Home » Entertainment » Janaki Kalaganaledu 28 October 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 28 Oct Today Episode : మల్లిక గర్భవతి కాదని జ్ఞానాంబకు తెలుస్తుందా? జానకి ఈ విషయం అందరికీ చెప్పి మల్లికను ఇంట్లో నుంచి పంపించేస్తుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: October 28, 2022, 9:00 am
Advertisement

Janaki Kalaganaledu 28 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 28 అక్టోబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 420 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ.. తన ఇద్దరు కోడళ్ల కోసం చికితతో కలిసి సున్నుండలు చేస్తుంది. మల్లికమ్మ గారు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మీరు అవేవీ పట్టించుకోకుండా ఆమె కోసం మీరు ఇలా సున్నుండలు చేస్తున్నారు అని అడుగుతుంది. దీంతో చికిత.. ఏదో  సమస్యలు రాగానే విడిపోయే బంధం కాదు అంటూ వాళ్లు కడుపుతో ఉన్నారు కాబట్టి వాళ్లకు బలమైన ఆహారం పెట్టాలి. అందుకే సున్నుండలు చేస్తున్నాను అని చెబుతుంది. ఆ తర్వాత జానకిని పిలిచిన జ్ఞానాంబ.. మల్లిక, జెస్సీ ఇద్దరికీ సున్నుండలు ఇవ్వమని చెబుతుంది. ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకో అని చెబుతుంది. దీంతో సున్నుండలను తీసుకొని ముందు జెస్సీ దగ్గరికి వెళ్తుంది జానకి. తనకు సున్నుండలు తిను అంటుంది. దేవత లాంటి అత్తయ్య గారి ఇంట్లోకి రావడం నా అదృష్టం అంటూ జెస్సీ.. జానకితో అంటుంది. ఇవన్నీ జ్ఞానాంబ బయటి నుంచి వింటుంది. జానకి అందరినీ కలిసే ఉండేలా ఉంచేందుకు ఎంతో కష్టపడుతుంది అని అనుకుంటుంది జ్ఞానాంబ.

Advertisement

janaki kalaganaledu 28 october 2022 full episode

ఆ తర్వాత మల్లిక దగ్గరికి సున్నుండలు తీసుకొని వెళ్లబోతున్న జానకికి అసలు మల్లిక ప్రెగ్నెంటా కాదా అనే డౌట్ వస్తుంది. అందుకే ప్రెగ్నెంట్ అయిన వాళ్లు వాడే ట్యాబ్లెట్లు తీసుకెళ్లి ఈ ట్యాబ్లెట్లు వేసుకొని సున్నుండలు తిను అంటుంది జానకి. దీంతో వద్దు జానకి.. ముందు సున్నుండలు తిన్నాక నేను ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటానులే అంటుంది. తను బయటికి వెళ్లినట్టే వెళ్లి అక్కడ నిలబడి చూస్తుంది కానీ.. మల్లిక ట్యాబ్లెట్లు వేసుకోకుండా వాటిని విసిరేసి కేవలం సున్నుండలు మాత్రమే తింటుంది. దీంతో మల్లిక ప్రెగ్నెంట్ కాదు అని అనిపిస్తుంది జానకి. కానీ.. అది ఆధారాలతో సహా ఎలా నిరూపించాలి. ఇంత మంది ఎమోషన్స్ తో ఎందుకు మల్లిక ఆడుకుంటోంది అని తన చదువును పక్కన పెట్టి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రామా వచ్చి.. చదువుకోకుండా ఏం ఆలోచిస్తున్నారు అంటాడు రామా. దీంతో మల్లిక ప్రెగ్నెన్సీ గురించి ఇప్పుడే రామాకు చెప్పొద్దు అని అనుకుంటుంది జానకి.

Advertisement

చదువు గురించే ఆలోచిస్తున్నాను. ఒక ప్రశ్నకు నేను ఒక సమాధానం అనుకుంటున్నాను. నేను సమాధానం ఒకటి అనుకుంటున్నా.. దానికి మరో సమాధానం కనిపిస్తోంది అనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటుంది జానకి. దీంతో దానికి అంత కంగారు ఎందుకండి. మీరు అనుకుంటున్న సమాధానం కరెక్టో కాదో.. పుస్తకంలో ఒక సారి చెక్ చేసుకోండి అంటాడు రామా. దీంతో థాంక్యూ రామా గారు మంచి ఐడియా ఇచ్చారు అంటుంది జానకి.

