
janaki kalaganaledu 6 october 2022 full episode
Janaki Kalaganaledu 6 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు అక్టోబర్ 6, 2022 గురువారం ఎపిసోడ్ 404 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పిల్లలను తీసుకొచ్చి బొమ్మల కొలువు వేడుకలను జానకి ఘనంగా నిర్వహిస్తుంది. దీంతో జ్ఞానాంబ సంతోషిస్తుంది. మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది అని అనుకుంటుంది మల్లిక. ఆ తర్వాత దసరాకు బొమ్మల కొలువు ఎందుకు చేస్తారో అందరికీ చెబుతుంది జానకి. ఆ తర్వాత జానకి తీసుకొచ్చిన చిన్న అమ్మాయిని తన ఇంట్లో దిగబెట్టి వచ్చేందుకు వెళ్తాడు రామా. మరోవైపు మల్లికకు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఇంకో ప్లాన్ వేయాలా? ఎప్పుడూ నేను ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోంది అని అనుకుంటుంది.
janaki kalaganaledu 6 october 2022 full episode
కట్ చేస్తే రాత్రి అవుతుంది. నిండుకుండలో ఎన్ని నీళ్లు పోసినా నిలవనట్టు.. స్వాతిముత్యంలో కమల్ హాసన్ లా వెనక్కి తగ్గను. జానకి చదువుకు భంగం కలిగి ఎలాగోలా ఐపీఎస్ పరీక్ష పాస్ కాకుండా చేస్తాను. దానికోసం ఏం ప్లాన్ వేయాలి అని అనుకుంటుంది మల్లిక. వెంటనే తనకు ఒక ఐడియా వస్తుంది. బాబాయి గారు నేను మల్లికను అని పీటర్ కు ఫోన్ చేస్తుంది. జ్ఞానాంబ గారి రెండో కోడలును నేను అంటుంది. దీంతో ఎలా ఉన్నారు అమ్మ. బాగున్నారా అని అడుగుతాడు. మా జెస్సీ ఎలా ఉంది అంటాడు.
దీంతో అబద్ధం చెప్పి నేను మిమ్మల్ని సంతోష పెట్టలేను. ఎందుకంటే అది ఎక్కువ రోజులు దాగదు అంటుంది మల్లిక. జెస్సీ బాగుందా అని అడుగుతుంటే అదే చెప్పాలని మీకు ఫోన్ చేసిన నేను మీ కన్నప్రేమకు ఏం చెప్పలేకపోతున్నాను బాబాయి గారు అంటుంది మల్లిక.
మా జానకి మాటలను మీరు నమ్మారు. మా అత్తయ్య గారు చాలా గొప్పదని మీకూతురు ఇక్కడ సంతోషంగా ఉంటుందని భ్రమ పడి కాపురానికి పంపించారు. కానీ.. మీరు ఆశపడినట్టు ఇక్కడ ఏం జరగట్లేదు బాబాయి గారు.
పరువు కోసం పదిమందికి భయపడి జెస్సీని కోడలుగా తీసుకొచ్చింది జానకి కానీ.. మా అత్తయ్య గారు జెస్సీని చాలా చులకనగా చూస్తున్నారు. కనీసం కోడలుగా కూడా విలువ ఇవ్వడం లేదు. ఒక మనిషిగానూ విలువ ఇవ్వడం లేదు అంటుంది మల్లిక.
జరిగేదంతా సినిమా చూసినట్టు చూస్తున్నారు కానీ.. పాపం జెస్సీకి తోడుగా మాత్రం ఉండటం లేదు జానకి, బావ గారు అని అంటుంది మల్లిక. ఇంత మంది మధ్యన తను ఒక అనాథలా బతుకుతోంది.
తల్లికి భయపడి అఖిల్ కూడా ఏం మాట్లాడటం లేదు. పాపం.. జెస్సీ ఇక్కడ నరకవేదన అనుభవిస్తోంది. తన కన్నీళ్లు తప్ప తనకు ఎవ్వరూ తోడు లేరు బాబాయి గారు. మీ కూతురు బాధ చూడలేక నేను మీకు ఫోన్ చేసి చెబుతున్నాను.
దయచేసి నేనే ఇలా అన్నా అని ఎవ్వరికీ చెప్పకండి. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. మీ అమ్మాయి గురించి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మల్లిక. మల్లిక చెప్పిన విషయం.. తన భార్యకు చెబుతాడు పీటర్.
అసలు ఆ జ్ఞానాంబ గారు ఏమనుకుంటున్నారు. మనం ఇప్పుడే వెళ్లి ఆవిడను నిలదీయాల్సింది అంటాడు పీటర్. మరోవైపు తన పరీక్ష కోసం చదువుకుంటూ ఉంటుంది జానకి. ఇంతలో రామా తనకు టీ తీసుకొచ్చి ఇస్తాడు.
మీ ఏకాగ్రతను చదువు మీద మాత్రమే ఉంచండి అని చెబుతాడు రామా. ఉదయమే జానకి, రామా వ్యాయామం చేయడానికి పార్క్ కు వస్తారు. అప్పటికే అక్కడికి మల్లిక వచ్చి ఉండటం చూసి షాక్ అవుతారు.
నాకు దేవుడు తోటికోడలును ఇవ్వకుండా తోడేలులా పీక్కుతినే కోడలును ఇచ్చాడు అని అనుకొని వాళ్లు వెళ్లిన వైపు కాకుండా వేరే వైపునకు వెళ్తుంది మల్లిక. కానీ.. తాను పరిగెత్తడం చూసి జానకి, రామా షాక్ అవుతారు.
ఏమైంది మల్లిక నీకు. ఎందుకు పరుగెడుతున్నావు. వాకింగ్ చేయమంటే జాగింగ్ చేస్తున్నావెందుకు అంటుంది జానకి. ఆ తర్వాత జ్ఞానాంబ ఇంటికి పీటర్, ఆయన భార్య ఇద్దరూ వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
AP Pasu Bima Scheme 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుపోషణ అనేది వ్యవసాయం తర్వాత ప్రధాన జీవనాధారం. ముఖ్యంగా ఆవులు,…
Onions for Diabetes : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. మారుతున్న…
Pressure Cooker : ఇళ్లలో వంట పనిని సులభం చేసిన అద్భుతమైన పరికరం ప్రెషర్ కుక్కర్. తక్కువ సమయంలో వంట…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని…
ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్బాట్లను ఎక్కువ…
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
This website uses cookies.