janaki kalaganaledu 3 january 2022 full episode
Janaki Kalaganaledu 3 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 జనవరి 2022, సోమవారం 206 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కన్నబాబు సాయంత్రం తోటకు రమ్మనడంతో ఏం చేయాలో అర్థం కాదు వెన్నెలకు. తోటకు వెళ్లకపోతే అన్నంత పని చేస్తాడు అని భయపడి.. ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరు అని అనుకుంటుంది. ఇంతలో తనకు జానకి గుర్తొస్తుంది. అవును.. ఈ సమస్యకు జానకి వదిన పరిష్కారం చూపుతుంది అని అనుకొని జానకి దగ్గరికి వెళ్లబోతుండగా ఇంతలో రామా జానకి దగ్గరికి వెళ్తాడు. దీంతో తనకు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు కనుక నేను జానకి వదిన దగ్గరికి వెళ్లానంటే.. ఈ విషయం అన్నయ్యకు కూడా తెలుస్తుంది. దీంతో ఈ విషయాన్ని అమ్మకు చెబుతాడు అని భయపడుతుంది వెన్నెల.
janaki kalaganaledu 3 january 2022 full episode
ఇంతలో రామా జానకి దగ్గరికి వెళ్లి తన ఒడిలో పడుకుంటాడు. దీంతో జానకి షాక్ అవుతుంది. రామా ఎప్పుడు బయటికి వస్తాడా అని చూస్తూ ఉంటుంది. వెన్నెల టెన్షన్ పడటాన్ని చూస్తుంది మల్లిక. దీంతో తనకు డౌట్ వస్తుంది. అమ్మో.. ఈ అమ్మాయి ఎందుకు ఇంత టెన్షన్ పడుతోంది.. అని తనకు తానే ఏదేదో ఊహించుకుంటుంది. పెళ్లి విషయం మాట ఎత్తినప్పటి నుంచి వెన్నెల అదోలా ప్రవర్తిస్తోంది. కొంపదీసి.. కాలేజీలో ఏదైనా లవ్ స్టోరీ ఉందా అని అనుకొని ఓ రాయి వేద్దాం అని అనుకుంటుంది మల్లిక. వెన్నెల ఇటు రా అని ఎటో తీసుకెళ్లిపోతుంది మల్లిక. ఏంటండి శ్రీవారు.. మీరు నేను ఏదో ఊరికి వెళ్లిపోతున్నట్టు మీరు అలా నా ఒడిలో పడుకున్నారు ఏంటి అంటే.. అవునండి.. భవిష్యత్తులో నాకు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అండి. రేపు మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యాక మీరు బిజీ అయిపోతారు. అప్పుడు ఈ సరదాలు ఎక్కడుంటాయి అండి అంటాడు రామా.
దీంతో లేవండి అని చెప్పి.. చూడండి శ్రీవారు. నేను ముందు ఈ రామచంద్ర గారి భార్యను. అందుకే.. భార్యగా ఈ డ్యూటీ ఈ డ్యూటీనే. పోలీస్ గా ఆ డ్యూటీ ఆ డ్యూటీనే. రామచంద్ర భార్య డ్యూటీనే నాకు చాలా ముఖ్యం. మా వారికి నేను సేవలు చేస్తూనే ఉంటాను. అర్థం అయిందా శ్రీవారు.. రండి అని ఒడిలో పడుకోబెట్టుకుంటుంది జానకి.
తన రూమ్ లోకి తీసుకెళ్లి డోర్ వేస్తుంది మల్లిక. ఇప్పుడు చెప్పు ఎవరు ఆ అబ్బాయి అని అడుగుతుంది. వదిన అబ్బాయి ఏంటి వదిన… అంటూ తడబడుతుంది. ఇప్పుడు చెప్పు.. నువ్వు ప్రేమిస్తున్న అబ్బాయి ఎవరు అని మళ్లీ అడుగుతుంది. నువ్వు భలే కవర్ చేస్తున్నావు నాకు తెలుసు కానీ.. నువ్వు ప్రేమించిన అబ్బాయి ఎవరు అని అడుగుతుంది.
