టపడుతున్నప్పుడు తన కల కోసం నేను కూడా కష్టపడతా అని అనుకుంటుంది జానకి.
దీంతో వెంటనే జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి ఇక నుంచి అఖిల్ కు నేను ట్యూషన్ చెబుతా అంటుంది జానకి. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. తను పాస్ అయ్యేలా చేస్తాను అని జ్ఞానాంబకు హామీ ఇస్తుంది. ఒకవేళ వాడు సరిగ్గా చదవక.. మళ్లీ పరీక్ష తప్పితే ఏం చేస్తావు అని అడుగుతుంది జ్ఞానాంబ.
నాది హామీ అని చెబుతున్నాను కదా అత్తయ్య గారు అంటుంది జానకి. ఒకవేళ మీరు అన్నట్టు జరిగితే.. మీరు నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అని అంటుంది జానకి. వీడు చేసే పొరపాట్లకు నువ్వు శిక్ష అనుభవించే పరిస్థితి రాకూడదు.. అంటుంది జ్ఞానాంబ. ఒకవేళ అలా జరగకపోతే నేను ఏం చేస్తానో నువ్వు కూడా చూస్తావు అని చెబుతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.