Home » Entertainment » Janaki Kalaganaledu 4 January 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 4 Jan Today Episode : వెన్నెల పెళ్లికి ఏర్పాట్లు.. రామాకు వెన్నెల ప్రేమ గురించి చెప్పలేకపోయిన జానకి.. వెన్నెల ఏ నిర్ణయం తీసుకోబోతోంది?

Authored By
Varun G
The Telugu News | Published on: January 4, 2022, 2:00 pm
Advertisement

Janaki Kalaganaledu 4 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 జనవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 207 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కన్నబాబుకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి.. ఫోన్ లాక్కొని వెన్నెల వీడియోను డిలీట్ చేసి అక్కడి నుంచి మల్లిక, వెన్నెలను తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది జానకి. ఇంటికి వచ్చాక.. జానకి పర్ ఫార్మెన్స్ చూసి మల్లికకు చలి జ్వరం వస్తుంది. ముసుగేసుకొని తెగ ఏడ్చేస్తుంది. చికిత చూసి.. ఏంటండి.. మీరు ఇలా ముసుగు వేసుకొని కూర్చున్నారు.. అని అడుగుతుంది. తన వినయ విధేయతలు చూసి తను చాలా సాఫ్ట్ అనుకున్నా కానీ.. తను చాలా పవర్ ఫుల్ అని అంటుంది. అసలు ఏం జరిగింది చెప్పండి అని అడుగుతుంది. దీంతో సునంద కొడుకు కన్నబాబును జానకి కొట్టడంతో వాడు అక్కడ పడ్డాడు.. అంటుంది మల్లిక.

Advertisement

janaki kalaganaledu 4 january 2022 full episode

భయంతో నాకు పైప్రాణాలు పైనే పోయాయి అంటుంది. అంటే మీరు ఇన్ని రోజులు నిప్పుతో చెలగాటం ఆడారు అన్నమాట అని అంటుంది చికిత. జానకి స్వాతిముత్యంలో ఆడ కమలహాసన్ లా అంత అమాయకంగా ఉంటుంది కదా. తనకు అంత పవర్ ఎలా వచ్చింది. ఉదయమే లేచి ఏమైనా బాక్సింగ్ చేస్తుందా ఏంది అని అడుగుతుంది. నన్ను జాగ్రత్తగా మా రూమ్ దగ్గర వదిలిపెట్టవా అంటూ తన రూమ్ లోకి తీసుకెళ్లబోతూ తనతో పరాచకాలు ఆడుతుంది చికిత. కట్ చేస్తే.. జ్ఞానాంబ, గోవింద రాజు.. వెన్నెల పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్లడానికి రెడీ అవుతారు. పెళ్లి సంబంధం చూడటానికి వెళ్దాం పదా అని జ్ఞానాంబ.. జానకిని అడుగుతుంది. దీంతో సరే.. అత్తయ్య వెళ్దాం అంటుంది. రామా ఎక్కడ అని అడుగుతుంది. ఇప్పుడే బయటికి వెళ్లారు అత్తయ్య గారు అంటుంది. రామాకు కూడా ఈ విషయం చెప్పు అని అంటుంది జ్ఞానాంబ. అలాగే అత్తయ్య గారు అంటుంది జానకి. ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కాదు జానకికి.

Advertisement

కట్ చేస్తే.. ఉదయమే బాక్సింగ్ నేర్చుకుంటానని శపథ చేసి.. బస్తాలతో యుద్ధం చేస్తూ ఉంటుంది మల్లిక. ఇంతలో జ్ఞానాంబ.. మల్లిక అంటూ పిలుస్తుంది. ఈ ఇంట్లో నాకు నచ్చని ఒకే ఒక గొంతు.. అని అనుకుంటూనే అత్తయ్య గారు అత్తయ్య గారు అంటూ వస్తుంది. ఏం చేస్తున్నావే అంటే.. చపాతి పిండి పిసుకుతున్నాను అత్తయ్య గారు అంటుంది.

సరే గానీ.. వెన్నెల పెళ్లి సంబంధం మాట్లాడటానికి మేము రామచంద్రాపురం వెళ్తున్నాం. జానకి ఖార్ఖానాకు వెళ్తుంది. ఇంటిని నువ్వే చూసుకోవాలి అని అంటుంది. సరే అత్తయ్య గారు అంటుంది మల్లిక. జానకి వెన్నెల గురించే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎలాగైనా రామా గారికి ఈ విషయం చెప్పాలి అని అనుకుంటుంది. లేకపోతే.. వెన్నెల బాధను ఆపడం చాలా కష్టంగా మారుతుంది అని అనుకుంటుంది.

Advertisement

Janaki Kalaganaledu 4 Jan Today Episode : రామాకు వెన్నెల విషయం చెప్పడం కోసం తెగ ట్రై చేసిన జానకి

స్వీట్ కొట్టుకు వెళ్తుంది జానకి. పదండి.. అవార్డు ఫంక్షన్ కు బయలుదేరుదాం అంటాడు రామా. దీంతో రామా గారు మీకో విషయం చెప్పాలి. కొంచెం మాట్లాడాలి అంటుంది. వెన్నెల పెళ్లి గురించి నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది జానకి. ఈ విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడేది ఏముంది. మీరే అమ్మ వాళ్లు రామచంద్రాపురం వెళ్లారని చెప్పారు కదా అంటాడు రామా.

వెన్నెల మనసులో ఏముందో.. తన అభిప్రాయం కూడా ఒకసారి తెలుసుకుంటే మంచిది కదా అంటుంది జానకి. అవసరం లేదండి.. మా అమ్మకు ఏం చేయాలో తెలుసు అండి. మనం ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి ఉదాహరణ మనమే. మన పెళ్లే.. అంటాడు రామా.

దీంతో జానకి.. రామాకు అసలు విషయం చెప్పలేకపోతుంది. ఇద్దరూ కలిసి అవార్డు ఫంక్షన్ కు వెళ్తారు. మరోవైపు ఇంట్లో మల్లిక.. డ్రెస్ వేసుకొని మేకప్ వేసుకొని అందంగా రెడీ అవుతుంది. తనను చూసి చికిత షాక్ అవుతుంది. తన డ్రెస్ చూసి ఆశ్చర్యపోతుంది. గుర్తు పట్టదు. ఎవరండి మీరు అంటుంది. అయ్యో చికిత నేనే.. ఇంగ్లీష్ పిల్ల అనుకున్నావా అంటుంది మల్లిక.

మల్లికంబగారు మీరా.. అయ్య బాబోయ్ అంటూ ఆశ్చర్యపోతుంది చికిత. తన ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తుంది మల్లిక. అందరితో కలిసి సూపర్ డూపర్ ఎంజాయ్ చేస్తుంది మల్లిక. మరోవైపు జానకి గారు నాకు ఈరోజు రెండు సంతోషాలు అండి అంటాడు రామా. ఈరోజు మీరు బడిలో అవార్డు తీసుకుంటున్నారు. రెండు.. అమ్మానాన్నలకు అబద్ధం చెప్పకుండా రాజమండ్రి వెళ్తున్నాం అంటాడు రామా.

Advertisement

అమ్మానాన్నలు వెన్నెల పెళ్లి సంబంధం కోసం రాజమండ్రి వెళ్లారు కదా. అందుకే వాళ్లకు అబద్ధం చెప్పాల్సిన అవసరం రాలేదు అంటాడు రామా. కానీ.. అమ్మకు అబద్ధం చెప్పినప్పుడు నాలో ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది అంటాడు రామా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి