Janaki Kalaganaledu 4 Feb Today Episode : కులదేవత మొక్కు కోసం బయలుదేరిన రామా, జానకి.. ఇంతలో వాళ్లకు భారీ షాక్

Janaki Kalaganaledu 4 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 ఫిబ్రవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 230 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కుల దేవతను పూజించడానికి వెళ్లాలని జ్ఞానాంబ‌.. జానకి, రామాకు చెబుతుంది. అక్కడే రాత్రి పడుకొని వంట వండి ముత్తైదువులకు పెట్టాలని చెబుతుంది. వాళ్లనే వెళ్లమనే సరికి.. మల్లికకు కోపం వస్తుంది. మరోవైపు కులదేవత కోసం ప్రసాదం వండేందుకు కిచెన్ కు వెళ్తుంది జ్ఞానాంబ‌. ఇంతలో జ్ఞానాంబ‌కు ఫోన్ వస్తుంది. హలో జ్ఞానాంబ‌ గారా అండి అడుగుతుంది ఆవిడ. అవునండి.. మీరెవరు అని అడుగుతుంది జ్ఞానాంబ‌. నా పేరు వెంకాయమ్మ అండి. మీ చిన్న కోడలు మల్లిక ఊరి నుంచి మాట్లాడుతున్నాను అండి అంటుంది.

janaki kalaganaledu 4 february 2022 full episode

మల్లిక నాయనమ్మకు సీరియస్ గా ఉందండి. మల్లికను కలవరిస్తోందండి. కాస్త తొందరగా పంపించండి అని అంటుంది. విష్ణు అని పిలుస్తుంది. వెంటనే మల్లికను తీసుకొని వెళ్లు అని విష్ణుకు చెబుతుంది. మరోవైపు రామా సపరేట్ గా బ్యాగ్ లో తన బట్టలు సర్దుకుంటాడు. బట్టలెందుకు వేరు బ్యాగ్ లో పెడుతున్నారు. అడుగుతున్నది మిమ్మల్నే ఏం మాట్లాడరు ఏంటి అంటుంది జానకి. మనిద్దరి బట్టలు ఒకే బ్యాగులో పెట్టొచ్చు కదా. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు. నేను నా ఐపీఎస్ కలను వదిలేశాను అని చెప్పినా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అంటుంది. ఇంతలో జ్ఞానాంబ‌ వస్తుంది. జానకి అంటుంది. ఏమైంది. ఇద్దరూ అలా ఉన్నారు ఏంటి అంటుంది. ఇద్దరికి ఒక బ్యాగ్ సరిపోతుంది. రెండు బ్యాగులు ఎందుకు అంటుంది జ్ఞానాంబ‌.

దీంతో బట్టలు సరిపోవడం లేదు అంటాడు రామా. ఇది మన కుల దైవానికి నైవేద్యంగా సమర్పించాల్సిన ప్రసాదం. ఇది మన కుటుంబానికి తరతరాలుగా వస్తున్న ఆచారం అని చెబుతుంది జ్ఞానాంబ‌. చాలా సంప్రదాయంగా, నియమనిష్టలతో పూజ చేయాలి. ఈ ప్రసాదాన్ని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించకపోతే మీరు చేసిన పూజకు ఫలితం ఉండదు అంటుంది జ్ఞానాంబ‌.

Janaki Kalaganaledu 4 Feb Today Episode : తన నాయినమ్మకు బాలేదని జ్ఞానాంబ‌కు అబద్ధం చెప్పిన మల్లిక

సరే.. త్వరగా రండి అంటుంది. అయితే.. మల్లిక కావాలని ప్లాన్ వేయించి ఫోన్ చేయిస్తుంది. ఇదంతా నాటకం అని మా అమ్మకు తెలిస్తే నిన్ను పీస్ పీస్ చేస్తుంది అంటాడు విష్ణు. మరోవైపు మల్లిక నానమ్మ పిల్లలతో క్రికెట్ ఆడుతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

రామా జానకి కారులో వెళ్తుంటారు కానీ.. జానకితో రామా ఏం మాట్లాడడు. దీంతో జానకికి కోపం వస్తుంది. ఏంటి మీరు అస్సలు మాట్లాడటం లేదు అంటుంది జానకి. మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అంటుంది జానకి. దీంతో పాటలు పెట్టుకొని వింటూ ఉంటాడు రామా.

కట్ చేస్తే నీకు ఫోన్ వస్తోంది అమ్మా అని జ్ఞానాంబ‌కు ఫోన్ తెచ్చి ఇస్తుంది వెన్నెల. సుబ్బరాజు రామచంద్రాపురం నుంచి ఫోన్ చేస్తాడు. పెద్ద మనసుతో క్షమించి.. మీ అమ్మాయిని మా వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోండి అమ్మ అంటాడు సుబ్బరాజు. ఆరోజు పోలీస్ కేసు అయిందని తొందరపడి వద్దనుకున్నం అని చెబుతాడు.

మా వాళ్లు అందరూ వచ్చాక మా నిర్ణయం చెబుతా అంటుంది జ్ఞానాంబ‌. అతడు మాత్రం మమ్మల్ని క్షమించండి. మీరు అస్సలు కాదనకూడదు అంటాడు. సరే.. మీ ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాం అంటాడు ఆ వ్యక్తి. దీంతో వెన్నెలకు మళ్లీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది.

రామచంద్రాపురం సంబంధం వాళ్లు ఫోన్ చేశారు. ఎల్లుండి నిశ్చితార్థం అంటున్నారని మీ నాన్న గారికి చెప్పు అంటుంది జ్ఞానాంబ‌. దీంతో వెన్నెల షాక్ అవుతుంది. దీంతో ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

 

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

7 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

8 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

8 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

10 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

11 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

12 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

13 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

13 hours ago