అఖిల్ గిటార్ విషయం అమ్మకు చెప్పినట్టు.. నా ప్రేమ విషయం కూడా అమ్మకు చెప్పేస్తుంది అని అనుకొని.. ప్రేమ లేదు దోమ లేదు నువ్వు భలే కామెడీ చేస్తున్నావు వదిన అంటుంది. ఏంటి నువ్వు ప్రేమించిన విషయం జానకి చెప్పింది. అది కూడా అబద్ధమా అని అంటుంది. ఏంటి జానకి వదిన నీకు చెప్పిందా అని అంటుంది.
అవును.. జానకి చెప్పింది కానీ.. నేను ఈ విషయం మీ అమ్మకు చెప్పనులే. జానకి రూమ్ ముందు ఎందుకు వెయిట్ చేస్తున్నావు చెప్పు అని అడుగుతుంది మల్లిక. దీంతో ఎమోషనల్ అవుతుంది. ఆ కన్నబాబు ఉన్నాడు కదా.. వాడు వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెబుతుంది వెన్నెల. విషయం మొత్తం చెబుతుంది. ఇదేదో మనకు పనికొచ్చే సిచ్యుయేషన్ లా ఉంది.. అని అనుకుంటుంది.
ఆ కన్నబాబు సంగతి నేను చూసుకుంటానులే అని అంటుంది వెన్నెల. సాయంత్రం కాగానే కన్నబాబు తోటకు వెన్నెలను తీసుకొని మల్లిక వెళ్తుంది. నేను వచ్చానేంటా అని ఆశ్చర్యపోతున్నావా? భయపడుతున్నావా? ఈ భయం ముందుండాలి. ఫోటోలు చూపించి నా మరదలును బ్లాక్ మెయిల్ చేస్తావా.. అని ఏదేదో వాగుతుంది కానీ.. కన్నబాబు ఏం మాట్లాడడు.
కొన్ని సినిమా డైలాగులు చెప్పి కన్నబాబును భయపెడుదామనుకుంటుంది కానీ.. కన్నబాబు ఏమాత్రం భయపడడు. ఇందాకటి నుంచి చూస్తున్నాను. సినిమా డైలాగులు చెప్పి తెగ రెచ్చిపోతున్నావేంటి అంటాడు. తన చేతిని పట్టుకొని వెనక్కి మలుస్తాడు. చెయ్యి వదలరా.. అంటుంది.
కన్నబాబు వదలడు. ఇలాంటి డైలాగులు మళ్లీ చెప్పావనుకో.. నీ చేయి విరిగిపోతుంది అని బెదిరిస్తాడు కన్నబాబు. ఇంతలో జానకి అక్కడికి వస్తుంది. అక్కడే ఉన్న కొబ్బరిమట్టతో కన్నబాబు తల మీద ఒక్కటిస్తుంది. దీంతో కన్నబాబు మల్లిక చేయి వదిలిపెడతాడు.
ఏయ్ కన్నబాబు. నువ్వు మనిషివా. ఆడపిల్లల మీద చేయి చేసుకోవడం ఏంట్రా. ఇదేనా నీకు మీ అమ్మ నేర్పించిన సంస్కారం. మల్లిక.. అసలు ఏమైంది అని అడుగుతుంది. ఏంటి గొడవ అంటుంది. వెన్నెల ఏంటి ప్రాబ్లమ్. చెప్పు పర్వాలేదు నేను ఉన్నానుగా అంటుంది. దీంతో విషయం అంతా చెబుతుంది.
రేయ్.. ఆడపిల్లలను బ్లాక్ మెయిల్ చేస్తావా? నా మరదలినే బ్లాక్ మెయిల్ చేస్తావా? ఫోన్ ఇవ్వరా.. అని చెప్పి కన్నబాబు ఫోన్ తీసుకొని ఆ ఫోన్ లో ఉన్న వీడియోను డిలీట్ చేస్తుంది. కార్పొరేటర్ కొడుకునని ఏం చేసినా ఎదురు లేదని అనుకుంటున్నావేమో. తాట తీస్తా. ఇంకోసారి నా మరదలు జోలికి వస్తే జైలులో చిప్పకూడు తినిపిస్తా అని వార్నింగ్ ఇస్తుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.