Janaki Kalaganaledu 3 Mar Today Episode : మల్లిక ప్లాన్ రివర్స్.. జానకి, రామా గురించి చెప్పినా నమ్మని జ్ఞానాంబ.. ఇంతలో జానకికి మరో షాక్

Janaki Kalaganaledu 3 Mar Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 249 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎలాగోలా జానకి.. ఎందుకు పెళ్లికి వెళ్లలేదో చెప్పి ఆ గండం నుంచి బయటపడేలా చేస్తాడు రామా. అబ్బబ్బ.. బావ గారు మీరు సూపర్ అండి. మీ అంత బాగా కథలు అల్లలేరేమో అంటుంది మోనిత. ఇప్పటికిప్పుడు ఈ కథ అల్లారా.. లేక ఇంతకుముందే అనుకొని వచ్చారా అని అడుగుతుంది మల్లిక. కట్టుకథలు కాకపోతే ఇంకేంటి.. ఆ మెట్టల కోసం మీరు వెళ్లొచ్చు కదా.. జానకిని ఎందుకు పంపించావు అని అడుగుతుంది మల్లిక. దీంతో మెట్టల గురించి ఆడవాళ్లకే ఎక్కువగా తెలుస్తుంది అని అంటాడు రామా. దీంతో నాకు తెలుసు.. నా పెద్ద కొడుకు అబద్ధాలు చెప్పడు అంటుంది జ్ఞానాంబ. రామా.. మెట్టలు తేవడానికి జానకితో పాటు నువ్వు కూడా వెళ్లాల్సింది కదా. నువ్వు ఎందుకు వెళ్లలేదు అని అడుగుతుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 3 march 2022 full episode

పెళ్లిలో తెలిసిన వాళ్లు కనబడితే మాట్లాడుతూ ఉన్నాను అమ్మ. అందుకే జానకి గారు ఒక్కరే మెట్టల కోసం వెళ్లారు అంటాడు రామా. ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా. ఆడపిల్లను ఒక్కదాన్నే రాత్రిపూట బయటికి పంపించడం ఏంటి. అది అంత మంచి పద్ధతి కాదు అని ఆమాత్రం కూడా తెలియదా నీకు అని అడుగుతుంది జ్ఞానాంబ. నువ్వు ఏ పని కోసం బయటికి వెళ్లాలన్నా రామాను తోడుగా తీసుకెళ్లు అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే అంటుంది జానకి. ఇంత అత్యాద్భుతమైన విషయం చెప్పిన మన చిన్నకోడలుకు ఏం బహుమతి ఇద్దాం.. అంటాడు గోవిందరాజు. మరి.. నీకెందుకమ్మా ఈ కుల్లుబుద్ధులు. నిజమేంటో తెలుసుకోకుండా.. ఇంకోసారి ఈ తిక్క తిక్క వేషాలు వేశావనుకో.. అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది జ్ఞానాంబ.

కట్ చేస్తే బాధగా ఉంది రామా గారు. ఒకరకంగా నేను దోషిగా మారుతున్నాను అనిపిస్తోంది అంటుంది జానకి. మీ అమ్మగారు ఇందాక ఒక మాట అన్నారు గుర్తుందా. నా కొడుకు ఏనాడూ అబద్ధం చెప్పడు అని. నాకోసమే మీరు ఇలా అబద్ధాన్ని చెప్పాల్సి వచ్చింది అంటుంది జానకి.

కావాలని అబద్ధం చెబితే అది మోసం అవుతుంది. కానీ.. మంచి పని కోసం మరో దారి లేక అబద్ధం చెప్పడం అది తప్పు ఎలా అవతుందండి అంటాడు రామా. విజయం ఊరికే రాదండి. కష్టాలను, నష్టాలను అన్నింటినీ దాటుకొని రావాలి. అదే విజయం అంటే.. అంటాడు రామా.

ఆ సంతోషం ముందు.. ఇప్పుడు మనం పడుతున్న కష్టాలన్నీ కనిపించవు జానకి గారు అంటాడు రామా. ప్రతి ఆడపిల్ల మీలాంటి భర్త రావాలని కోరుకుంటుంది కానీ.. నేను మాత్రం కోరుకోకుండానే నాకు దేవుడు మిమ్మల్ని భర్తగా ఇచ్చాడు. నాకు ఇంతకంటే ఇంకేం కావాలి రామా గారు అంటుంది జానకి.

