janaki kalaganaledu 3 October 2022 full episode
Janaki Kalaganaledu 3 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 401 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియో కాల్ చేసి బుద్ధిగా చదువుకోండి అని అంటాడు రామా. దీంతో నేను చదువుతున్నాను కానీ.. మీరు లంచ్ బాక్స్ తీసుకెళ్లలేదు కదా. నేను తీసుకురానా అంటుంది. ఏం వద్దు.. మీరు చదువుకోండి.. అంటాడు రామా. సరే.. నాకు ఎగ్జామ్ కు చదువుకోవడానికి శక్తి కావాలి అంటుంది జానకి. దీంతో సరే అని తనకు ఒక ముద్దు ఇస్తాడు. ఆ తర్వాత ఫోన్ పెట్టేస్తుంది జానకి. ఇంతలో వెన్నెల వచ్చి వదిన నాకు రేపు ఈ పరీక్ష ఉంది. అస్సలు అర్థం కావడం లేదు. ఈ పరీక్షలో ఫెయిల్ అయితే అమ్మ అస్సలు ఊరుకోదు. నాకు ఇవన్నీ చెప్పవా అని అడుగుతుంది వెన్నెల. కానీ.. నాకు రేపు కూడా పరీక్ష ఉంది అని అంటుంది జానకి. దీంతో ప్లీజ్ వదిన అంటుంది వెన్నెల. దీంతో సరే అని అన్నీ తనకు ఎక్స్ ప్లేన్ చేస్తుంది జానకి.
janaki kalaganaledu 3 October 2022 full episode
మరోవైపు జ్ఞానాంబ అందరినీ పిలుస్తుంది. ఏమైంది జ్ఞానం అంటాడు గోవిందరాజు. దీంతో అందరూ జాగ్రత్తగా వినండి. రేపటి నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ 9 రోజులు నేను నిష్టగా ఉంటూ అమ్మవారిని నిత్యం దూపదీప నైవేద్యాలు సమర్పిస్తాను. నేనే కాదు దసరా పూర్తయ్యే వరకు అందరూ నిష్టగా ఉండాలి. కొత్తగా వచ్చిన వాళ్లు ఈ విషయం తెలుసుకొని అందుకు తగ్గట్టుగా ప్రవర్తించే మంచిది అని అంటుంది జ్ఞానాంబ. దీంతో జెస్సీకి నేను అర్థం అయ్యేట్టు చెబుతాను అత్తయ్య గారు అంటుంది మల్లిక. అమ్మ వారి పూజలు అయిపోయేంత వరకు దొంగ చాటుగా మాంసాహారాలు తింటే నేను వేసే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అంటుంది జ్ఞానాంబ.
అందరూ విన్నారు కదా. రేపటి నుంచి పొద్దున్నే స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో ఉండండి అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత పూజకు కావాల్సిన సామాన్లు తీసుకొచ్చి ఆ ఏర్పాట్లు నువ్వే చూడు అంటాడు గోవిందరాజు.
కట్ చేస్తే రాత్రంతా కూర్చొని చదువుకుంటుంది జానకి. రాత్రి 2.30 అవుతున్నా జానకి చదువుతూనే ఉంటుంది. దీంతో రామా లేచి జానకి గారు అంటాడు. ఇంకా చదువుతున్నారేంటి అని అడుగుతాడు.
దీంతో రేపు ఎగ్జామ్ ఉంది కదా రామా గారు. బాగా రాయాలంటే చదవాలి కదా అంటుంది జానకి. ఇక చాలు లేండి. ఆరోగ్యం పాడైపోతుంది.. రండి వచ్చి పడుకోండి అంటాడు. దీంతో ఇవాళ ఒక్క రోజు కష్టపడి చదివితే రేపు హాయిగా నిద్రపోవచ్చు అంటుంది జానకి.
అలాగే ఉదయం వరకు చదువుకుంటుంది జానకి. ఆ తర్వాత అందరూ రెడీ అయి దేవి దగ్గర పూజలు చేస్తుంటారు. పూజ పూర్తయ్యాక జానకి వెళ్లి పరీక్ష రాస్తుంది. జానకి కోసం బయట వెయిట్ చేస్తుంటాడు రామా. జానకి పరీక్షను కష్టపడి రాస్తుంటుంది.
పరీక్ష రాసి బయటికి వస్తుంది జానకి. రామా అక్కడే ఉండి పరీక్ష ఎలా రాశారు అని అడుగుతాడు రామా. దీంతో కాసేపు రామాను ఆటపట్టించాలని అనుకొని చెప్పడానికి ఏం లేదు అంటుంది జానకి. దీంతో పరీక్ష సరిగ్గా రాయలేదా అని అంటాడు రామా.
అందుకే నేను చెప్పాను. ఇంటి పనులు పక్కన పెట్టి చదువు మీద దృష్టి పెట్టండి అని చెప్పాను కదా అంటాడు రామా. ఇప్పుడెలా అంటాడు. ఎంత పని చేశారు జానకి గారు అంటాడు. అది కాదు రామా గారు అంటుంది జానకి.
మీరు పరీక్ష సరిగ్గా రాయలేదంటే అమ్మ కూడా బాధపడుతుంది అంటాడు రామా. వెళ్దామా రామా గారు అంటుంది జానకి. ఇంతలో తన కాలేజీ ప్రిన్సిపల్ వచ్చి అమ్మా జానకి నీకు ఈ ఎగ్జామ్ లో 10 కి 10 మార్కులు వచ్చాయి అని చెబుతుంది ప్రిన్సిపల్.
దీంతో రామా చాలా సంతోషిస్తాడు. జానకి.. నవరాత్రుల తర్వాత మెయిన్స్ ఉన్నాయి. అవి కూడా నువ్వు ఇలాగే రాసేస్తే ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయినట్టే అంటుంది ప్రిన్సిపల్. తర్వాత నన్నే ఆటపట్టిస్తావా అని జానకితో అంటాడు రామా. ద
తర్వాత ఇంటికి వెళ్తారు ఇద్దరూ. మరోవైపు జానకి పరీక్షల్లో ఫెయిల్ అవ్వాలి అని దేవికి మొక్కుతుంది జానకి. ఇదంతా గోవిందరాజు వింటాడు. ఇంతలో జానకి, రామా వస్తారు. చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.