Janaki Kalaganaledu 4 April Today Episode : జ్ఞానాంబ అరెస్ట్.. ఫిర్యాదు చేసిన యోగి.. ఈ విషయం తెలిసి జానకి ఏం చేస్తుంది? రామా యోగిని ఏం చేస్తాడు?

Janaki Kalaganaledu 4 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 271 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామా గురించే ఎక్కువ టెన్షన్ పడుతుంది జ్ఞానాంబ. మున్ముందు జానకి నీకు ఎన్ని కష్టాలు పెడుతుందో అని భయపడుతుంది జ్ఞానాంబ. మరోవైపు రాత్రి జానకి చదువుకుంటూ ఉంటుంది. రామా మాత్రం తననే చూస్తూ ఉంటాడు. జానకి గారు నేను ఇప్పుడే వస్తాను మీరు చదువుకోండి అంటాడు. ఎక్కడికి అంటే.. ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్తాడు. తన కోసం చాయ్ తయారు చేస్తుంటాడు. రామా.. అర్ధరాత్రి అయినా కూడా ఇంకా వంట వండుతూ ఉండటం చూసి షాక్ అవుతుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 4 april 2022 full episode

అర్ధరాత్రి కూడా వంటలు వండటం ఏంటి.. నిద్రపోకుండా. తను దొరసానిలా కూర్చొని నీతో అన్ని పనులు చేయిస్తోంది అని అనుకుంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత తనకు టీ చేసి తీసుకొచ్చి ఇస్తాడు రామా. కట్ చేస్తే తెల్లారుతుంది. రామా.. ఖర్ఖానాకు వెళ్లిపోతాడు. తన కోసం క్యారేజ్ తీసుకొస్తుంది జానకి. ఖార్ఖానా దగ్గర పెట్టి వెళ్తుంది. తను వెళ్లిపోయాక.. ఖార్ఖానాకు జ్ఞానాంబ వస్తుంది. మా అబ్బాయి కోసం భోజనం తీసుకొచ్చాను అంటుంది దొరబాబుతో. దీంతో ఇప్పుడే వాళ్ల భార్య తీసుకొచ్చి ఇచ్చింది అంటాడు. దీంతో తన క్యారేజీ పక్కన పెట్టి నా క్యారేజీ ఇవ్వండి. కానీ.. ఇది నేను తీసుకొచ్చానని చెప్పకు అంటుంది.

దీంతో సరే అంటాడు దొరబాబు. మధ్యాహ్నం కాగానే క్యారేజీ తీసుకొని అన్నం తినడం ప్రారంభిస్తాడు. అచ్చం తన అమ్మ వండినట్టుగానే ఉండటంతో షాక్ అవుతాడు రామా. ఇంతలో జానకికి ఫోన్ చేస్తాడు. అమృతంలా ఉంది వంట అంటాడు రామా.

ఈరోజు మీరు వంట చేయలేదు.. మా అమ్మ చేసినట్టుగా ఉంది అంటాడు రామా. ఇదంతా పక్కనే ఉండి చూస్తుంటుంది జ్ఞానాంబ. ఈ వంట అచ్చం మా అమ్మ చేసినట్టుగానే ఉంది అంటాడు రామా. ఒక్క ముద్ద నోట్లో అలా పెట్టుకున్నానో లేదో.. నా కళ్ల ముందు మా అమ్మ కనిపించింది అంటాడు.

మా అమ్మే తన చేతులతో తినిపించినంత సంబురంగా ఉంది అంటాడు రామా. మనసు, పొట్ట ఆనందంతో నిండిపోయాయి అంటాడు రామా. ఈరోజు భోజనం మాత్రం అదిరిపోయింది. అచ్చం మా అమ్మలా.. మా అమ్మను గుర్తు చేసేలా వంట చేశారు అంటాడు రామా.

Janaki Kalaganaledu 4 April Today Episode :  నాకు విడాకులు ఇచ్చేయ్ అని రామాతో అన్న జానకి

అసలు.. ఇలా ఎలా చేశారని ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది అంటాడు రామా. పోనీ లెండి.. మీకు నచ్చింది కదా.. కడుపు నిండా తినండి అని చెబుతుంది జానకి. కట్ చేస్తే రాత్రి అవుతుంది. వర్షం జోరుగా కురుస్తుంటుంది. దీంతో వాళ్లు వేసుకున్న గుడిసె మొత్తం తడుస్తుంది.

ఏం చేయాలో అర్థం కాదు ఇద్దరికీ. గుడిసె మొత్తం కురుస్తుండటంతో రాత్రి నిద్రపోలేకపోతారు. నా మీద నీకు కోపం లేదా అని అడుగుతాడు రామా. నన్ను కట్టుకోవడం వల్లే మీరు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తోందని మీ మనసులో ఏదో ఒక మూలన నా మీద కోపం లేదా అంటాడు రామా.

మీరు వేరే ఎవ్వరినైనా పెళ్లి చేసుకొని ఉంటే మహారాణిలా ఉండేవారు కదా అంటే.. అవును రామా గారు.. చాలా కరెక్ట్ గా చెప్పారు. అయినా ఇప్పుడు మాత్రం మునిగిపోయింది ఏముంది. జరిగిందేదో జరిగిపోయింది.. విడాకులు ఇచ్చేయండి అంటుంది జానకి.

నా జీవితాన్ని నాకు ఇష్టమైనట్టు మార్చుకొని బతికేస్తాను అంటుంది జానకి. నాకు ఎప్పుడు ఇస్తున్నారు విడాకులు. రేపు పొద్దున మనం లాయర్ దగ్గరికి వెళ్దామా అంటుంది. దీంతో రామా షాక్ అవుతాడు. మరి.. మీ మాటలకు నాకెంత బాధగా ఉంటుంది అది ఆలోచించారా మీరు అంటుంది జానకి.

రామా గారు.. పెళ్లయిన ఆడపిల్లకు కష్టం అంటే.. తినడానికి సరిగ్గా తిండి లేకపోవడమో.. ఇల్లు లేకపోవడమో కాదు.. భర్త మనసులో ప్రేమ లేకపోవడం.. అదే ఒక భార్యకు భరించలేని నరకం అంటే. నా భర్త.. తన ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు. తన ప్రేమ ముందు ఈ కష్టాలు కనిపిస్తాయా అంటుంది జానకి.

మరోవైపు యోగి.. ఇండియా తిరిగి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే.. ఊర్మిల నువ్వు వెళ్లు.. నేను వస్తాను అంటాడు యోగి. ఎక్కడికి అంటే.. జాను దగ్గరికి వెళ్లి వస్తాను అంటాడు యోగి. సరేనండి అంటుంది ఊర్మిల. తర్వాత యోగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. జ్ఞానాంబ మీద కంప్లయింట్ ఇస్తాడు.

పోలీసులు.. జ్ఞానాంబ ఇంటికి వచ్చి తనను అరెస్ట్ చేస్తున్నామంటారు. మీ పెద్ద కోడలు జానకిని వేధిస్తున్నారని.. హింసిస్తున్నారని మాకు ఫిర్యాదు అందింది అంటాడు పోలీస్. మిమ్మల్ని గృహ హింస చట్టం కింద అరెస్ట్ చేస్తున్నాం అంటాడు పోలీస్. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

4 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

5 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

6 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

7 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

8 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

9 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

10 hours ago

Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా… దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది…?

Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…

11 hours ago