Janaki Kalaganaledu 5 Jan Today Episode : జానకి అరెస్ట్.. ఆగిపోయిన వెన్నెల పెళ్లి చూపులు.. జ్ఞానాంబ షాక్.. ఇంతలో మరో ట్విస్ట్

Janaki Kalaganaledu 5 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్  తాజాగా విడుదలైంది. ఈరోజు 5 జనవరి 2022, బుధవారం ఎపిసోడ్ 208 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ రామచంద్రాపురం వెళ్లి అబ్బాయిని చూసి వెంటనే జానకికి ఫోన్ చేస్తుంది. అబ్బాయి తమకు నచ్చాడని అమ్మాయిని చూసుకోవడానికి సాయంత్రం అబ్బాయి వాళ్లు మనింటికి వస్తున్నారని చెబుతుంది. దీంతో షాక్ అవుతుంది జానకి. నువ్వు వెంటనే ఇంటికి వెళ్లి అన్ని ఏర్పాట్లు చూసుకో అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో సరే అత్తయ్య గారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది అని అడుగుతాడు రామా. ఫోన్ చేసిన విషయం చెబుతుంది జానకి. అవునా.. అయితే వెంటనే అవార్డు తీసుకొని వచ్చేద్దాం అంటాడు రామా. వద్దండి.. లేట్ అవుతుంది. ముందు నన్ను ఇంటి దగ్గర దింపండి అని చెబుతుంది జానకి. దీంతో సరే.. అని రామా తీసుకెళ్తాడు.

janaki kalaganaledu 5 january 2022 full episode

కట్ చేస్తే సునంద ఇంటికి ఎస్ఐ వస్తాడు. అర్జెంట్ గా ఎందుకు రమ్మన్నారు అని అడుగుతాడు ఎస్ఐ. దీంతో ఆ జానకి నన్ను కొట్టింది. తనను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించాలి. ఇదిగో నా కంప్లయింట్ అంటాడు కన్నబాబు. ఇదిగో నీ గిఫ్ట్ అని ఇస్తుంది సునంద. తను నన్ను కొట్టి అవమానించింది. తనను ఊరి సెంటర్ నుంచి అందరి ముందు నడిపించుకుంటూ స్టేషన్ కు తీసుకెళ్లాలి.. అని చెబుతాడు కన్నబాబు. అది ఎంత పని అంటాడు ఎస్ఐ. జానకి అరెస్ట్ అవ్వాలి.. తన అత్త జ్ఞానాంబ పరువు పోవాలి. నాదగ్గరికి వచ్చి నా కళ్లు పట్టుకోవాలి.. అని అంటుంది సునంద. దీంతో ఒక గంటలో ఆ జానకి అరెస్ట్ అయిందన్న వార్త మీకు వినిపిస్తుంది.. అని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మరోవైపు మల్లిక తన ఫ్రెండ్స్ తో కలిసి ఇంట్లో సూపర్ ఎంజాయ్ చేస్తుంటుంది. అందరికీ కూల్ డ్రింక్స్ పోసి.. బోందీ, సమోసా ఇచ్చి తనే ఈ నెల చిట్టీ పాట పాడేసుకుంటుంది. 5 రూపాయల కూల్ డ్రింక్ పోసి.. రూపాయి కమిషన్ లేకుండా చిట్టీ పాడేసుకున్నావు కదా అంటారు తన ఫ్రెండ్స్.

Janaki Kalaganaledu 5 Jan Today Episode : ఫ్రెండ్స్ తో కలిసి మల్లిక సూపర్ ఎంజాయ్

ఆ తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు అందరూ. మల్లిక ఆవేశపడుతూ.. ఏదేదో మాట్లాడుతుంది. సినిమా డైలాగ్స్ అన్నీ చెబుతుంటుంది. చికితలో పోలేరమ్మను చూసుకొని.. చికితపై దాడి చేయబోతుంది మల్లిక. నేను శాంతించాలంటే ఈ పోలేరమ్మ డ్యాన్స్ చేయాలి అని అంటుంది మల్లిక.

దీంతో చికిత.. డ్యాన్స్ చేస్తుంది. జానవులే పాటకు డ్యాన్స్ చేస్తుంటుంది. నీ ఏజ్ ఏంటి.. నువ్వు చేసే డ్యాన్స్ ఏంటి. కొంచెం ముందుకురా.. అని చెప్పి ఊ అంటావా చికిత.. ఊఊ అంటావా చికిత పాటకు డ్యాన్స్ చేయమంటూ అడుగుతుంది మల్లిక.

దీంతో చికిత.. ఊ అంటావా పాటకు డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. తన డ్యాన్స్ కు అందరూ ఖుషీ అవుతారు. బాగుందని చికితను మెచ్చుకుంటారు. మరోవైపు జానకిని అవార్డు ఫంక్షన్ కు తీసుకెళ్లలేకపోయినందుకు రామా బాధపడతాడు. కట్ చేస్తే వెన్నెల పెళ్లి చూపులు జరుగుతుండగా.. అబ్బాయి వాళ్లు వచ్చిన సమయానికే జానకిని అరెస్ట్ చేస్తున్నాం అంటూ పోలీసులు వస్తారు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా… ఒకవేళ తింటే ఏం జరుగుతుంది…?

Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…

36 minutes ago

Business : కొత్తగా బిజినెస్ చేసేవారు ఈ బిజినెస్ చేస్తే కోటేశ్వర్లు కావొచ్చు

Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…

2 hours ago

Beetroot Leaves : బీట్రూట్ ఏ కాదు..బీట్రూట్ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే షాకే…?

Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…

3 hours ago

Vijayasai Reddy : మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి..?

Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…

4 hours ago

Black Coffee : బ్లాక్ కాఫీ ప్రియులు.. ఉదయాన్నే దీనిని తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు…?

Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…

5 hours ago

Shani vakri 2025 : శనీశ్వరుడు త్వరలో త్రిరోగమన దిశలో పయనిస్తున్నాడు… 138 రోజులు ఈ రాశుల వారికి కనక వర్షమే…?

Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…

6 hours ago

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత…

12 hours ago

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ…

14 hours ago