Janaki Kalaganaledu 3 Mar Today Episode : జానకి, రామా గోడ దూకి వెళ్లడం చూసి మల్లిక షాక్

సాయంత్రం 7 గంటలకు క్లాస్ కు వెళ్లడం అంటే కష్టంగా ఉంది అంటుంది జానకి. ఏం కాదు పదండి.. రండి అంటాడు రామా. మరోవైపు రామా, జానకి ఏం చేస్తున్నారో చూడటం కోసం వాళ్ల రూమ్ దగ్గరికి వెళ్తుంది మల్లిక. కానీ.. రూమ్ లో వాళ్లు ఉండరు. దీంతో అమ్మో.. అనుకుంటుంది.

వామ్మో.. వీళ్లు ఇంట్లో లేరు. నిన్నేమో పెళ్లి వంకతో ఎక్కడికో వెళ్లారు. అసలు ఎక్కడికి వెళ్లినట్టు. ఎలాగైనా వీళ్ల బండారం బయటపెట్టాలి అనుకుంటుంది. జానకి గారు మెల్లగా రండి అంటాడు. గోడ దగ్గరికి తీసుకెళ్లి.. నా చేతుల మీద కాళ్లు పెట్టి మెల్లగా పైకి ఎక్కండి అంటాడు.

దీంతో వద్దు అంటుంది జానకి. రామా మాత్రం ఏం కాదు అంటాడు. జానకి గారు ఎక్కండి అంటాడు. చూస్తుంటే రేపు ఐపీఎస్ అయ్యాక ఇచ్చే ట్రేయినింగ్ ను ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్టుంది రామా గారు అంటుంది జానకి. జానకి రామా చేతుల మీద కాళ్లు పెట్టి గోడ ఎక్కడం మల్లిక చూస్తుంది.

ఇద్దరూ గోడ దూకి అక్కడి నుంచి కోచింగ్ కోసం బయలు దేరుతారు. దీంతో వాళ్లు ఎక్కడికి వెళ్లారో గోడ దూకి ఈ విషయాన్ని వెంటనే పోలేరమ్మకు చెబుతా అనుకొని విష్ణును తీసుకొచ్చి మీరు చేతులు పెడితే నేను కాలు పెట్టి గోడ దూకుతా అంటుంది మల్లిక.

దీంతో నీకేం పనిలేదా అంటాడు విష్ణు. ముందు మీరు కూర్చోండి అంటుంది. అతడి మీదికి ఎక్కబోయి కింద పడుతుంది. నా నడుము విరిగిపోయింది అంటుది మల్లిక. ముందు నన్ను లేపండి అంటుంది మల్లిక. నేను ఇప్పుడు చేసిన సాహస కార్యం వెనుక లోక కార్యం ఉంది.. అంటుంది.

వెంటనే జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి ఇద్దరూ గోడ దూకి దొంగచాటుగా ఎక్కడికో వెళ్లారు అని జ్ఞానాంబకు చెబుతుంది మల్లిక. నీకు మతిపోయిందా. గోడ దూకి ఎందుకు వెళ్తారు అని సీరియస్ అవుతుంది జ్ఞానాంబ. నేను చెప్పేది మీరు నమ్మరు అని తెలుసు.

బావ గారు, జానకి ఇద్దరూ గదిలో ఉన్నారో చూడండి. అప్పుడు మీకు నేను చెప్పేది అర్థం అవుతుంది అంటుంది మల్లిక. దీంతో మంచం మీద ఇద్దరూ దుప్పటి కప్పుకొని పడుకున్నట్టు కనిపిస్తుంది. దీంతో షాక్ అవుతుంది మల్లిక. అక్కడ దిండులు పెట్టారు అత్తయ్య గారు. బావ, జానకి లేరు అక్కడ అంటుంది మల్లిక.

వాళ్లు గోడ దూకి పారిపోవడం నేను చూశాను అంటుంది. కానీ.. జ్ఞానాంబ నమ్మదు. విష్ణు.. ముందు మల్లికను ఇక్కడి నుంచి తీసుకెళ్లు అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

14 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

15 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

15 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

17 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

18 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

19 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

20 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

20 hours ago