అసలు మల్లిక ప్రెగ్నెంట్ అని కన్ఫమ్ అయినప్పటి నుంచి ఏం జరిగిందో తెలుసుంటే బెటర్ అని అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది జానకి. లీలావతి.. మల్లిక ప్రెగ్నెంట్ అయిందని జ్ఞానాంబకు చెప్పడం గుర్తొస్తుంది జానకికి. ఏది ఏమైనా లీలావతి ద్వారా అసలు విషయం రాబట్టాలి అని అనుకుంటుంది జానకి.

Advertisement

Janaki Kalaganaledu 28 Oct Today Episode : లీలావతికి ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పిన జానకి

కట్ చేస్తే తెల్లవారుతుంది. వెంటనే లీలావతికి ఫోన్ చేస్తుంది జానకి. హలో జానకి.. ఏంటమ్మా ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు అంటుంది లీలావతి. దీంతో నీతో అర్జెంట్ గా మాట్లాడాలి ఇంటికి రా అంటుంది జానకి. దీంతో ఇంత అర్జెంట్ గా రమ్మంటోంది ఏంటి అనుకుంటుంది.

పక్కూరులో నాంచారమ్మ ఉంది కదా.. దాని కూతురు పెద్దమనిషి అయిందట. ఇప్పుడే రెడీ అయ్యా అక్కడికి వెళ్తున్నా. ఏం పని ఉంది చెప్పు అంటుంది లీలావతి. దీంతో నువ్వు అయితే ముందు రా పిన్ని. వచ్చాక అసలు విషయం చెబుతాను అంటుంది జానకి.

దీంతో కొంపదీసి మల్లికది గర్భం కాదని తెలిసిపోయిందా ఏంటి అని అనుకొని వెంటనే మల్లికకు ఫోన్ చేస్తుంది లీలావతి. కానీ.. మల్లిక మాత్రం అస్సలు ఫోన్ ఎత్తదు. ఇంకా నిద్ర లేవకపోవడంతో ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది మల్లిక. జానకి ఫోన్ చేసింది అందుకోసమే అయితే అంతా మల్లిక మీద తోసేస్తాను. నాకు ఏ సమస్య లేకుండా చూసుకుంటాను అని అనుకొని జానకి ఇంటికి బయలుదేరుతుంది లీలావతి.

లీలావతి రావడం గమనిస్తుంది జానకి. తను రావడం చూసి లోపల దాచుకుంటుంది. ఇంతలో అక్కడికి మల్లిక వస్తుంది. ఈవిడ ఏంటి పొద్దున్నే వచ్చి జానకిని పిలుస్తుంది అని అనుకొని పెద్దమ్మ ఏంటి ఇంత పొద్దున్నే వచ్చి జానకి అని పిలుస్తున్నావు అని అంటుంది.

Advertisement

దీంతో సరే సరే ఇలా రా అని చెప్పి అటువైపునకు తీసుకెళ్లి నీకు కడుపొచ్చిందని నువ్వు ఆడుతున్న దొంగ నాటకం జానకికి తెలిసిపోయిందా ఏంటి. జానకి నాకు ఫోన్ చేసి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వెంటనే బయలుదేరి రా అని కోపంగా చెప్పింది అంటుంది లీలావతి.

దీంతో ఇంత పొద్దున్నే ఫోన్ చేసిందా జానకి అని అనుకుంటుంది. జానకికి నిజం తెలిసిందా అని అనుకుంటుంది. ఒకవేళ జానకికి నిజం తెలిస్తే నన్ను పోలీసులకు పట్టిస్తుంది. అందుకే అంతా నువ్వే చేయమన్నావు అని చెబుతాను అంటుంది. దీంతో జానకికే కాదు.. ఎవ్వరికీ నాది దొంగ కడుపు అని తెలియదు.

నిజమైన కడుపే అని నమ్మి కూర్చోబెట్టి నాకు సేవలు చేస్తున్నారు. నువ్వు అనవసరంగా నోరు పారేసుకోకు. నేను చెప్పేది విను అంటుంది మల్లిక. దీంతో లేదు.. నేను వినను అంటుంది లీలావతి. ఇంతలో అక్కడికి జ్ఞానాంబ రావడం చూస్తుంది మల్లిక. దీంతో టాపిక్ మార్చు అంటుంది.

కొంచెం కాఫీ పౌడర్ ఉంటే ఇస్తావా మల్లిక అంటుంది. దీంతో ఇటు వచ్చే బదులు కొట్టుకు వెళ్లి కొనుక్కోవచ్చు కదా అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత తను తులసి కోటకు పూజ చేసేందుకు వెళ్లిపోతుంది. మల్లిక ప్రెగ్నెన్సీ అబద్ధం అని తెలిస్తే అత్తయ్య గారు తట్టుకోలేరు అని అనుకుంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి