Home » Entertainment » Janaki Kalaganaledu 29 October 2021 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 29 Oct Today Episode : రామా, జ్ఞానాంబ మధ్య దూరం తగ్గాలంటే.. జానకి ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిందేనా? రామా భవిష్యత్తు కోసం జానకి తీసుకున్న నిర్ణయం ఏంటి?

Authored By
Varun G
The Telugu News | Published on: October 29, 2021, 11:26 am
Advertisement

Janaki Kalaganaledu 29 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 అక్టోబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 160 తాజాగా విడుదలైంది. జ్ఞానాంబ ఇంటికి వచ్చిన నీలావతి.. జానకి చదువుకున్న విషయం అందరికీ తెలిసిపోయింది అని అంటుంది. జ్ఞానాంబ కడుపులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు అంటూ నీలావతి చెబుతుండగానే మల్లిక అందుకొని.. ఏంటి నీలావతి గారు మీరు చెప్పేది.. జానకి ఇంట్లో నుంచి వెళ్లిపోతేనే జ్ఞానాంబ మనసు కుదుట పడుతుందని అంటారు. జానకిని ఇంట్లో నుంచి పంపిస్తేనే రామా భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటున్నావా? అంటూ మల్లిక రెచ్చిపోతుంది. దీంతో గోవిందరాజు.. మల్లికను మాట్లాడనీయడు.

Advertisement

Janaki Kalaganaledu 29 october 2021 full episode

ఇక.. నీలావతి వెళ్లిపోతూ చివరగా జ్ఞానాంబను ఒక మాట అడుగుతుంది. అప్పుడు నువ్వేం అన్నావు.. 15 రోజుల్లో నా కొడుకుకు బ్రహ్మాండమైన భార్యను తీసుకొస్తా అని శపథం చేశావు. చెప్పినట్టుగానే 15 రోజుల్లో పెళ్లి చేశావు కానీ.. 15 నెలల్లోనే అది పెటాకులు అయింది. మరి.. అంతే తొందరగా జానకిని ఇంట్లో నుంచి పంపిస్తావా? అంటూ ప్రశ్నిస్తుంది నీలావతి. ఇదిగో నీలావతి.. ఇది నా ఇంటి విషయం.. దీంట్లో నువ్వు తలదూర్చాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో నాకు తెలుసు. ఇక నువ్వు వెళ్లొచ్చు అంటుంది జ్ఞానాంబ. అబ్బో.. సరే వెళ్తానులే.. నాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు కానీ.. రేపు ఊళ్లో వాళ్లకు ఏం సమాధానం చెబుతావో చూస్తాం అని అంటూ నీలావతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

కట్ చేస్తే.. రామా కొట్టు దగ్గర కూర్చొని తన తల్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది.. 50 కిలోల పూతరేకులు కావాలి.. అంటాడు. దీంతో ఓకే సరే.. అంటాడు రామా. సరే అంటాడు. రేపు ఉదయం 10 గంటల కల్లా కావాలి ఇస్తావు కదా అంటాడు. చూడు.. ఇది అడ్వాన్స్ గా పెట్టుకో.. మిగితా బ్యాలెన్స్ సరుకు ఇవ్వగానే ఇస్తాను.. అని చెప్పి వెళ్లిపోతాడు.

రజినీకాంత్ వచ్చి.. అన్న నువ్వు ఇంతలా బాధపడటం ఎప్పుడూ చూడలేదు. నీతో మాట్లాడకుండా పెద్దమ్మ కూడా ఉండలేదు. నువ్వు కూడా పెద్దమ్మతో మాట్లాడకుండా ఉండలేవు అన్నా.. అని అంటాడు. అమ్మ కూడా నా గురించి బాధపడుతుంది కానీ.. మాట్లాడటం లేదు అని అనుకొని బాధపడతాడు రామా.

Advertisement

Janaki Kalaganaledu 29 Oct Today Episode : నేనే దురదృష్టవంతురాలిని అని రామాతో చెప్పిన జానకి

కట్ చేస్తే రాత్రి అవుతుంది. ఇంటికి వచ్చాక కూడా రామా.. తన తల్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో జానకి వచ్చి ఏమండి.. భోజనం చేద్దాం రండి అంటుంది జానకి. ప్రతిక్షణం మీరు బాధపడుతూనే ఉన్నారు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదు.. అంటుంది జానకి. అమ్మ నాతో మాట్లాడకపోతే ఎందుకు బతకాలో.. ఎలా బతకాలో కూడా అర్థం కావడం లేదు.. అంటాడు. నాకు మాత్రమే అమ్మ  శిక్ష వేయలేదు.. తనకు కూడా శిక్ష వేసుకుంది. రామా అని నన్ను పిలవకుండా అమ్మ కాసేపు కూడా ఉండలేదు.. అని చెబుతుంటే జ్ఞానాంబ అన్నీ వింటుంది. దీంతో జ్ఞానాంబ కూడా బాధపడుతుంది.

Janaki Kalaganaledu 29 october 2021 full episode

నేను దురదృష్టవంతురాలినని మరోసారి నాకు అర్థం అయింది. అర్థాంతరంగా అమ్మానాన్నలను పోగొట్టుకున్నాను. అన్నయ్యా వదినలు ఎక్కడో దురంగా ఉన్నా నాకు లేనట్టే. అత్తారింట్లో అడుగు పెట్టి.. ఎంతో అన్యోన్యంగా ఉండే తల్లికొడుకుల మధ్య దూరం పెంచాను. నేను మీ జీవితంలోకి రాకపోయి ఉంటే.. ఈరోజు మీరిద్దరు ఇలా బాధపడే చాన్స్ ఉండేదే కాదు.. అనగానే.. మీరు నాకు దొరకడం నా అదృష్టం జానకి గారు అంటాడు రామా.

కట్ చేస్తే ఉదయం అవుతుంది. కొట్టులో కూడా అలాగే ముభావంగా ఉంటాడు రామా. ఇంతలో కన్నబాబు కొట్టుకు వచ్చి నాలుగు బాద్ షాలు ఇవ్వమంటాడు. కానీ.. పరధ్యానంలో ఉన్న రామా.. బాద్ షాలకు బదులు కాజాలు ఇస్తాడు. నేనేమన్నా పిచ్చోడినా.. బాద్ షాలు అడిగితే కాజాలు ఇస్తావా? నీకు ఎంత బలుపు అంటూ కన్నబాబు తీవ్రంగా తిడతాడు. దీంతో సారీ అని చెప్పి రామా.. తిరిగి బాద్ షాలు ఇస్తాడు. కానీ.. కన్నబాబు బాద్ షాలు తీసుకోకుండా వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి