Janaki Kalaganaledu 6 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 జులై 2022, బుధవారం ఎపిసోడ్ 338 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గోవిందరాజుకు పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అని అంటాడు డాక్టర్. వెంటనే వేరే డాక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఇంతలో జానకి ట్యాబ్లెట్స్ తీసుకొని పరుగున ఇంటికి వస్తుంది. మామయ్య గారు అంటుంది. ఏంటి మామయ్య గారు ఇది.. ఏదో మామూలు ట్యాబ్లెట్స్ తీసుకురమ్మన్నారని నేను అనుకున్నా. మీకు నడుము నొప్పిగా ఉందని ట్యాబ్లెట్స్ కావాలని ఎందుకు చెప్పలేదు అని అంటుంది. తను తెచ్చిన ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ డాక్టర్ కు ఇచ్చి వెంటనే ఇంజెక్షన్ ఇవ్వండి డాక్టర్ గారు అని చెబుతుంది జానకి. దీంతో అలాగే అని చెప్పి ఆ డాక్టర్ గోవిందరాజుకు ఇంజెక్షన్ ఇస్తాడు. కానీ.. ఇవి ఎప్పుడో రాసిన ఇంజెక్షన్స్. ఇప్పటి ట్రీట్ మెంట్ కు అవి ఎలా ఉపయోగపడతాయో మాత్రం తెలియదు. అబ్జర్వేషన్ లో పెడదాం. మీరంతా బయటికి వెళ్లండి అని అంటాడు డాక్టర్.
నేను భయపడిపోతానేమో అని మీ నాన్న నడుం నొప్పి విషయాన్ని దాచాడు రామా. లేదంటే ఎప్పుడో ఆసుపత్రికి తీసుకెళ్లేవాళ్లం అని రామాతో అంటుంది జ్ఞానాంబ. నాన్నకు ఏం కాదు అంటాడు రామా. అసలు జానకి వెంటనే ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఉంటే మామయ్య గారికి ఇంత సీరియస్ అయి ఉండేదే కాదు అంటుంది మల్లిక. జానకి ట్యాబ్లెట్స్ తీసుకురావడం ఆలస్యం అవడం వల్లే మామయ్య గారికి ప్రాణం మీదికి వచ్చింది అయ్యో అంటూ అగ్గి రాజేస్తుంది మల్లిక. దీంతో జ్ఞానాంబ సీరియస్ గా చూస్తుంది. పోలేరమ్మలో మెల్లగా భద్రకాళి ఉగ్రరూపం మొదలైంది. జానకి మీద సునామిలా విరుచుకుపడుతుంది అని అనుకుంటుంది మల్లిక. అసలు 10 నిమిషాల్లో మెడికల్ షాపునకు వెళ్లి రావచ్చు. మరి జానకికి గంటలు గంటల సమయం ఎందుకు పట్టిందో అని అంటుంది మల్లిక.
ఆడుతూ పాడుతూ ఇంత ఆలస్యంగా వస్తుందా? ఏం జరుగుతుందో ఏంటో అని అంటుంది మల్లిక. దీంతో జ్ఞానాంబకు కోపం వస్తుంది. వెంటనే జానకి దగ్గరికి వెళ్తుంది జ్ఞానాంబ. కొట్లో ఉన్న మందులు కొనుక్కొని తీసుకురావడానికి నిజంగానే 10 నిమిషాల సమయం కూడా పట్టదు. కానీ.. నీకు ఇన్ని గంటల సమయం ఎందుకు పట్టింది అని అడుగుతుంది జ్ఞానాంబ.
దీంతో జానకి షాక్ అవుతుంది. ఓవైపు మీ మామయ్య గారి ఆరోగ్య పరిస్థితి ఏంటో నీకు తెలిసి కూడా నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నావు. మందులు కొనుక్కొని తీసుకురమ్మని మీ మామయ్య గారు నీకు చెప్పారు కదా. మరి ఎందుకు ఇంత అశ్రద్ధ చేశావు.. అని అడుగుతుంది జ్ఞానాంబ.
దాదాపు 3 గంటల తర్వాత ఇంటికి వచ్చిందంటే సినిమాకు ఏమైనా వెళ్లిందేమో అంటుంది మల్లిక. మామయ్య గారికి నడుం నొప్పిగా ఉందని.. అందుకోసమే ట్యాబ్లెట్స్ తీసుకురమ్మన్నారని నాకు తెలియదు. మామయ్య గారు కూడా నాకు చెప్పలేదు అంటుంది జానకి.
చెప్పలేదని.. ట్యాబ్లెట్స్ తీసుకొని మూడు రోజుల తర్వాత వస్తావా అని అంటుంది మల్లిక. నువ్వు కాస్త ఆగుతావా మల్లిక. మామయ్య గారు బీపీ ట్యాబ్లెట్స్ అని చెప్పారు. అప్పుడు మీరు కూడా ఉన్నారు కదా. మెడికల్ షాపు అతడు అవి నడుమునొప్పి ట్యాబ్లెట్స్ అని.. అందులో ఎమర్జెన్సీ ఇంజెక్షన్లు ఉన్నాయని అవి ఇంట్లో ఉండటం మంచిదని చెప్పాడు.
ఆ ఇంజెక్షన్లు ఇక్కడ లేవు. వాటి కోసం రాజమండ్రి వెళ్లాల్సి వచ్చింది. అందుకే లేట్ అయింది అంటుంది మల్లిక. దీంతో నువ్వు చాలా మంచి పని చేశావు అంటుంది జ్ఞానాంబ. గోవింద్ గారు ఇప్పుడు ఎలా ఉందండి అని అడుగుతాడు డాక్టర్. దీంతో ఇప్పుడు బాగుంది అని చెబుతాడు గోవిందరాజు.
దీంతో డాక్టర్ బయటికి వస్తాడు. టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఆయన క్షేమంగానే ఉన్నారు అంటాడు డాక్టర్. అమ్మా.. ఆ ఎమర్జెన్సీ ఇంజెక్షన్ తీసుకురావాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ.. నీ ముందు చూపే మీ మామయ్య గారిని కాపాడింది అంటాడు.
దీంతో జ్ఞానాంబ సంతోషిస్తుంది. అమ్మా జానకి కొన్నేళ్ల క్రితం మీ మామయ్య గారికి ఇలాగే నడుం నొప్పి వచ్చినప్పుడు కోలుకోవడానికి మరికొన్ని ఏళ్లు పట్టింది. ఒకవేళ మళ్లీ ఆ పరిస్థితే వచ్చి ఉంటే.. ఈ గుండె తట్టుకునేది కాదు. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటామమ్మా అంటుంది జ్ఞానాంబ. తర్వాత తనను దగ్గరికి తీసుకుంటుంది జ్ఞానాంబ. దీంతో మల్లికకు కోపం వస్తుంది.
మా నాన్న ఆరోగ్యాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు అని రామా.. జానకికి చెబుతాడు. మీరే కనుక లేకపోయి ఉంటే… ఈ పాటికి ఈ ఇల్లు కన్నీళ్లతో నిండిపోయి ఉండేది అని అంటాడు రామా. మా అమ్మ చిన్నప్పుడు మా నాన్నకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎంతలా ఏడ్చిందో నాకు తెలుసు అంటాడు రామా.
ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు. ఈ సంతోషంలో అంటూ తనను ఎత్తుకొని తిప్పుతాడు రామా. దీంతో నా కళ్లు తిరుగుతున్నాయి కిందికి దింపండి అంటుంది జానకి. ఏంటండి అంటుంది జానకి. తర్వాత ఒకరిని మరొకరు చూసుకుంటారు.
తర్వాత భార్యగా నేను నా ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించడం లేదు అంటుంది జానకి. దీంతో రామా షాక్ అవుతాడు. ఎంత సేపు మంచి కోడలు అని నిరుపించుకోవడానికి ఆలోచిస్తున్నాను కానీ.. నా భర్త మనసులోని ఇష్టాన్ని తెలుసుకొని అందుకు తగ్గట్టుగా నడుచుకోవడం లేదు అంటుంది.
పెళ్లయ్యాక.. మీకంటూ కొన్ని ఇష్టాలు సంతోషాలు ఉంటాయి. భార్యగా నేను మీకు వాటిని అందించాలి. అప్పుడే భార్య అనే పదానికి అర్థం ఉంటుంది అంటుంది జానకి. మీ చదువు కోసమే కదా మనం దూరంగా ఉన్నాం అని అంటాడు రామా. ఆ విషయం బయటి నుంచి జ్ఞానాంబ వింటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Waqf Amendment : పార్లమెంటులో శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ ఆస్తులు, మతపరమైన విషయాల…
Allu Ayaan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun మరి కొద్ది రోజులలో పుష్ప2 అనే సినిమాతో…
Nagababu : ఆంద్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రావడం మనం చూశాం. ఏపీతోపాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్…
Pawan Kalyan : మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం హిందువులపై జరుపుతున్న అకృత్యాలను అరికట్టాలని కోరిన మత…
Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుపతి జిల్లాలో నవంబర్ 26 నుంచి 28 వరకు భారీ…
Eknath Shinde : మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే తనను ముఖ్యమంత్రిని చేయకుంటే ఏక్‌నాథ్ షిండే రాష్ట్ర…
Keerthy Suresh Relationship : మహానటి కీర్తి సురేష పెళ్లి గురించి కొన్నాళ్లుగా నెట్టింట అనేక వార్తలు వస్తున్న విషయం…
Smartphone : డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు రోజువారీ జీవితంలో ఒక అనివార్య భాగంగా మారాయి. కమ్యూనికేషన్, వినోదం మరియు సమాచార…
This website uses cookies.