Janaki Kalaganaledu 4 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 మార్చి 2022, శుక్రవారం ఎపిసోడ్ 250 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఎండలు, వానలు ఈ రామచంద్రను ఏం చేయలేవండి. మనం చాలా రఫ్ అండ్ టఫ్ అంటాడు రామా. దీంతో ఇప్పుడు వర్షం వస్తే.. మీరే ఎక్కువగా తడుస్తారు.. అంటుంది జానకి. అంతలోనే వర్షం స్టార్ట్ అవుతుంది. దీంతో బండి దిగి చెట్టు కిందకు వెళ్తారు ఇద్దరు. తను వర్షానికి తడుస్తుంటే… తన టవల్ ను ఇచ్చి కప్పుకోమంటాడు రామా. రామా కూడా వర్షంలో తడవడం చూసి టవల్ కిందికి రండి అని చెబుతుంది జానకి. దీంతో ఇద్దరూ ఒకే టవల్ కింద నిలబడతారు. ఇంతలో రామా చేయి.. జానకి చేయికి తగులుతుంది. దీంతో జానకికి ఏదోలా అవుతుంది.
రామా కూడా తన చేయిని గట్టిగా పట్టుకుంటాడు. తనకు కిస్ ఇవ్వబోతాడు కానీ.. అంతలో ఉరుముతుంది. దీంతో ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ముద్దు పెడతా అన్నట్టుగా రామా తల ఊపుతాడు. కానీ.. జానకి మాత్రం వద్దు అంటుంది. ఇంతలో వర్షం ఆగిపోతుంది. దీంతో ఇద్దరూ బండి మీద బయలుదేరుతారు. మరోవైపు బయటికి వెళ్లిన వీళ్లు ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటుంది మల్లిక. వాళ్లు ఎక్కడైతే గోడ దూకి పారిపోయారో. అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది మల్లిక. ఇంతలో వాళ్లిద్దరూ ఇంటికి తిరిగి వస్తుంటారు. బండి ఆపి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తారు ఇద్దరు. గోడ దగ్గరికి వచ్చి గోడ దూకేందుకు ప్రయత్నిస్తారు. ఈరోజు క్లాసులు బాగా జరిగాయి అన్నారు కదా. రేపటి నుంచి కూడా క్లాసులు ఇలాగే జరగాలి అంటాడు రామా.
దీంతో మీరు పక్కనుంటే నాకు ఎలాంటి సమస్య రాదు. నాకు ఏం కాదు అంటుంది జానకి. సరే.. సరే అని అనుకొని ఇద్దరూ గోడ దూకేందుకు ప్రయత్నిస్తుంటారు. గోడ దూకి ఇద్దరూ ఇంట్లోకి వస్తారు. అప్పుడే అక్కడ పడుకొని ఉన్న మల్లికను చూస్తారు. తను నిద్రపోవడంతో మెల్లగా అక్కడి నుంచి జారుకుంటారు.
ఏమండి.. మన మీద మల్లికకు అనుమానం వచ్చినట్టుంది. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకొని వెళ్లిపోతారు. ఇంతలో మల్లికకు మెళుకువ వస్తుంది. ఇంకా రారేంటి అని అనుకుంటుంది. కానీ.. తనకు విపరీతంగా దోమలు కుడుతుంటాయి.
అలాగే అనుకొని.. నిద్ర వచ్చి అక్కడే పడుకుంటుంది మల్లిక. కట్ చేస్తే ఉదయం అవుతుంది. మల్లికను చూసిన చికిత ఈవిడేంటి ఇక్కడున్నారు అని అనుకుంటుంది. మల్లికమ్మ గారు.. మల్లికమ్మ గారు అంటుంది. దీంతో దొరికిపోయారు.. పట్టేసుకున్నాను.. పట్టేసుకున్నాను అంటుంది మల్లిక.
చివరకు కళ్లు తెరిచి చూసి నువ్వా అంటుంది మల్లిక. తనకు తానే ఏదేదో మాట్లాడుతుంటే చికితకు అర్థం కాదు. మీరేమంటున్నారో.. ఎవరి గురించి అంటున్నారో ఒక్క ముక్క అర్థం కావడం లేదు అంటుంది చికిత. మరోవైపు జ్ఞానాంబ రూమ్ ను ఎవరో దబాదబామని కొడుతుంటారు.
జ్ఞానం.. ఇంతలా తలుపు కొడుతున్నారు.. ఏమైంది అని అనుకుంటాడు గోవిందరాజు. ఇంతలో జ్ఞానాంబ వెళ్లి డోర్ తీస్తుంది. చూస్తే.. హ్యాపీ 25 మ్యారేజ్ యానివర్సరీ అని ఇంగ్లీష్ లో రాసి ఉన్న అక్షరాలను పట్టుకొని కుటుంబ సభ్యులు అందరూ ఆశ్చర్యపరుస్తారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు అని అందరూ గట్టిగా చెబుతారు.
ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా సెలబ్రేట్ చేయలేదు. ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అని అడుగుతాడు గోవింద రాజు. దీంతో జానకి గారికి వచ్చింది ఈ ఆలోచన అంటాడు రామా. ఏది ఏమైనా మా పెద్ద కోడలు.. పెద్ద కోడలే.. శెభాష్ అంటాడు గోవిందరాజు.
అందరూ.. జానకిని పొగుడుతుంటే.. మల్లికకు అస్సలు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పటికే అత్త దృష్టిలో పెద్ద కోడలు గొప్పదనం ఎక్కడికో వెళ్లిపోయింది అని అనుకుంటుంది మల్లిక. అత్తయ్య గారు.. మామూలుగా అయితే ఏర్పాట్లన్నీ నేనే చేద్దామనుకున్నాను అంటుంది మల్లిక.
అందరూ నన్నే అంటారు అంటూ మల్లిక బాధపడటంతో.. మీరిద్దరూ నా కోడళ్లే. ఒకరు ఎక్కువ.. ఇంకొకరు తక్కువ కాదు. నీకు కొంచెం కుళ్లు బుద్ధి ఎక్కువ. అది తగ్గించుకోమని చెబుతాను. అది కొంచెం తగ్గించుకుంటే మంచిది అంటుంది జ్ఞానాంబ.
నాన్నా.. నువ్వు ఇప్పుడే ఇంత సిగ్గుపడుతున్నావంటే.. పెళ్లి చూపులప్పుడు ఇంకెంత సిగ్గుపడ్డారో అని అంటాడు రామా. అసలు.. మీ పెళ్లి చూపులప్పుడు ఏం జరిగిందో చెప్పాలి అంటాడు రామా. దీంతో పెళ్లి చూపుల సీన్ కళ్లకు కట్టినట్టు చెప్పడం కాదు.. చూపిస్తా అంటాడు గోవిందరాజు.
ఇద్దరూ అప్పటి క్యాస్టూమ్స్ లో రెడీ అయి పెళ్లి చూపుల సీన్ ను కళ్లకు కట్టినట్టు చూపిస్తారు గోవిందరాజు, జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.