
janaki kalaganaledu 27 may 2022 full episode
Janaki Kalaganaledu 27 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం అయింది. ఈరోజు 27 మే 2022, శుక్రవారం ఎపిసోడ్ 310 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ పెళ్లికి విష్ణు, మల్లికను పంపిద్దాం అని చెప్పడంతో ఏం చేయాలో రామా, జానకికి అర్థం కాదు. మరోవైపు వీడియోను అడ్డం పెట్టుకొని మల్లికను బ్లాక్ మెయిల్ చేస్తాడు విష్ణు. వెంటనే చిట్టిబాబుకు ఫోన్ చేసి స్వీట్ల ఆర్డర్ ను రద్దు చేసుకోమని నీ చిట్టిబాబుకు చెప్పు అంటాడు. దీంతో తనకు ఫోన్ చేసి చెబుతుంది మల్లిక. వెంటనే చిట్టిబాబు.. రామాకు ఫోన్ చేస్తాడు. ఇంతకుముందు మీ ఇంటికి వచ్చాను కదా నేనే అంటాడు. ఒకసారి మీ అమ్మ గారికి ఫోన్ ఇవ్వండి అంటాడు చిట్టిబాబు. చెప్పండి చిట్టిబాబు గారు అంటుంది జ్ఞానాంబ. అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయింది అని చెబుతాడు. స్వీట్లు క్యాన్సిల్ చేద్దామని ఫోన్ చేశాను. మళ్లీ ముహూర్తం అనుకోగానే నేను ఫోన్ చేస్తాను అంటాడు.
janaki kalaganaledu 27 may 2022 full episode
దీంతో అలాగేనండి అంటుంది జ్ఞానాంబ. దీంతో ఫోన్ పెట్టేస్తుంది జ్ఞానాంబ. ఏమైంది జ్ఞానం.. అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో పెళ్లి వాయిదా పడిందని చెప్పాడు అంటుంది జ్ఞానాంబ. దీంతో గోవిందరాజు ఫుల్ ఖుషీ అవుతాడు. రాముడు.. ఇక నీకు స్వీట్లు తయారు చేసే కార్యక్రమం లేదు కదా. నువ్వు అమ్మాయి పెళ్లికి బయలుదేరండి అంటుంది. ఇంతలో ఎలాగైనా అత్తయ్య గారి నుంచి నా లక్ష రూపాయలు తీసుకోవాలని అనుకొని అక్కడికి వెళ్తుంది మల్లిక. ఆ లక్ష రూపాయలు ఇస్తే తీసుకెళ్లి అటుకుల చిట్టిబాబుకు ఇచ్చేస్తాను అంటుంది. అతడు నీకు తెలుసా అంటే.. ఆ నేనే కదా అతడిని పంపించింది అంటుంది మల్లిక. దీంతో ఏంటి నువ్వు పంపించావా అని అందరూ షాక్ అవుతారు. దీంతో జ్ఞానాంబ గారు ఎవరు అని అడిగితే.. ఇంట్లో ఉన్నారు వెళ్లండి అని పంపించాన్నమాట. అందుకని ఆ లక్ష రూపాయలు మీరు ఇస్తే పట్టుకెళ్లి ఇచ్చేస్తాను అని అంటుంది.
దీంతో మళ్లీ ముహూర్తం పెట్టుకున్నాక ఆర్డర్ ఇస్తా అన్నాడు. లేదంటే అతడే వచ్చి తీసుకెళ్తాడులే అంటుంది జ్ఞానాంబ. దీంతో మల్లికకు ఏం చేయాలో అర్థం కాదు. మల్లికను అనుమానంగా చూస్తాడు గోవిందరాజు. మరోవైపు తన మొగుడి ఫోన్ తీసుకొని ఆ వీడియోను డిలీట్ చేయాలని అనుకుంటుంది మల్లిక.
కానీ.. ఫోన్ మాత్రం దొరకదు. రాత్రి విష్ణు పడుకున్నాక ఫోన్ కోసం ఎంత చూసినా దొరకదు. ఇంతలో విష్ణు లేస్తాడు. ఫోన్ దొరక్కుండా దాచాను అంటాడు. కట్ చేస్తే తెల్లారుతుంది. మీరు హైదరాబాద్ వెళ్లేందుకు నేను వెళ్లి బస్ టికెట్ బుక్ చేసుకొని వస్తాను అంటాడు గోవిందరాజు.
అదే సమయంలో కన్నబాబు, సునంద.. జ్ఞానాంబ ఇంటికి వస్తారు. వాళ్లను చూసి రామా, జానకి షాక్ అవుతారు. సునంద స్వీట్స్ పేరుతో ఉన్న స్వీట్ బాక్స్ ను తీసుకొని వస్తుంది సునంద. ఏంటి స్వీట్ బాక్స్ పట్టుకొని మా ఇంటికి వచ్చారేంటి అని హేళన చేస్తాడు గోవిందరాజు.
ఎందుకు వచ్చారు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో ముందు ఈ స్వీట్ బాక్స్ తీసుకో అంటుంది సునంద. మేము స్వీట్ షాపు పెట్టాం అంటుంది సునంద. మీరు ఏ షాపు పెట్టుకుంటే మాకేంటి అంటుంది మల్లిక. దీంతో ఎందుకంటే.. ఆ స్వీట్ షాపు పెడుతోంది మీ.. అంటూ ఆగిపోతుంది సునంద.
మీ దగ్గరే మా స్వీట్ షాపు పెడుతున్నాం అంటుంది సునంద. మీ షాపు దగ్గర్లోనే అని చెబుతుంది సునంద. రేయ్ కన్నా.. అప్పుడే వద్దులేరా.. అన్నయ్య గారు.. ఇప్పుడే చెబితే థ్రిల్ ఉండదు. వచ్చే సోమవారం మన సునంద స్వీట్స్ ఓపెనింగ్. ఫోన్ చేసి ప్లేస్ ఎక్కడో చెబుతాను. డైరెక్ట్ గా వచ్చి చూడండి అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.