janaki kalaganaledu 3 december 2021 full episode
Janaki Kalaganaledu 3 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 డిసెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 185 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి.. జ్ఞానాంబను అరెస్ట్ కాకుండా కాపాడేసరికి.. జ్ఞానాంబకు పట్టరాని సంతోషం వేస్తుంది. జానకి చదువు నాకు శాపంగా మారుతుందేమోనని నువ్వు భయపడ్డావు కానీ.. తన చదువు ఈరోజు మనకు ఉపయోగపడింది. ఈరోజు తను చదువుకోకపోయి ఉంటే.. నువ్వు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఉండేదానివి. మేమంతా బాధపడేవాళ్లం.. అని రామా అంటాడు. అవును జానకి.. రామా చెప్పింది నిజమే. నువ్వు లేకుంటే ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ లో ఉండేదానిని. ఈ ఇంటి కోడలుగా మిమ్మల్ని సంతోషంగా ఉంచుకోవడం నాకు బాధ్యత అంటుంది జానకి.
janaki kalaganaledu 3 december 2021 full episode
జానకి గారు మనం పంపించిన పూతరేకులలో ఎలాంటి కల్తీ జరగలేదని మన మీద మనకు నమ్మకం ఉంది కానీ.. ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో తెలుసుకోవడం మంచిదే కదండి అంటాడు రామా. మంచిది మాత్రమే కాదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.. అంటుంది జానకి. అవును.. ఆలోపే ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటుంది జానకి. ఒకవేళ నెయ్యిలో ఏదైనా కలిసిందేమో అంటుంది మల్లిక. నా అనుమానం కూడా అదే మల్లిక అంటుంది జానకి. ఆ తర్వాత ఎవరి రూమ్స్ లోకి వాళ్లు వెళ్లిపోతారు. మల్లిక ఎక్కడ తన తప్పు బయటపడుతుందేమో అని టెన్షన్ పడుతుంది.
మరోవైపు ఖార్ఖానాలో పనిచేస్తున్న వాళ్లందరినీ ఇంటికి పిలిపిస్తుంది జ్ఞానాంబ. ఈ జ్ఞానాంబ స్వీట్లంటే రుచికి సుచికి మారుపేరు. ముఖ్యంగా పూతరేకులకు మన కొట్టు పెట్టింది పేరు. మనం తయారు చేస్తున్న స్వీట్స్ మీద మొదటిసారి నింద పడింది. దాదాపుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన పరిస్థితే వచ్చింది. మా పెద్ద కోడలు జానకి తన చాకచక్యంతో పరువు పోకుండా కాపాడింది.. అంటుంది జ్ఞానాంబ.
మేము కూడా ఎప్పుడూ రాజీపడకుండా సరుకు తయారు చేస్తున్నాం అంటారు పనివాళ్లు. అసలు.. ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు అంటారు పనివాళ్లు. కొత్తవాళ్లు ఎవరైనా ఈ మధ్య ఖార్ఖానాకు వచ్చారా? అని జ్ఞానాంబ పనివాళ్లను అడుగుతుంది. దీంతో ఎవరూ రాలేదమ్మా అంటారు పనివాళ్లు.
అదేంటి.. జానకి ఆరోజు నెయ్యి తీసుకొని ఖార్ఖానాకు వచ్చింది కదా అంటుంది మల్లిక. తిన్నగా నేరాన్ని జానకి వైపు మోపేందుకు ప్రయత్నిస్తుంది. నెయ్యి తీసుకెళ్లిన జానకే అందులో ఏదో ఒకటి కలిపి ఉండొచ్చు అని అంటుంది మల్లిక. దీంతో రామా.. మల్లికపై సీరియస్ అవుతాడు.
ఏమో 15 రోజుల పరీక్ష పేరుతో అత్తయ్య గారు తనను హింసించారు అనే కోపం జానకిలో ఉండి ఉండొచ్చు. ఆ కోపంలో అత్తయ్య గారి పరువు తీయాలని ఇలా చేసి ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలుగా లేనిది.. కొత్తగా ఇప్పుడే ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పండి.. అని ప్రశ్నిస్తుంది మల్లిక.
చేసింది జానకి అని చెప్పినా కూడా ఇంకా జ్ఞానాంబ ఏం నిర్ణయం తీసుకోవడం లేదు ఏంటి అని మల్లిక అనుకుంటుంది. జానకియే ఆ పని చేసిందేమో అత్తయ్య గారు అంటే.. అలాంటి పనికిమాలిన పనులు జానకి ఎప్పటికీ చేయదు.. అని అంటుంది జ్ఞానాంబ.
వెంటనే తన రూమ్ లోకి వెళ్లి తను దాచిన మందును తీసి పడేయాలని అనుకుంటుంది. ఆ సీసాను తీసుకెళ్లి పేరట్లో పడేయడం జానకి చూస్తుంది. వెంటనే ఆ మందు సీసాను తీసుకొని మెడికల్ షాపు అతడికి ఫోన్ చేస్తుంది. దాని వివరాలు కనుక్కుంటుంది.
వెంటనే రామాను పిలిచి.. అసలు విషయం చెబుతుంది. ఇదంతా మల్లిక చేసిందని చెబుతుంది. దీంతో రామాకు కోపం వస్తుంది. మల్లిక మీమీద ధ్వేషం పెంచుకొని ఇంత కుట్ర చేస్తున్నా అమ్మకు చెప్పొద్దంటావేంటి అంటాడు రామా. మల్లిక విషయం అత్తయ్యకు తెలిస్తే మల్లిక సమస్యల్లో పడుతుంది.. వద్దు అంటుంది జానకి.
దీంతో విష్ణును పిలిచి.. అసలు నిజం చెబుతారు రామా, జానకి. దీంతో నీ స్థానంలో ఇంకొకరు ఉంటే వెంటనే ఈ విషయం అమ్మకు చెప్పేవారు. కానీ.. నువ్వు తనను క్షమించావు. ఆ సీతమ్మ తల్లికి ఉన్నంత సహనం నీలో ఉంది వదిన అంటాడు విష్ణు. మల్లిక తరుపున తను జానకిని క్షమాపణలు కోరుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
This website uses cookies.