
janaki kalaganaledu 7 december 2021 full episode
Janaki Kalaganaledu 7 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 డిసెంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 187 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ కలను నిజం చేయడం కోసమే ఈ పెన్ను పట్టుకున్నాను అంటాడు రామా. మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి నాకు చాలా సంతోషంగా ఉన్నా కూడా మన కుటుంబం సంతోషంగా ఉండాలంటే నా చదువు గురించి మరిచిపోక తప్పదు.. అంటుంది జానకి. మరిచిపోగలరు కానీ.. మీ మనసులో నుంచి ఆ బాధను తీసేయగలరా.. అంటాడు రామా. అంటే సమయం పట్టొచ్చు కానీ.. కష్టమేం కాదు అంటుంది జానకి. అత్తయ్య గారికి ఇచ్చిన మాట కంటే ప్రస్తుతం నాకు ఏదీ ముఖ్యం కాదు అంటుంది జానకి. మీరు మా అమ్మ గురించి ఆలోచిస్తున్నారు. నేను కళ్లారా చూసిన మీ నాన్న గారి బాధను చూస్తున్నాను. పడవ ప్రయాణంలో మీ నాన్న గారికి నాకు మహా అయితే 10 నుంచి 15 నిమిషాల ప్రయాణం అంతే. కానీ.. మీ నాన్న గారు మాట్లాడిన మాట మొత్తం మీ గురించే.. మీ కల గురించే.. అంటాడు రామా.
janaki kalaganaledu 7 december 2021 full episode
మీ నాన్న గారిలో ఎక్కువగా కనిపించింది అదే. మీ కలను నెరవేర్చకుండా వెళ్లిపోతున్నందుకు మీ నాన్న గారు పడిన బాధ చూసి ముక్కూ మొహం తెలియన నాకే ఎంతో బాధనిపించింది. అలాంటిది.. మీకు ఇంకెంత బాధ ఉంటుంది నాకు తెలియదా అని రామా అంటే.. నాకు బాధుంటుందని మా అత్తయ్య గారి ఇంటిని నేను కష్టపెట్టలేను అంటుంది జానకి. దీంతో నాకు కావాల్సింది నా భార్య సంతోషంగా ఉండటం. తను సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది. లేకపోతే నేను భర్తగా ఓడిపోయినట్టే.. అంటాడు రామా. రామా గారు నేను అత్తయ్య గారికి ఇచ్చిన మాటే నాకు ముఖ్యం అంటుంది జానకి. మీరు మీ అత్తయ్య గారి మాటకు ఎంత కట్టుబడి ఉన్నారో.. నేను కూడా నా భార్యను ఐపీఎస్ చేయడం కోసం నేను కూడా అంతే కట్టుబడి ఉన్నాను. మీరు ఐపీఎస్ చదవాలి.. పైనున్న మీ తల్లిదండ్రులు సంతోషించాలి. అప్పుడే నేను భర్తగా గెలిచినట్టు. ఇన్ని రోజులు ఇది ఆయన కల. ఇప్పటి నుంచి నా కల. వదిలేస్తారో.. లేదో అనేది మీ ఇష్టం అని చెప్పి రామా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
దీంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ పెన్నును పట్టుకొని ఏడుస్తుంది. కట్ చేస్తే.. తను అప్పులు తీసుకున్న వాళ్లు ఇప్పటి వరకు వడ్డీ కూడా ఇవ్వలేదని అనుకొని ఫోన్ చేద్దామని అనుకుంటుంది మల్లిక. ఇంతలోనే జ్ఞానాంబ వచ్చి జానకి అని పిలుస్తుంది. ఇంతలో తన చేతుల్లో ఉన్న ప్రామిసరీ నోటును తీసి అక్కడే ఉన్న పుస్తకాల్లో పెడుతుంది.
తను వెళ్లిపోయాక.. హమ్మయ్య అని అనుకొని.. పుస్తకాల్లో ఉన్న ప్రామిసరీ నోటును తీసుకుందామనుకునేసరికి.. పుస్తకాలు కనిపించవు. దీంతో షాక్ అవుతుంది మల్లిక. ఇంతలోనే ఎలా మాయం అయ్యాయి అని తెగ టెన్షన్ పడుతుంది మల్లిక.
ఇంతలో అక్కడికి చికిత వస్తుంది. పుస్తకాలు చూశావా అని చికితను అడుగుతుంది. అవి అఖిల్ బాబు పుస్తకాలు కదా అని చెబుతుంది చికిత. దీంతో అఖిల్ రూమ్ కు వెళ్లి ప్రామిసరీ నోటును తీసుకుంటుంది. అక్కడే తనకు గిటార్ కనిపిస్తుంది. ఈ గిటార్ ను అఖిల్ ఎలా కొన్నాడు.. పోలేరమ్మ డబ్బులు ఇవ్వలేదు కదా అని అనుకుంటుంది మల్లిక.
ఇంతలో అఖిల్ వస్తాడు. ఎలా కొన్నావు దీన్ని అని అడుగుతుంది మల్లిక. దీంతో జానకి వదిన తన గాజులు అమ్మి గిటార్ ను కొనిచ్చింది అని అంటాడు అఖిల్. అబ్బ.. జానకి ఏం దొరికింది అని అనుకొని వెంటనే పోలేరమ్మ దగ్గరికి వెళ్తుంది మల్లిక.
మరోవైపు జానకి.. తన ఐపీఎస్ కల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. జానకి గారు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు. కన్నవాళ్లకు ఇచ్చే గొప్ప బహుమతి ఏంటో తెలుసా. వాళ్ల కళ్లలో చూసే సంతోషం. మీరు ఐపీఎస్ అయితే.. మీ అమ్మానాన్న చాలా సంతోషిస్తారు. వాళ్లకు సంతోషాన్ని ఇవ్వడం కూతురుగా మీ ధర్మం కాదా చెప్పండి అంటాడు రామా.
మరోవైపు అత్తయ్య గారు అంటూ మల్లిక.. పిలుస్తుంది. జానకి తన గాజులను తాకట్టు పెట్టి మీకు తెలియకుండా అఖిల్ కు ఈ గిటార్ ను కొనిచ్చింది చూడండి అంటుంది మల్లిక. దీంతో అఖిల్ ను నిజమేనా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో అఖిల్ నిజమే అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు.
మామయ్య గారు.. నేను జానకి గురించి చెబుతుంటే నీకు తిన్నది అరగడం లేదా.. తోటి కోడలు మీద ఆడిపోసుకోవడం అని అన్నారు కదా. ఇప్పుడేమంటారు అంటుంది మల్లిక. జ్ఞానాంబ కూడా ఏం మాట్లాడదు. ఆ తర్వాత రాత్రి జానకి, రామా తమ గదిలో పడుకుంటారు. రామా గుండెల మీద చేయి వేసి పడుకుంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన…
School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…
Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్గా…
Mana Shankara Vara Prasad Garu Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…
Bhatti Vikramarka : ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…
Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…
Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…
Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…
This website uses cookies.