Janaki Kalaganaledu 3 May Today Episode : అందరి ముందు రామా పరువు తీసిన యోగి.. దీంతో జానకి షాకింగ్ నిర్ణయం.. రామా, జానకికి విడాకులు ఇప్పించేందుకు యోగి ఏం చేస్తాడు?

Janaki Kalaganaledu 3 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 మే 2022, మంగళవారం ఎపిసోడ్ 292 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రుక్మిణి ఫంక్షన్ అయిపోయాక వెళ్లేటప్పుడు తనను పిలిచి ధన్యవాదాలు తెలుపుతుంది జానకి. నీకు ఇలాంటి విషయాలు పెద్దగా పరిష్కరించేలేనివి కావు. నువ్వు ఎప్పుడూ  సంతోషంగా ఉండాలి. చల్లగా ఉండాలి. అదే ఒక ఫ్రెండ్ గా నేను కోరుకునేది అంటుంది రుక్మిణి. అలాగే నువ్వు త్వరలో ఐపీఎస్ అవ్వాలి. నా ఫ్రెండ్ ఐపీఎస్ అయిందని మేమంతా చెప్పుకోవాలి. సరేనా వెళ్లి వస్తా అని చెప్పి రుక్మిణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

janaki kalaganaledu 3 may 2022 full episode

ఆ తర్వాత యోగి.. లాయర్ తో మాట్లాడుతుండటం వింటుంది మల్లిక. ఇదివరకు మీ చెల్లెలుతో మీ బావ గారికి విడాకులు ఇప్పించాలనుకున్నావు కదా.. మళ్లీ ఇక ఫోన్ కూడా చేయలేదు అని అడుగుతాడు లాయర్. దీంతో అప్పుడు అనుకున్నా కానీ.. ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే.. జ్ఞానాంబ గారు మా చెల్లెలును ఇంట్లోకి రానిచ్చారు అంటాడు. కానీ.. కావాలని యోగికి, రామాకు గొడవ పెట్టించాలని వెంటనే రామా దగ్గరికి వెళ్లి ఆ యోగి మనతో ఆడుకుంటున్నాడు బావ గారు అంటుంది. సీతారాముల్లాంటి మిమ్మల్ని, జానకిని విడదీసే కుట్ర జరుగుతోంది అంటుంది మల్లిక. మీ గుండె పగిలిపోయే బాధ అయినా సరే.. భరించలేని నిజం అది అంటుంది.

కావాలంటే ఒకసారి చూడండి అంటుంది. ముత్తైదువులు రావాల్సిన ఈ బారసాల ఫంక్షన్ కు ఆ లాయర్ ఎందుకు వచ్చాడో తెలుసా? అంటుంది. బావ గారు మీకు జానకికి విడాకులు ఇప్పించడం గురించి వాళ్లు మాట్లాడుకుంటుంటే నేను నా కళ్లారా విన్నాను అంటుంది మల్లిక.

ఇంకా రెండు మూడు యోగి గురించి ఎక్కించి చెబుతుంది మల్లిక. దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే కోపంతో యోగి దగ్గరికి వెళ్తాడు రామా. ఇంతలో లాయర్ వెళ్తా అని యోగికి చెబుతాడు. భోం చేసి వెళ్లు అంటాడు. అర్జెంట్ గా కోర్టుకు వెళ్లాలి అంటాడు. జానకి ఒక్క సంతకం పెడితే చాలు అన్నీ నేను చూసుకుంటాను అంటాడు.

ఇంతలో రామా వచ్చి ఏంటి నువ్వు చూసుకునేది అంటాడు. జానకికి, నాకు విడాకులు ఇప్పించాలని నువ్వు లాయర్ ను కలిశావా అని అడుగుతాడు. దీంతో కలిశాను అంటాడు. మరి ఇక ఆలస్యం ఎందుకు విడాకులు ఇప్పించేయ్ అంటాడు రామా.

ఏమనుకుంటున్నావు అసలు నువ్వు అంటాడు రామా. నన్ను జానకి గారిని విడగొట్టాలని లాయర్ ను కలవడమే తప్పు అంటాడు. అప్పుడు చేసిన ఆలోచన అది. ఇప్పుడు మిమ్మల్ని మీ అమ్మ ఇంట్లోకి రానిచ్చారు కదా అంటాడు యోగి. అంటే.. మా అమ్మ ఇంట్లోకి రానివ్వకుంటే ఖచ్చితంగా విడాకుల నోటీసు పంపించి ఉండేవాడివా కాదా అని అడుగుతాడు రామా.

