Home » Entertainment » Janaki Kalaganaledu 6 December 2021 Episode Highlights
Entertainment

Janaki Kalaganaledu 6 Dec Tomorrow Episode : మల్లిక ఖేల్ ఖతమ్.. మల్లిక చేసిన పనికి జానకి ఏం చేస్తుంది? జ్ఞానాంబకు అసలు విషయం చెబుతుందా?

Authored By
Varun G
The Telugu News | Updated on: December 5, 2021 11:48 am
Advertisement

Janaki Kalaganaledu 6 Dec Tomorrow Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ప్రతి శని, ఆదివారాల్లో ఈ సీరియల్ ప్రసారం కాదు. జానకి కలగనలేదు సోమవారం, 6 డిసెంబర్ 2021, సోమవారం 186 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ అరెస్ట్ కాకుండా.. జానకి పోలీసులకు పంచ్ ఇవ్వడంతో అందరూ సంతోషిస్తారు. ఇంటికి వచ్చాక.. జ్ఞానాంబ కూడా జానకిని తెగ మెచ్చుకుంటుంది. ఈరోజు నువ్వు లేకపోతే నేను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి ఉండేదాన్ని. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు అంటుంది జ్ఞానాంబ. దీంతో కూతురుకు తల్లి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అది నా బాధ్యత అంటుంది జానకి.

Advertisement

janaki kalaganaledu 6 december 2021 episode highlights

మరోవైపు అసలు పూతరేకులు ఎలా కల్తీ అయి ఉంటాయి అని జానకిని అడుగుతాడు రామా. పూతరేకుల్లో ఏదైనా కల్తీ జరిగి ఉంటుందేమో మనం చెక్ చేసుకోవాలి అంటాడు రామా. ఇంతలో మల్లిక అందుకొని.. ఒకవేళ నెయ్యిలో ఏదైనా కలిసిందేమో అంటాడు. అవును.. నాకు అదే డౌట్ గా ఉంది మల్లిక అంటుంది జానకి. దీంతో మల్లికకు భయం వేస్తుంది. అసలు.. ఏం జరిగిందో తెలుసుకుంటే భవిష్యత్తులో ఇటువంటిది మరోసారి జరగకుండా ఆపొచ్చు అని జానకి అంటుంది. దీంతో ఉదయమే ఖార్ఖానాలో పనిచేసే అందరినీ పిలిపిస్తుంది జ్ఞానాంబ. ఈ మధ్య ఖార్ఖానాలోకి ఎవరైనా వచ్చారా.. అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో ఎవరూ రాలేదమ్మా అంటారు పనివాళ్లు.

Advertisement

ఇంతలో మల్లిక మధ్యలో దూరి.. అదేంటి.. ఎవరూ రాలేదు అంటారు. జానకి వచ్చింది కదా. నెయ్యి ఇచ్చి వెళ్లింది కదా అని అడుగుతుంది. ఒకవేళ కావాలని జానకి.. నెయ్యిలో ఏదైనా కలిపిందేమో అని అనుమానంతో చెబుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. 15 రోజుల పరీక్ష పేరుతో అత్తయ్య గారు తనను హింసించారని అనుకొని జానకి.. కావాలని ఆ నెయ్యిలో ఏదైనా కలిపిందేమో అని అంటుంది మల్లిక.

మల్లిక జానకి మీద ఆరోపణలు చేయడంతో రామా సీరియస్ అవుతాడు. మల్లిక.. నీకు ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మాట్లాడకు.. అంటాడు. తన వ్యక్తిత్వం గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడటం ఏంటి అంటూ రామా.. మల్లికకు వార్నింగ్ ఇస్తాడు.

Advertisement

Janaki Kalaganaledu 6 Dec Tomorrow Episode : మల్లికకు షాక్ ఇచ్చిన జ్ఞానాంబ

అయితే.. జ్ఞానాంబ కూడా మల్లిక మాటలు నమ్మదు. అసలు నేరస్థులు ఎవరో త్వరలోనే తేలుతుందిలే మల్లిక అని చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే.. ఈ నేరం తన మీదికి ఎక్కడ వస్తుందేమోనని భయపడ్డ మల్లిక తన రూమ్ లో దాచిన మందు సీసాను తీసుకెళ్లి పేరట్లో పడేస్తుంది.

మల్లిక పేరట్లో మందు సీసాను పడేయడం చూసిన జానకి.. వెంటనే దాన్ని తీసుకొని మెడికల్ షాపు అతడికి ఫోన్ చేసి అడుగుతుంది. అది వాంతుల మందు అని చెబుతాడు. దీంతో అసలు విషయం తనకు అర్థం అవుతుంది. మల్లికే ఈ పని చేసిందని తెలుసుకున్న జానకి.. వెంటనే ఈ విషయాన్ని తన భర్త రామాకు చెబుతుంది.

రామా వెంటనే ఈ విషయాన్ని అమ్మకు చెబుదామంటాడు కానీ.. జానకి వద్దు అంటుంది. ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే సమస్య అవుతుంది వద్దు అని చెప్పి వారిస్తుంది. వెంటనే విష్ణును పిలిచి.. అసలు విషయం చెబుతుంది జానకి. దీంతో మల్లిక బదులు తనను క్షమించాలంటూ వేడుకుంటాడు విష్ణు.

ఆ తర్వాత జానకి తన రూమ్ లో వెళ్లి కూర్చొని పడుకుంటుంది. ఇంతలో రామా వస్తాడు. తను పడుకోవడం చూసి.. పోలీస్ క్యాప్ తెచ్చి తన తల మీద పెట్టి మురిసిపోతాడు. అచ్చం పోలీస్ ఆఫీసర్ లా ఉందని తెగ సంతోషపడతాడు. ఆ తర్వాత తనకు సెల్యూట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి