Home » Entertainment » Janaki Kalaganaledu 7 March 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 7 March Today Episode : సంతోషంలో జ్ఞానాంబ ఫ్యామిలీ.. కోపంతో రగిలిపోయిన మల్లిక.. లీలావతిని పిలిచి రచ్చ రచ్చ.. ఇంతలో మరో ట్విస్ట్

Authored By
Varun G
The Telugu News | Published on: March 7, 2022, 11:30 am
Advertisement

Janaki Kalaganaledu 7 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు సోమవారం, 7 మార్చి 2022, ఎపిసోడ్ 251 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తమ పెళ్లి చూపుల గురించి అప్పటి క్యాస్టూమ్స్ తో రెడీ అయి.. తన పెళ్లి చూపుల గురించి చెబుతుంటాడు గోవిందరాజు. అప్పుడే నేను ఒక మెరుపును చూశాను. ఆ మెరుపు పేరే మీ అమ్మ అని చెబుతాడు గోవిందరాజు. ఏంట్రా బాబు ఇంత అందంగా ఉంది అని అనుకుంటాడు గోవిందరాజు. జ్ఞానాంబ.. తనకు చాయ్ తీసుకొచ్చి ఇస్తుంది. నీ పేరు అని అడుగుతాడు. దీంతో జ్ఞాన ప్రసుమాంబ అంటుంది. అంత పెద్ద పేరు అవసరమా అంటాడు. వంట వచ్చా అని అడుగుతాడు. ఊ.. అంటుంది. ఊ.. ఆ కాదు.. వచ్చా రాదా అని అడుగుతాడు. వచ్చు అండి అంటుంది.

Advertisement

janaki kalaganaledu 7 march 2022 full episode

ఆట పాటల్లో ప్రవేశం ఉందా అని అడుగుతాడు. ఆటల్లో లేదు కానీ.. పాటల్లో ఉంది అంటుంది. నీకో విషయం తెలుసా.. ఈ గోవిందరాజు రోడ్డు వెంట నడుస్తూ వెళ్తుంటే అమ్మాయిలు ఒకటే వెంట పడేవారు.. అని చెబుతాడు. తెల్లారడమే ఆలస్యం.. మా ఇంటి ముందు అమ్మాయిల తల్లిదండ్రులు క్యూ కట్టేవారు.. అంటాడు గోవిందరాజు. అంత మంది వెంటపడ్డా.. అన్ని కోట్లు, సూట్ కేసులు వెంట తిరిగినా సరే.. నేను నో అన్నాను తప్పితే ఎస్ అనలేదు. ఈ అందగాడిని చేసుకునే అదృష్టం ఎవరికి రాసిపెట్టి ఉందో.. ఆ అదృష్ట జాతకురాలు ఎవరా అని అమ్మాయిలకు ఒకటే కుళ్లు.. అంటాడు గోవిందరాజులు.

Advertisement

మీకోసం అంత మంది అమ్మాయిలు వెంట పడుతున్నప్పుడు వాళ్లను కాదని ఎందుకు లేండి. వాళ్లలో ఎవరో ఒకరిని చేసుకోండి అంటున్నాను అంటుంది జ్ఞానాంబ. అదేంటి.. ఒకేసారి అంత మాట అనేశావు అంటాడు గోవిందరాజు. మీరు మహా అందగాడు. మేము సామాన్యులం.. అంటుంది జ్ఞానాంబ.

మీరు వెళ్లి మరో సంబంధం చూసుకోండి అంటుంది జ్ఞానాంబ. ఇదిగో.. నువ్వు వద్దన్నావని తెలిస్తే ఊళ్లో నా పరువు పోతుంది. ప్లీజ్ ఒప్పుకోవా అని బతిమిలాడుతాడు గోవిందరాజు. మీ కాళ్లు పట్టుకుంటాను.. ప్లీజ్ దయచేసి ఒప్పుకోండి.. నన్ను పెళ్లి చేసుకోండి అంటాడు గోవిందరాజు.

Advertisement

ఆపండి.. అంటుంది జ్ఞానాంబ. అంటే నాన్న బిల్డప్ తో మొదలు పెట్టి బతిమాలే దగ్గర ఆగారన్నమాట అంటాడు రామా. దీంతో కాళ్లు పట్టుకున్నా పర్వాలేదురా.. కానీ మీ అమ్మ దొరకడం నా అదృష్టం అంటాడు గోవిందరాజు. ఆ తర్వాత ఇద్దరూ ఓ సాంగ్ వేసుకుంటారు.

Janaki Kalaganaledu 7 March Today Episode : పెళ్లి చూపులే కాదు.. జ్ఞానాంబ పెళ్లిని కూడా కళ్లకు కట్టినట్టు చూపించిన కుటుంబ సభ్యులు

తర్వాత ఇద్దరి పెళ్లి ఏర్పాట్లను కూడా చేస్తారు. ఇద్దరితో మళ్లీ దండలు మార్పిస్తారు కుటుంబ సభ్యులు. దీంతో ఇద్దరూ మురిసిపోతారు. తలంబ్రాలు కూడా పోసుకుంటారు. ఇవన్నీ చూసి మల్లికకు అస్సలు గిట్టదు. చాలా కోపంగా ఉంటుంది. చెప్తా మీ అందరి సంగతి అని అనుకుంటుంది.

వెంటనే లీలావతికి ఫోన్ చేస్తుంది. నువ్వు జీవించి బీభత్సం చేయాలి అంటుంది మల్లిక. సీన్ ఏంటో చెప్పు అమ్మాయి.. చాయా దేవిలా చెలేరేగిపోతాను అంటుంది లీలావతి. దీంతో ఏదో ప్లాన్ చెబుతుంది మల్లిక. 50 రూపాయలు ఇస్తాను వచ్చి చేయ్ అంటుంది.

దీంతో 50కి అయితే చేయను.. 500 ఇస్తేనే చేస్తా అంటుంది లీలావతి. సరే.. రా వచ్చి వీళ్ల ఆనందాన్ని చెడగొట్టు అంటుంది మల్లిక. మరోవైపు పెళ్లి తంతు పూర్తి కాగానే అందరూ కలిసి ఫోటోలు దిగుతారు. పెళ్లి చేయంగానే కాదురా.. పెళ్లి తర్వాత ఒక మంచి పాటకు డ్యాన్స్ వేస్తే బాగుంటుంది అంటాడు గోవిందరాజు.

Advertisement

దీంతో పాటకు అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. మరోవైపు అత్తయ్య గారు.. మామయ్య గారు ఒకరికి మరొకరు ఈ స్వీట్లు తినిపించుకోవాలి అంటుంది జానకి. ఇంతలో లీలావతి అక్కడికి వస్తుంది. ఏదో వేడుక జరుగుతున్నట్టు ఉంది అంటుంది లీలావతి.

దీంతో అవును పెద్దమ్మ.. మా అత్తయ్య, మామయ్య 25 వ సంవత్సరం పెళ్లి రోజు అంటుంది మల్లిక. దీంతో మామూలుగా అయితే.. మనవడో.. మనవరాలో వాళ్ల వేడుకలు చేయాలి కానీ.. నీకు ఆ అదృష్టం లేకపాయె. మనవడో.. మనవరాలినో ఎత్తుకొని ఆడించే అదృష్టం లేనందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు అంటుంది లీలావతి.

దీంతో ఇంట్లో జరుగుతున్న వేడుకల్లో ఒక్కసారి మౌనం ఆవహిస్తుంది. అందరూ బాధపడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి