janaki kalaganaledu 28 march 2022 full episode
Janaki Kalaganaledu 28 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 మార్చి 2022, సోమవారం ఎపిసోడ్ 266 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మల్లిక.. జానకిని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేందుకు.. మరో ఎత్తుగడ వేస్తుంది. దీంతో నీలావతిని పిలిచి ప్లాన్ అమలు చేయిస్తుంది. ఇంటి ముందు ఆ గుడిసె ఏంటి అని అడుగుతుంది. వాళ్లను సిగ్గు, శరం లేకున్నా అలా అక్కడే ఉంటారు.. అంటుంది మల్లిక. అంటే మీ తోటి కోడలు అక్కడ కాపురం పెట్టిందా అని అడుగుతుంది నీలావతి. తోటి కోడలా తోటకూర కట్టా.. ఎప్పుడైతే మా అత్తయ్య గారిని మోసం చేసిందో అప్పటి నుంచి తను నాకు ఏమీ కాదు అంటుంది మల్లిక.
janaki kalaganaledu 28 march 2022 full episode
వీళ్ల వల్ల మీ అత్తయ్య ప్రాణాలకే ప్రమాదం. తన ప్రాణాల మీదికే వస్తుంది.. మీ అత్తయ్య గారిని నువ్వే కాపాడుకోవాలి అంటుంది నీలావతి. దీంతో నేను ఎలాగైనా మా అత్తయ్య గారిని కాపాడుకుంటాను అంటుంది మల్లిక. వెంటనే జానకి దగ్గరికి వెళ్లి మల్లిక తనపై అరుస్తుంది. దీంతో నువ్వేంటో.. నీకు అత్తయ్య గారి మీద ఉన్న ప్రేమేంటో నాకు తెలుసు కానీ.. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లు అంటుంది జానకి. అయినా కూడా వినకుండా.. మల్లిక అదే పనిగా మాట్లాడుతుండటంతో కోపం వచ్చి మల్లిక మీద చేయి చేసుకోబోతుంది జానకి. ఇంతలో జ్ఞానాంబ వచ్చి తన చేయిని ఆపుతుంది.
అసలు నువ్వు ఏం అనుకుంటున్నావు. జ్ఞానాంబ కోడళ్లు ఇంటి బయటే కొట్టుకుంటున్నారు అని ఊర్లో వాళ్లంతా అనుకోవాలా. ఏ క్షణమైతే నా నమ్మకానికి నువ్వు ద్రోహం చేశావో ఆ క్షణమే నీకు, నాకు మధ్య ఉన్న బంధం తెగిపోయింది అంటుంది జ్ఞానాంబ.
అత్తయ్య గారు.. నేను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదండి. అయినా కూడా వినకుండా నన్ను కొట్టబోయింది అని చెబుతుంది మల్లిక. మల్లిక ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు అంటుంది జానకి. దీంతో ఎవరు అబద్ధాలు చెబుతున్నారో.. ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారో నాకు బాగా తెలుసు అంటుంది జ్ఞానాంబ.
అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోగానే.. పెద్దమ్మ మనం వచ్చిన పని అయిపోయింది పదా అని నీలావతిని అక్కడి నుంచి తీసుకెళ్తుంది మల్లిక. కట్ చేస్తే.. ఈరోజు నుంచి మన స్వీట్ కొట్టును నువ్వే చూసుకో అని విష్ణుకు చెబుతుంది జ్ఞానాంబ. అదేంటమ్మా.. స్వీట్ కొట్టును అన్నయ్య చూసుకుంటన్నాడు కదా అంటాడు విష్ణు.
పాతికేళ్ల నుంచి మనకు అన్నం పెట్టిన కొట్టు అది.. అంటుంది జ్ఞానాంబ. ఒకళ్లు వదిలేసినంత మాత్రాన నేను వదిలేయను కదా. అందుకే ఈరోజు నుంచి మన స్వీట్ కొట్టును నువ్వు చూసుకో అంటుంది జ్ఞానాంబ. దీంతో నేను బట్టల కొట్ట చూసుకోవాలి కదా.. స్వీటు కొట్టు కూడా అంటే సమస్య అవుతుంది అంటాడు విష్ణు.
స్వీట్ షాపు నా వల్ల కాదమ్మ. నన్ను క్షమించు అంటాడు విష్ణు. దీంతో జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు. అఖిల్ ను స్వీట్ కొట్టు చూసుకోమని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో నాకు క్లాసులు ఉంటాయి కదా. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అంటాడు.
దీంతో స్వీట్ కొట్టును ఎవరు చూసుకోవాలి. దానికి తాళం వేయాలా అంటుంది జ్ఞానాంబ. నాకు చదవడానికి సమయం కుదరదు అంటాడు అఖిల్. ఏం కాదు.. నువ్వు ఇప్పటి దాకా చదివింది చాలు కానీ.. నోర్మూసుకొని స్వీట్ కొట్టుకు వెళ్లు అంటుంది జ్ఞానాంబ.
ఇంతలో రామా, జానకి అక్కడికి వచ్చి.. అఖిల్ నువ్వు ఆగు అంటుంది జానకి. అత్తయ్య గారు.. అఖిల్ చాలా కష్టపడి చదువుతున్నాడు. ఈ సారి మంచి మార్కులతో పాస్ కావాలనే పట్టుదలతో ఉన్నాడు. ఖచ్చితంగా పాస్ అవుతాడు అంటుంది జానకి.
అఖిల్ చదువు మాన్పించకండి అంటుంది జానకి. దీంతో ఎవరు నువ్వు. నా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వు ఎవరు అంటుంది జ్ఞానాంబ. ఎవరూ వెళ్లరా.. అయితే స్వీటు కొట్టుకు నేనే వెళ్తాను అని చెప్పి తాళాలు అఖిల్ దగ్గర్నుంచి తీసుకుంటుంది జ్ఞానాంబ.
ఎవ్వరు చెప్పినా వినదు. దీంతో రామా, జానకికి ఏం చేయాలో అర్థం కాదు. తమ చిన్నప్పుడు జరిగిన విషయాలు.. తమ కోసం జ్ఞానాంబ కష్టపడటం గురించి జానకికి చెబుతాడు రామా. మా అమ్మ కష్టాన్ని చూసే నేను బడికి వెళ్లడం మానేసి.. మా అమ్మతో పాటే బండి దగ్గర స్వీట్లు అమ్మడం ప్రారంభించాను అంటాడు రామా.
మరోవైపు పని కోసం వేరే ఖార్ఖానాలో పనికి కుదురుతాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
This website uses cookies.