
janaki kalaganaledu 27 January 2022 full episode
Janaki Kalaganaledu 27 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 జనవరి 2022, గురువారం ఎపిసోడ్ 224 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముగ్గుల పోటీలు పూర్తవుతాయి. జ్ఞానాంబ ముగ్గుల పోటీలో మొదటి స్థానంలో నిలుస్తుంది. మరికాసేపట్లో బైక్ రేసింగ్ పోటీలు స్టార్ట్ అవుతాయని నిర్వాహకులు చెబుతారు. దీంతో జానకి గారు కాసేపు బైక్ రైసింగ్ పోటీలు చేసి వెళ్దాం అంటాడు రామా. మీరు ఇదివరకు బైక్ రేసింగ్ లో పాల్గొన్నారా అని అడుగుతుంది జానకి. దీంతో పాల్గొన్నాను.. కానీ ప్రైజ్ రాలేదు అంటాడు. ఎందుకు అంటే చూస్తే ప్రైజ్ ఇవ్వరు కదా అంటాడు రామా. ఇంతలో కన్నబాబు వచ్చి రామాను రెచ్చగొడతాడు. బైక్ రేసింగ్ లో పాల్గొనాలంటే.. మగాడు అయి ఉండాలి. అయినా.. ఈ చుట్టుపక్కల బైక్ రేసింగ్ లో నన్ను ఓడించే మగాడు ఇప్పటి వరకు పుట్టలేదు అంటూ రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
janaki kalaganaledu 27 January 2022 full episode
దీంతో జానకి పదండి.. మనం బైక్ రేస్ లో పార్టిసిపేట్ చేద్దాం అంటాడు. బైక్ పోటీలు ప్రారంభం అవుతాయి. రామాతో పాటు విష్ణు కూడా బైక్ రేసింగ్ లో పాల్గొంటాడు. కన్నబాబు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు బైక్ రేసింగ్ లో ఎలాగైనా గెలవాలి అంటుంది. దీంతో నీకు ఈ బైక్ రేసింగ్ లో గెలిచి కానుకగా ఇస్తా అంటాడు కన్నబాబు. బైక్ రేసింగ్ పోటీలు ప్రారంభం అవుతాయి. రామా బైక్ కు బాంబును అప్పటికే కిరాయి రౌడీ అమర్చి ఉంచుతాడు. అదే విషయం సునందకు ఫోన్ చేసి చెబుతాడు కిరాయి రౌడీ. వామ్మో.. ఆ రామచంద్ర పక్కనే నా కొడుకు కూడా ఉన్నాడు. బాంబు పేలితే.. నా కొడుకు ప్రాణాలు కూడా పోతాయి అని టెన్షన్ పడుతుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సునంద.
రేస్ మధ్యలో రామా బైక్ ను కాలితో తంతాడు కన్నబాబు. దీంతో రామా బైక్ కింద పడిపోతుంది. బైక్ మీది నుంచి రామా కింద పడిపోతాడు. బాంబు బైక్ కింద పడుతుంది. దీంతో అందరూ రామా దగ్గరికి వస్తారు. పోటీలు ముగిసే సమయం అవుతుంది.. అని రామా బైక్ తీసేసరికి దాని కింద ఉన్న బాంబును చూస్తుంది జానకి.
బాంబు అనగానే అందరూ అక్కడి నుంచి పరిగెత్తుతారు. బైక్ పోటీలు నిలిచిపోతాయి. అందరూ దూరంగా వెళ్లండి అని చెప్పి ఆ బాంబును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది జానకి. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే వెంటనే బాంబ్ స్క్వాడ్ కు ఫోన్ చేస్తుంది.
కానీ.. ఆ బాంబును నిర్వీర్యం చేసేందుకు జానకి ప్రయత్నిస్తుంది. వద్దు అని చెప్పినా కూడా వినకుండా జానకి బైక్ లో ఉన్న కటింగ్ ప్లేయర్ ను తీసుకొని బాంబు పేలకుండా.. దాని వైరును కట్ చేస్తుంది. దీంతో బాంబు నిర్వీర్యం అయిపోతుంది. దీంతో అందరూ సంతోషిస్తారు. చప్పట్లు కొడుతారు.
బాంబు ఇక పేలదు అత్తయ్య గారు అని చెబుతుంది జానకి. ఎంత పిలిచినా నువ్వు ఎందుకు రాలేదు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నాం.. అని చెబుతుంది జ్ఞానాంబ. దేవుడి దయ వల్ల ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఇంకా జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఏమయ్యేది చెప్పు అంటుంది జ్ఞానాంబ.
శభాష్ జానకి అంటాడు గోవిందరాజు. జానకి గారు.. మీరు ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా మీరు ఎంత చాకచక్యంగా ఆలోచించారు. మీకు హ్యాట్సాఫ్ అండి అంటాడు రామా. అందరూ తనను ప్రశంసల్లో ముంచెత్తుతారు. మల్లికకు ఏం అర్థం కాదు.
ఎమ్మెల్యే కూడా జానకిని పొగుడుతుంది. ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు. బాంబ్ స్క్వాడ్ వెళ్లి అక్కడ సెర్చ్ చేస్తారు. బాంబును తీసి అప్పటికే దాన్ని డిఫ్యూజ్ చేశారు అని చెబుతారు. దీంతో పోలీస్ షాక్ అవుతాడు. ఎవరు ఈ బాంబ్ ను డిఫ్యూజ్ చేశారు అని అడుగుతాడు పోలీస్.
నేనే అని చెబుతుంది జానకి. మీకు ఈ విషయాలు ఎలా తెలుసు అని అడుగుతాడు పోలీస్. ఏం చదువుకున్నారు అని అడుగుతాడు. డిగ్రీ అంటుంది. మరి ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు. ఎప్పుడో చదువుకున్నట్టు గుర్తు అని చెబుతుంది జానకి.
దీంతో పోలీసు తనను మెచ్చుకొని మీలాంటి వాళ్లు పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉండాలి అని చెబుతాడు. మిమ్మల్ని ఐపీఎస్ చదివించేందుకు డీజీపీతో మాట్లాడుతాం అని హామీ ఇస్తాడు పోలీస్. దీంతో జానకి చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.