
janaki kalaganaledu 29 november 2021 full episode
Janaki Kalaganaledu 29 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 నవంబర్ 2021, సోమవారం 181 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. మల్లిక ఇంట్లో పనులు చేయలేక చిరాకు పడుతుంది. పొద్దున్నే లేచి ఈ దిక్కుమాలిన పనులు చేయలేకపోతున్నాను. నా మొగుడు నన్ను పట్నం ఎప్పుడు తీసుకెళ్తాడో.. నాకు ఈ పోలేరమ్మ పీడ ఎప్పుడు విరగడ అవుతుందో అని తనలో తాను అనుకుంటుంది మల్లిక. ఇంతలో జ్ఞానాంబ.. జానకికి జడ వేయడం చూసి షాక్ అవుతుంది మల్లిక.ఏంటి వీళ్ల మధ్య ఈ బంధం.. నేను తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటుంది మల్లిక. జడ పూర్తయ్యాక.. జానకి, జ్ఞానాంబ ఇద్దరూ ఇంట్లోకి వెళ్లబోతూ.. మల్లికను చూస్తారు.
janaki kalaganaledu 29 november 2021 full episode
ఏంటి ఏడుస్తున్నావు అని మల్లికను అడుగుతుంది జ్ఞానాంబ. మీరు అన్యోన్యంగా ఉండటం చూసి.. ఏదో అనబోతుంది. కాదు అత్తయ్య గారు అంటూ ఏదో ఒకటి సర్ది చెబుతుంది మల్లిక. ఇంతలో జానకి..గుడికి వెళ్తున్నాను వస్తావా అని అడుగుతుంది మల్లికను. దీంతో మల్లిక తన ప్లాన్ ను ప్రారంభిస్తుంది.నాకు రావాలని ఉంది జానకి కానీ.. నువ్వు అబద్ధం చెప్పి మోసం చేసి బావ గారిని పెళ్లి చేసుకున్నావు కదా. ఆ విషయం ఊరి వాళ్లందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నీతో నేను వస్తే అందరూ నన్ను కూడా తిడుతారు. నేను రాను అని చెబుతుంది మల్లిక.దీంతో జ్ఞానాంబ నేను వస్తాను జానకి అంటుంది. నేనే కాదు మల్లిక కూడా వస్తుంది. ఎవరు ఆడిపోసుకుంటారో చూద్దాం.. అని అంటుంది జ్ఞానాంబ. దీంతో మల్లిక షాక్ అవుతుంది. వామ్మో.. ఇదేంటి పోలేరమ్మ ఇలా చేసింది. నన్ను అడ్డంగా బుక్ చేసింది కదా అనుకుంటుంది.
అందరూ గుడికి బయలుదేరేలోపే లీలావతి ఇంటికి వస్తుంది. ఇదిగో జ్ఞానాంబ.. చాలా ఆశ్చర్యంగా ఉంది.. అంటుంది. నీ కొడుకు కంటే తక్కువ చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా అని ఆరోజు సవాల్ చేశావు. కానీ.. నీ కోడలు చదువు విషయం దాచి పెట్టి నిన్ను మోసం చేసింది. ఆ మోసాన్ని నువ్వు ప్రాణం పోయినా క్షమించకూడదు. మరీ ముఖ్యంగా పెద్ద కొడుకు అంటే పంచప్రాణాలు కదా.
నీ కొడుకు కంటే ఎక్కువ చదువు ఉన్న జానకిని ఎందుకు క్షమిస్తున్నావు. నువ్వు నీ పెద్ద కోడలును ఇంట్లో నుంచి బయటికి వెళ్లగొడతానని చెప్పి ఇప్పుడు ఆమెను పట్టుకొని గుడులు గోపురాలు తిరుగుతున్నావా? అంటూ లీలావతి జానకిపై నోరు పారేసుకుంటుంది.
అయినా నువ్వెందుకు నీ కోడలును బయటికి పంపించలేదో నాకు అర్థం అయిందిలే. జానకిని ఇంట్లో నుంచి పంపించేస్తే మళ్లీ నీకొడుకుకు పెళ్లి చేయాలంటే అమ్మాయి దొరుకుతుందో లేదో అని భయపడ్డావా? అంటుంది లీలావతి. దీంతో అవును భయపడ్డాను కానీ.. జానకి లాంటి మరో అమ్మాయి దొరకదని భయపడ్డాను.
నాకోడలు వజ్రం. తను చదువుకున్నా కొంచెం కూడా అహం లేదు. మా రామాకు భార్య అవడం.. మా ఇంటి కోడలు అవడం మా అదృష్టం. అందుకే నా కోడలును కళ్లలో పెట్టి చూసుకుంటున్నాను అని చెబుతుంది జ్ఞానాంబ. అర్థం అయింది కదా అనగానే లీలావతి షాక్ అవుతుంది.మరోవైపు జానకితో కలిసి జ్ఞానాంబ గుడికి వెళ్తుంది. అదే గుడికి అభి వస్తాడు. జానకి పేరు మీద జ్ఞానాంబ అర్చన చేయిస్తుంది. ఇంతలో జానకి అభిని చూస్తుంది. అభి కూడా అప్పుడే గుడికి వచ్చి మొక్కుతాడు. కానీ జానకిని చూడడు. అభి అక్కడి నుంచి వెళ్లి ప్రదిక్షణలు చేస్తుంటాడు.
అభి ఏంటి ఇక్కడున్నాడు. నన్ను క్లాస్ లకు రావడం లేదని అడగడానికి వచ్చాడా అని అనుకుంటుంది. టెన్షన్ పడుతుంది. అభికి కనిపించకుండా ఉండేందుకు పక్కనే ఉన్న మరో గుడికి వెళ్దామని అంటుంది జానకి. అప్పుడే జానకిని చూస్తాడు అభి. హాయ్ అంటాడు అభి.
కానీ.. జానకి మాత్రం మాట్లాడదు. తన దగ్గరికి రాబోతాడు అభి. అతడిని తప్పించుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది జానకి. తనకు ఇక్కడే స్టడీ మెటిరియల్ ఇచ్చేద్దామని అభి అనుకుంటాడు. జానకి కోసం వెతుకుతుంటాడు. ఇంతలో జానకికి ఫోన్ చేస్తాడు.కానీ.. జానకి ఫోన్ ఇంట్లో ఉండటంతో జానకి గుడికి వెళ్లిందని ఫోన్ తీసి రామా చెబుతాడు. నేను మీ ఊరి గుడిలోనే ఉన్నాను. జానకిని చూశాను కానీ.. జానకి ఎటువెళ్లిందో కనిపించడం లేదు అంటాడు అభి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
This website uses cookies.