
janaki kalaganaledu 5 april 2022 full episode
Janaki Kalaganaledu 5 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 ఏప్రిల్ 2022, మంగళవారం ఎపిసోడ్ 272 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి ఇంట్లో లేకపోవడం.. మల్లికకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎదుటివాళ్లు బాధపడే వాళ్లను చూసి సంతోషంగా పచ్చడి చేసుకొని తినే మనసు నాకు లేదమ్మా. ఆ పచ్చడేదో నువ్వే చేసుకొని తాగు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు గోవిందరాజు. ఇంట్లో మల్లిక హడావుడి మాత్రం అస్సలు తగ్గదు. అన్నయ్య, వదిన లేని ఇంట్లో పండుగ ఏంటి అని అంటాడు విష్ణు. దీంతో.. ఏవండి.. నా సంతోషాన్ని కనీసం మీతోనైనా పంచుకోనివ్వండి అంటుంది మల్లిక.
janaki kalaganaledu 5 april 2022 full episode
మరోవైపు జానకి.. రామాకు పొగపడుతూ ఉంటుంది. ఇంతలో తన కళ్లలో ఏదో పడుతుంది. జానకి గారు కంట్లో ఏదో పడింది అంటాడు. దీంతో తను కంట్లో ఊదుతుంది. పోయిందా అని అడుగుతుంది. దీంతో పోయింది అంటాడు రామా. వెళ్లి బట్టలు వేసుకోండి అంటుంది. దీంతో వేసుకోను అంటాడు రామా. మరోవైపు జ్ఞానాంబ ఉగాది పచ్చడి చేస్తుంటుంది. అందరూ అక్కడికి వస్తారు. జ్ఞానాంబ వచ్చి అందరికీ పచ్చడి పోస్తుంది. కానీ.. గోవిందరాజు వద్దంటాడు. ఓవైపు కొడుకు, కోడలు ఇద్దరూ మనతో కలిసి లేరు. ఈ టైమ్ లో మనం పండుగ ఎలా జరుపుకుంటాం అంటాడు గోవిందరాజు.
ఎవరో మన జీవితంలో నుంచి వెళ్లిపోయినంత మాత్రాన కాలం ఆగదు కదా అంటుంది జ్ఞానాంబ. మరోవైపు జానకి, రామా.. ఇద్దరూ గుడికి వెళ్దామనుకుంటారు. మనల్ని ఈరోజు తెలిసిన వాళ్లు భోజనానికి పిలుస్తారు. అంతకంటే ముందు మనం గుడికి వెళ్లి వాళ్ల పేరు మీద అర్చన చేయిద్దాం రండి అంటాడు రామా.
జ్ఞానాంబ పచ్చడి పోసి వెళ్లిపోయాక.. గోవిందరాజు పచ్చడి తీసుకెళ్లి రామా, జానకికి పోస్తాడు. ఆ తర్వాత మీరు గుడికి వెళ్లి మొక్కుకోండి. మీరు అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటాడు గోవిందరాజు. ఆ తర్వాత జానకి, రామా ఇద్దరూ గుడికి వెళ్తారు.
నా కొడుకు జీవితంలో ఏదైతే జరగకూడదని జాగ్రత్త పడ్డానో అది జరగకూడదు. తన నుంచి నా కొడుకును కాపాడుకుంటాను. అంతకంటే ముందు తన ఉద్దేశం ఏంటో తెలుసుకుంటాను అనుకుంటుంది జ్ఞానాంబ. మరోవైపు గుడికి వెళ్లి జానకి, రామా పూజ చేస్తారు.
మరోవైపు ఇండియాకు వచ్చిన యోగి.. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాడు. జ్ఞానాంబ మీద కేసు ఫైల్ చేస్తాడు. మరోవైపు రామా, జానకి గుడిసెలోకి వెళ్లి అక్కడ ఏం సామాన్లు ఉన్నాయో చూస్తుంది జ్ఞానాంబ. తన ఫోటోను చూసి షాక్ అవుతుంది.
మరోవైపు పోలీసులు జ్ఞానాంబ ఇంటికి కారులో బయలుదేరుతారు. నువ్వు ఎంత బాధ అనుభవిస్తున్నావో నాకు తెలుసు రామా అని అనుకుంటుంది జ్ఞానాంబ. మనకు ఈ పరిస్థితి రావడానికి కారణం నీ భార్య. నీకు బంగారం లాంటి కుటుంబం, ఇల్లు ఉంది. అయినా నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది అనుకుంటుంది జ్ఞానాంబ.
తన చదువుకున్న తెలివితేటలతో నిన్ను భవిష్యత్తులో ఏం చేస్తుందోనని భయం వేస్తోంది అని అనుకుంటుంది జ్ఞానాంబ. ఇంతలో పోలీసులు జ్ఞానాంబ ఇంటికి వచ్చి.. తనను అరెస్ట్ చేస్తున్నామని చెబుతారు. యోగి ఫిర్యాదు చేశాడని.. జానకిని మీరు కష్టాలు పెడుతున్నారని గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేస్తారు పోలీసులు.
దీంతో పోలీసులు తనను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటారు. ఎవ్వరు ఆపినా పోలీసులు ఆపరు. మరోవైపు అప్పుడే సైకిల్ మీద రామా వెళ్తుంటాడు. పోలీస్ జీపులో జ్ఞానాంబ వెళ్లడం చూసి షాక్ అవుతాడు. పోలీస్ జీపు వెంట సైకిల్ వేసుకొని పరిగెడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
This website uses cookies.