
janaki kalaganaledu 4 july 2022 full episode
Janaki Kalaganaledu 4 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 336 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అవేంటో చూద్దామని అఖిల్ పేపర్లను చూస్తుండగానే దీపిక అఖిల్ కు ఫోన్ చేస్తుంది. దీంతో ఇవన్నీ చిత్తు కాగితాలు అంటాడు అఖిల్. దీపిక పోన్ చేస్తోందని టెన్షన్ లో అలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అఖిల్. అత్తయ్య గారు ఇవి పనికిరాని కాగితాలు కాబట్టే అమ్మేస్తున్నాను. లేకపోతే నేను బుర్రతక్కువ దాన్నా అమ్మేయడానికి అంటుంది మల్లిక. దీంతో నీ బుర్ర గురించి ఎందుకులే అమ్మ అంటాడు ఆనంద రావు. ఆ పేపర్లు కొనేవాడు.. నాలుగు పేపర్లు తగ్గాయని రూపాయ తక్కువ ఇద్దామని అనుకున్నాడు. ఆ రూపాయి పోకూడదని ఈ పేపర్లు తీసుకొని వెళ్తున్నా అంటుంది మల్లిక. ఈ చిన్న కోడలు ఎప్పటికీ అత్తారింటి కోసమే పాటుపడుతుంది. ఏదో విధంగా చిన్నకోడలు గొప్పదనాన్ని గుర్తించండి అత్తయ్య గారు అంటుంది మల్లిక.
janaki kalaganaledu 4 july 2022 full episode
తర్వాత పేపర్లను తీసుకెళ్లి పేపర్లు కొనే వ్యక్తికి ఇస్తుంది మల్లిక. అవి వేయగానే.. తూకం సరిగ్గా తూగుతుంది. డబ్బులను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది మల్లిక. మరోవైపు స్నానం చేసి రెడీ అయి బయటికి వస్తుంది జానకి. టేబుల్ మీద తను పెట్టిన అసైన్ మెంట్ కనిపించకపోయేసరికి షాక్ అవుతుంది. ఎక్కడ పెట్టాను అని రూమ్ అంతా వెతుకుతుంది జానకి. కానీ.. అది కనిపించదు. పుస్తకాల్లో కూడా పేపర్ల కోసం వెతుకుతుంది. కానీ.. కనిపించవు. అసైన్ మెంట్ పేపర్స్ ఏమైపోయాయి.. లేకపోవడం ఏంటి అని అనుకుంటుంది జానకి. రూమ్ లో ఎక్కడా లేవు. మరి ఏమైపోయాయి అని ఆలోచిస్తుంది జానకి. బయటికెళ్తుంది. బయట కూడా అటూ ఇటూ చూస్తుంది కానీ.. ఎక్కడా కనిపించవు. ఇంతలో చికిత దగ్గరికి వెళ్లి నువ్వు మా రూమ్ ను ఏమైనా క్లీన్ చేశావా అని అడుగుతుంది. దీంతో లేదు జానకమ్మ గారు అంటుంది చికిత.
ఏమైంది.. ఎందుకలా టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది చికిత. దీంతో మా రూమ్ లో కొన్ని పేపర్స్ పెట్టాను.. అవి ఎవరు తీశారో అర్థం కావడం లేదు అంటుంది. దీంతో మల్లికమ్మ గారు ఇందాక పాత పేపర్లు అమ్మారు. వాటితో పాటు ఇవి కూడా వేసి ఉంటారు అంటుంది చికిత.
దీంతో జానకి షాక్ అవుతుంది. అవునా.. ఎంత సేపు అవుతోంది అని అడుగుతుంది. చాలాసేపు అవుతోంది. అతడు మన వీధి కూడా దాటిపోయి ఉండు అంటుంది చికిత. దీంతో అక్కడే కుర్చీలో కూలబడిపోతుంది జానకి. ఇంతలో మల్లిక అక్కడికి వచ్చి.. జానకిని చూస్తుంది.
హీరోయిన్ గారు ఏంటి.. ఇలా దీనంగా కూర్చొంది అని అనుకుంటుంది మల్లిక. కనుక్కుందాం అని మల్లిక.. జానకి దగ్గరికి వస్తుంది. ఏమైంది జానకి అని అడుగుతుంది. దీంతో నీకసలు బుద్ధి ఉందా మల్లిక. నా రూమ్ లో ఉన్న పేపర్స్ ను నువ్వెందుకు తీశావు అని అడుగుతుంది.
దీంతో పాత పేపర్లోడు రూపాయి తక్కువ ఇస్తానంటే.. నీ రూమ్ లో ఉన్న పేపర్లు వేశాను అంటుంది మల్లిక. బుద్ధి లేకుండా మాట్లాడకు. అసలు మా రూమ్ లోకి ఎందుకు వచ్చావు నువ్వు. ఆ పేపర్స్ ను ఎందుకు ముట్టుకున్నావు అని అంటుంది. ఇంతలో అక్కడికి జ్ఞానాంబ, గోవిందరాజు వస్తారు.
నా మీద అంత సీరియస్ అవుతున్నావు ఏంటి జానకి నువ్వు అని అడుగుతుంది మల్లిక. నువ్వు నా మీద అంత సీరియస్ అయ్యావు అంటే.. ఆ పేపర్లలో ఏదో సీరియస్ మ్యాటర్ ఉండే ఉంటుంది. చెప్పు ఏముంది ఆ పేపర్లలో అని అడుగుతుంది మల్లిక.
దీంతో జానకి ఏం చెప్పలేకపోతుంది. ఆ కాగితాలలో అంత ముఖ్యమైన విషయం ఏముంది. అత్తయ్య గారు అలా చూస్తూ ఉంటారేంటండి.. మీకు ఇద్దరు కోడళ్లు రెండు కళ్లు అని చెబుతుంటారు కదా.. మీ మొదటి కన్ను నన్ను కొట్టడానికి వచ్చింది అని అంటుంది.
జానకి.. కారణం లేకుండా నువ్వు ఎవ్వరినీ ఒక్క మాట కూడా అనవు. అలాంటి నువ్వు ఏదో ఒక ముఖ్యమైన విషయం ఉండబట్టే మల్లిక మీద కోప్పడ్డావని అర్థం అవుతోంది. ఆ కాగితాల్లో అంత ముఖ్యమైన విషయం ఏముంది అని అడుగుతుంది జ్ఞానాంబ.
దీంతో అమ్మా పుల్లల మల్లిక.. కాస్త నువ్వు పెట్రోల్ పోసే కార్యక్రమం ఆపు అంటాడు గోవిందరాజు. కానీ.. జానకి ఏం మాట్లాడదు. దీంతో చెప్పు జానకి అంటుంది జ్ఞానాంబ. స్వీట్ షాపు కోసం కవర్ చేయమని ఆయన ఆ పేపర్స్ తీసుకొచ్చి ఇచ్చారు అంటుంది జానకి.
దీంతో ఆహాహా.. అంటుంది మల్లిక. ఆ పేపర్లు కేవలం కవర్లు చేసే పేపర్లు అయితే పోతే పోయాయిలే అని అనుకోవచ్చు. అంత చిన్న విషయం కోసం నువ్వు నన్ను కొట్టడానికి వచ్చినంత పని చేస్తావా.. అత్తయ్య గారు లాజికే కదండి.. మీరు కూడా అడగండి అత్తయ్య గారు అంటుంది మల్లిక.
అవి ఎందుకూ పనికిరాని కాగితాలు అని అఖిల్ కూడా చెప్పాడు కదా. ఇంకా ఆ విషయం గురించి ఎందుకు రాద్ధాంతం. ముందు వెళ్లి భోజనం ఏర్పాట్లు చూడు. అఖిల్ కు, వెన్నెలకు బాక్సులు కట్టాలి అంటుంది జ్ఞానాంబ. దీంతో అబ్బా.. అమ్మా.. అంటూ మూలుగుతుంది మల్లిక.
ఏమైంది అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో ఇంకేముంటుంది కాళ్లు, చేతులు నొప్పి పుట్టి ఉంటాయి అంటాడు గోవిందరాజు. దీంతో జానకి ఆ వంట పనేదో నువ్వే చూడు అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే అత్తయ్య గారు అంటుంది జానకి. తను ఎప్పటికి తెలుసుకుంటుందో.. ఎప్పటికి మారుతుందో అని రూమ్ లోకి వచ్చిన గోవిందరాజు.. కూర్చోబోతూ అబ్బా అంటాడు.
నడుం ఒక్కసారిగా కలుక్కుమంటుంది గోవిందరాజుకు. ఏమైంది చెప్పండి.. అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో అదేం లేదు జ్ఞానం అంటాడు గోవిందరాజు. కూర్చునేటప్పుడు కాస్త కాలు పట్టేసినట్టు అనిపించింది అంటాడు గోవిందరాజు. నిజం చెప్పండి అంటుంది జ్ఞానాంబ.
ఇంతకుముందు కూడా ఇలాగే నడుం నొప్పి గురించి దాచారు.. అంటుంది జ్ఞానాంబ. ఈ విషయం గురించి కంగారు పడకు.. అని అంటాడు గోవిందరాజు. ఈ మధ్య కాలంలో ట్యాబ్లెట్లు వేసుకోకపోవడం వల్లే ఈ నొప్పి వస్తోందా అని అనుకుంటాడు గోవిందరాజు.
మరోవైపు వంట చేస్తూ అసైన్ మెంట్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది జానకి. ఏం చేయాలి ఇప్పుడు అని అనుకుంటుంది జానకి. దీంతో వంట వండుతూనే… మళ్లీ అసైన్ మెంట్ మొత్తం రాస్తుంది జానకి. ఆ తర్వాత రూమ్ లోకి వెళ్లి మిగితా అసైన్ మెంట్ మొత్తాన్ని మళ్లీ రాస్తుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.