బంగారం లాంటి చెల్లెలు కాపురాన్ని మూడు ముక్కలు అయ్యేలా చేశావు నువ్వు అసలు మనిషివేనా అంటాడు. దీంతో కాస్త మాటలను అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది అంటాడు. నీకేంట్రా మర్యాద ఇచ్చేది అంటాడు రామా. దీంతో యోగి.. రామాపై సీరియస్ అవుతాడు.

ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే.. నువ్వు అలాంటి ఆలోచన చేయకూడదు అంటాడు. ఏంటి.. పదే పదే తప్పు అని మాట్లాడుతున్నావు. నీకు నా చెల్లెలుకు విడాకులు ఇప్పించాలని లాయర్ ను కలిశాను అయితే ఏంటి అంటాడు యోగి. ఆ విషయం అందరూ వింటారు.

Janaki Kalaganaledu 3 May Today Episode : అప్పుడే కాదు… ఇప్పుడు కూడా విడాకుల గురించే ఆలోచిస్తున్నా అని రామాకు షాకిచ్చిన యోగి

అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నాను. అయితే ఏంటి అంటాడు యోగి. నా చెల్లెలు డిగ్రీ చదివింది కానీ.. నువ్వు ఆరో తరగతి కూడా పాస్ అవ్వలేదు అంటాడు యోగి. సరిగ్గా ఒక సంవత్సరం ఓపిక పడితే నా చెల్లెలు ఐపీఎస్ అవుద్ది. నువ్వు స్వీట్లు తయారు చేసుకొని అమ్ముకునే స్థాయి నుంచి దాటగలవా అంటాడు.

నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక  వంట మాస్టర్ వి. నా చెల్లెలుకు నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటాడు యోగి. నేను తప్పు చేసింది మీ విడాకుల కోసం లాయరు ను కలవడం కాదు.. చదువు సంధ్య లేని నీకు నా చెల్లెలును ఇవ్వడం అంటాడు.

అన్నయ్య ఇక ఆపుతావా అని జానకి అంటుంది. దీంతో నువ్వు ఆగు జాను అంటాడు. చూస్తూ చూస్తూ వంటలు చేసుకునేవాడికి ఎవరైనా డిగ్రీ చదివే అమ్మాయిని ఇస్తారా అంటాడు. జానకిని ఇవ్వకపోయి ఉంటే.. ఒక్క అమ్మాయి కూడా ఇతడిని చేసుకోవడానికి ముందుకు వచ్చి ఉండేది కాదు అంటాడు యోగి.

దీంతో జానకి.. యోగి చెంప చెళ్లుమనిపిస్తుంది. నా భర్తను ఇంకొక మాట అన్నావంటే చంపేస్తాను అంటుంది జానకి. ఇంతలో రామా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నువ్వెంత నీ స్థాయి ఎంత.. మా ఆయన్ను వేలెత్తి చూపించే అర్హత ఉందా నీకు అంటుంది జానకి.

ఆయన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏ జన్మలోనో రాసిపెట్టి ఉండాలి. ఆ అదృష్టం నాకు దక్కింది. మా ఆయనకు చదువు లేదా. చదువు లేకపోయినా సంస్కారం ఉంది. అందుకే నువ్వు ఇలా ఉన్నావు. లేదంటే నువ్వు చేసిన తప్పుకు ఆయన మరోలా నీకు సమాధానం చెప్పి ఉండేవారు.

చూస్తూ ఉండు. త్వరలోనే మా ఆయన్ను ఏ స్థాయిలో నిలబెడతానో చూస్తూ ఉండు. చదువుకొని అమెరికాలో ఉన్నానని పొగరుతో ఉన్నట్టున్నావు. నువ్వు మా ఆయన కాలి గూటికి కూడా సరిపోవు. నిన్ను తలదించుకునేలా చేస్తాను. అలా చేయకపోతే నేను రామచంద్ర భార్యను కూడా కాదు అని చెప్పి అక్కడి నుంచి జానకి వెళ్లిపోతుంది.

యోగి.. కార్యక్రమానికి వచ్చాను కాబట్టి నిన్ను వదిలి పెట్టి వెళ్తున్నాను. కానీ.. నువ్వు నా కొడుకును అన్న మాటలు మాత్రం జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. కట్ చేస్తే రాత్రి అవుతుంది. నన్ను క్షమించండి రామా గారు అని రామాతో అంటుంది జానకి.

Recent Posts

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

3 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

6 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

9 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

10 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

13 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

16 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago