
Janaki Kalaganaledu 7 january 2022 full episode
Janaki Kalaganaledu 7 Jan Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 జనవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 210 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకికి ముక్కు పుడక పెట్టబోతూ షాక్ అవుతాడు రామా. చాలా కరెంట్ ఉందండి అంటాడు. తన చెంపలు తాకేసరికి.. తన చేతికి షాక్ కొడుతుంది. అక్కడ కరెంట్ ఉందండి.. అంటాడు. షాక్ కొట్టింది అంటాడు. రామా గారు.. కొంచెం అర్థం అయ్యేలా చెప్పండి అంటుంది జానకి. తనను చూసి సిగ్గుపడతాడు రామా. అద్దంలో తన పెదాలను చూపించి.. అక్కడ షాక్ తగిలింది అంటాడు రామా. సరే.. ఇటు ఇవ్వండి.. నేనే పెట్టుకుంటాను అంటుంది జానకి. వద్దు నేనే పెడతాను అంటాడు రామా. తనే ముక్కుపుడక పెడతాడు. బాగుంది అంటాడు రామా.
Janaki Kalaganaledu 7 january 2022 full episode
అయ్యబాబోయ్ జానకి గారు అంటూ తనకు అద్దంలో ముద్దు పెడతాడు. దీంతో జానకి షాక్ అవుతుంది. తెగ సిగ్గు పడుతుంది. మరోవైపు సాయంత్రం అవుతుంది. పెళ్లి చూపుల కోసం ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో పెళ్లి వాళ్లు వస్తారు. కారు దిగుతారు. ప్రయాణం అంతా బాగా జరిగిందా అని అడుగుతారు. పెళ్లికొడుకును చూసి బాగున్నాడు అంటారు. అందరూ వస్తారు. సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. తన ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తుంది జ్ఞానాంబ. మీ కుటుంబంతో వియ్యం కలుపుకోబోతున్నామని ఊళ్లో చెప్పగానే అందరూ మీరు నక్కతోక తొక్కారని చెప్పారు అంటాడు పెళ్లికొడుకు తండ్రి. వెన్నెల.. నువ్వు బాధపడుతూ కూర్చోకు. పదా వెళ్దాం అంటుంది జానకి. కానీ.. వెన్నెల మాత్రం బాధపడుతూనే ఉంటుంది.
ఇంతలో రామా వచ్చి జానకి గారు మా చెల్లి కోసం మల్లెపూలు తీసుకొచ్చేశాను అంటాడు రామా. రామాను చూసి వెన్నెల ఏడుస్తుంది. తనను హత్తుకుంటుంది. కానీ.. వెన్నెల ఏడ్చింది ఈ పెళ్లి ఇష్టం లేక. కానీ.. రామా మాత్రం తను పెళ్లి చేసుకొని వెళ్లిపోతుందని బాధపడుతుందేమో అంటాడు రామా.
పెళ్లి కాగానే అబ్బాయినే మన ఇంటికి ఇల్లరికం తెచ్చేదాంలే.. అప్పుడు నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరం ఉండదు అంటాడు. ఇంతలో మల్లిక చూసి బావ గారు ముందు వెన్నెలను పంపించండి. వెన్నెలను తీసుకురమ్మంటున్నారు అంటుంది మల్లిక.
రామా గారు నేను తీసుకొస్తాను మీరు వెళ్లండి అంటుంది జానకి. వెన్నెల ప్రేమ విషయాన్ని రామా గారికి సమయం చూసుకొని చెప్పాలి అని అనుకుంటుంది జానకి. అందరికీ కాఫీ ఇస్తుంది వెన్నెల. తర్వాత చికిత జ్యూస్ తీసుకొని వస్తుంది. రేయ్.. అమ్మాయిని చూడరా అంటారు అబ్బాయి తల్లిదండ్రులు.
మీ అమ్మాయి నాకు బాగా నచ్చిందండి అంటాడు అబ్బాయి. మా అబ్బాయి ముక్కు సూటి మనిషి అండి. మనసులో ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. మీ అమ్మాయిని కూడా ఒకసారి మా వాడిని చూసి తన అభిప్రాయం చెప్పమని చెప్పండి అని అడుగుతారు. దీంతో వెన్నెల అబ్బాయిని చూడు.. అంటుంది జ్ఞానాంబ.
ఏం కాదులే.. తలెత్తి చూసి నీ అభిప్రాయం చెప్పు వెన్నెల అంటుంది మల్లిక. మా కోడలుకు కాస్త సిగ్గు ఎక్కువలా ఉంది అంటుంది అబ్బాయి తల్లి. దీంతో వెన్నెల అబ్బాయి వైపు చూస్తుంది. ఏదో బాధపడుతూ ఉంటుంది. ఎందుకు అలా ఉన్నావమ్మా.. ఏమైంది అని అడుగుతుంది జ్ఞానాంబ.
ఏం లేదమ్మా అంటుంది వెన్నెల. అయితే అబ్బాయిని చూడు అంటుంది జ్ఞానాంబ. నీకు నచ్చాడా అంటుంది. నచ్చాడని చెప్పు అన్నట్టుగా సైగ చేస్తుంది జానకి. చెప్పమ్మా అబ్బాయి నచ్చాడా అని అడుగుతారు. దీంతో ఊ.. అంటుంది వెన్నెల. శుభం.. మీ అమ్మాయికి కూడా మా అబ్బాయి నచ్చాడు కాబట్టి.. ఇక పెళ్లి ఎప్పుడు ఎంత త్వరగా చేస్తే అంత మేలు అనిపిస్తుంది అంటారు పెళ్లి వాళ్లు.
ఆ తర్వాత లోపలికి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంతలో పోలీసులు జ్ఞానాంబ ఇంటికి వస్తారు. డోర్ కొడతారు. పోలీసులు రావడం చూసి షాక్ అవుతారు. రామా వెళ్లి నమస్తే సార్.. ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతాడు రామా. ఇది జ్ఞానాంబ గారి ఇల్లేనా అంటాడు పోలీస్. అవునండి అంటాడు రామా.
ఇక్కడ జానకి ఎవరు అని అడుగుతాడు ఎస్ఐ. నేనే సార్ అంటూ జానకి ముందుకు వస్తుంది. జానకిని అరెస్ట్ చేస్తున్నాం అంటూ చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత జానకిని అరెస్ట్ చేసి ఎస్ఐ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.