Home » Entertainment » Janaki Kalaganaledu 7 July 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 7 July Today Episode : చక్కగా ముస్తాబు అయి రామాను రెచ్చగొట్టిన జానకి.. జానకిని అలా చూసి తట్టుకోలేకపోయిన రామా.. ఫస్ట్ నైట్ జరుగుతుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: July 7, 2022, 11:30 am
Advertisement

Janaki Kalaganaledu 7 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 జులై 2022, గురువారం ఎపిసోడ్ 339 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి, రామా ఇద్దరూ మాట్లాడుకోవడం వింటుంది జ్ఞానాంబ. ఇక నైనా మనం సంసార జీవితాన్ని ప్రారంభిద్దాం అంటుంది జానకి. కానీ.. రామా మాత్రం వద్దు అంటాడు. మనం ఒక లక్ష్యం కోసం పిల్లలను వద్దనుకున్నాం కదా. మీరు ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడకండి.. అని ఫస్ట్ నైట్ ను వాయిదా వేస్తాడు రామా. దీంతో అసలు వీళ్లు ఎందుకు పిల్లలను వద్దనుకుంటున్నారు. ఏంటా లక్ష్యం అని అనుకుంటుంది జ్ఞానాంబ. కట్ చేస్తే ఉదయం అవుతుంది. జానకి రామా మీద అలుగుతుంది. జానకి గారు నేను కొట్టుకు వెళ్తున్నాను అంటాడు రామా. దీంతో మీరు ఇంత హడావుడిగా కొట్టుకు వెళ్లాలా? ఈరోజు కొట్టుకు వెళ్లకపోతే ఏంటి అని అంటుంది జానకి. దీంతో అదేంటి.. కొట్టుకు వెళ్లకపోతే ఎలా అంటాడు రామా. దీంతో మీకు కొట్టు మాత్రమే కాదు.. కట్టుకున్న భార్య కూడా ఉంది. తన మనసులో ఏముందో కూడా అర్థం చేసుకోండి అంటుంది జానకి.

Advertisement

janaki kalaganaledu 7 july 2022 full episode

అయినా కూడా వినకుండా రామా వెళ్తుంటాడు. దీంతో తన టవల్ తీసుకొని లాగుతుంది. తనూ లాగుతాడు. ఇంతలో జానకి పడిపోబోతుంటే పట్టుకుంటాడు రామా. నా చదువుకు ఏం ఆటంకం రాదు. నేను నా చదువును, సంసార జీవితాన్ని మోయగలను అంటుంది జానకి. దీంతో వద్దండి.. అది చెప్పినంత ఈజీ కాదు అంటాడు రామా. ఒక రెండేళ్లు ఆగండి అని చెప్పి కొట్టుకు వెళ్లిపోతాడు రామా. దీంతో ఏం చేయాలో జానకికి అర్థం కాదు. వంట చేస్తూ కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జ్ఞానాంబకు ఇచ్చిన మాటను ఎలా నెరవేర్చాలా అని అనుకుంటుంది జానకి. కూరగాయలు కోస్తుండగా ఇంతలో తన చేయి తెగుతుంది. ఇంతలో జ్ఞానాంబ వస్తుంది. తన చేతికి గాయం కావడంతో కొంచెం పసుపు పెడుతుంది.

Advertisement

ఏంటమ్మా ఇది.. చూసుకోవాలి కదా అంటుంది జ్ఞానాంబ. ఏం కంగారు పడకండి.. తగ్గిపోతుంది అంటుంది జానకి. ఆ తర్వాత ఏం పరధ్యానంగా ఉన్నావు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో ఏం లేదు అత్తయ్య గారు అంటుంది జానకి. దీంతో నేను నీకు అత్తయ్యను మాత్రమే కాదు.. అమ్మను కూడా అంటుంది. నీ మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 7 July Today Episode : జ్ఞానాంబకు తన మనసులో బాధను చెప్పని జానకి

కానీ.. జానకి మాత్రం ఏం లేదు అంటుంది. ఎంత అడిగినా జానకి సమాధానం చెప్పదు. ఇదే విషయం గురించి జ్ఞానాంబ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు రాత్రి అవుతుంది. జానకి చక్కగా రెడీ అవుతుంది. రామా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ.. రామా మాత్రం ఇంకా రాడు.

Advertisement

తన రూమ్ బయట రామా కోసం ఎదురు చూస్తున్న జానకిని మల్లిక చూస్తుంది. చూసి షాక్ అవుతుంది. పెళ్లి రోజు కూడా కాదు కదా. ఎందుకు అంత ముస్తాబు అయింది అని అనుకుంటుంది. ఇంతలో రామా వస్తుంటాడు. తనకు ఎదురు వెళ్తుంది జానకి. తనకు ఆ చీరలో చూసి షాక్ అవుతాడు రామా.

రండి అని లోపలికి తీసుకెళ్తుంది జానకి. అమ్మో.. రాముల వారి గుడి దగ్గర స్థలం కొట్టేసే ప్లాన్ లో ఉంది జానకి అని అనుకొని అక్కడి నుంచి వెంటనే తన రూమ్ కు వెళ్లిపోతుంది మల్లిక. మరోవైపు జానకిని చూసి రామా టెంప్ట్ అవుతుంటాడు. మతి పోతుంది. కానీ.. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు.

ఇదంతా బయటి నుంచి మల్లిక గమనిస్తూ ఉంటుంది. మీరు చాలా బాగున్నారు అంటాడు రామా. ఇంతలో తనకు ఎవరెవరు ఎంత బాకీ ఉన్నారో రాస్తుంటాడు రామా. అవన్నీ తర్వాత ముందు ఇంటికి వచ్చాక భార్యతో ప్రేమగా ఉండాలి అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి