janaki kalaganaledu 7 october 2022 full episode
Janaki Kalaganaledu 7 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 అక్టోబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 405 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిద్దామని జ్ఞానాంబ, గోవిందరాజు అనుకుంటుండగానే ఇంతలో అక్కడికి పీటర్, ఆయన భార్య వస్తారు. నా కూతురును కడుపులో పెట్టుకొని చూసుకుంటారని అనుకున్నాం కానీ.. మీరు మా అమ్మాయిని ఇలా చేస్తారని అనుకోలేదు. మా కూతురును మీ సొంత కూతురులా చూసుకుంటారని అనుకున్నాం కానీ.. ఇలా చేస్తారని అనుకోలేదు అని అడుగుతాడు పీటర్. అయితే.. మల్లిక మీద జానకికి అనుమానం వస్తుంది. నిప్పు లేకపోతే పొగ రాదు కదా అంటాడు పీటర్. దీంతో కొందరు కావాలని అవకాశాన్ని అగ్గి రాజేస్తారు. వాళ్ల ఊహలను వాస్తవం చేసుకొని మీకు ఏదో చెడు వార్త చెరవేసి ఉంటారు. కాస్త నిజానిజాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది అని అంటుంది జానకి.
janaki kalaganaledu 7 october 2022 full episode
దీంతో మీ అత్తయ్య వాళ్లను నువ్వు ఇప్పుడు వెనకేసుకుస్తున్నావా? ఇదేనా నీ వివేకం, నువ్వు చదువుకున్నది ఇదేనా అని ప్రశ్నిస్తుంది జెస్సీ తల్లి. మేమేంటో మా కుటుంబం ఏంటో తెలుసు కదా అని అంటాడు విష్ణు. ఈయన ఎందుకు మధ్యలో దూరుతున్నాడు అని అనుకుంటుంది మల్లిక. మా అమ్మకు ప్రేమను పంచడం తప్ప ద్వేషం పంచడం తెలియదు అంటాడు రామా. వాళ్ల వ్యక్తిత్వమే కొడుకులకు, కూతుళ్లకు, కోడళ్లకు నేర్పించారు.. అంటాడు రామా. మమకారాన్ని పంచే మనుషులం మేము అంటాడు రామా. మేము కూడా ముందు అదే అనుకున్నాం. మీది గొప్ప కుటుంబం అని చెబితే నమ్మాం. నీ మాటలకు, నీ భార్య మాటలకు కరిగిపోయాం అంటాడు పీటర్. కానీ.. మీ కుటుంబం మేడిపండు లాంటిది అని పైకి నవ్వులే తప్ప లోపల నా కూతురును సాధిస్తున్నారని తెలిసి అసలు రూపం తెలిసి ఇక్కడికి వచ్చాం అంటాడు పీటర్.
మనసులో ఏదో పెట్టుకొని మా జెస్సీని కష్టాలు పెడుతున్నారు కాబట్టే ఇక్కడికి వచ్చాం అంటుంది పీటర్ భార్య. దీంతో అప్పుడే అక్కడికి వచ్చిన జెస్సీ అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అక్కడికి వచ్చి నేను ఇక్కడ అవస్థలు పడుతున్నా అని మీకు ఎవరు చెప్పారు నాన్నా అని నిలదీస్తుంది జెస్సీ.
అత్తయ్య గారి వల్ల, ఈ కుటుంబం వల్ల నేను కష్టాలు పడుతున్నానని మీకెవరు చెప్పారు అంటుంది జెస్సీ. దీంతో పీటర్ కు ఏం చెప్పాలో అర్థం కాదు. చూడండి నాన్న.. నేను కోడలుగా వచ్చింది ఒక ఇంటికి కాదు. దేవాలయానికి అంటుంది జెస్సీ. దేవత లాంటి అత్తయ్య గారి చల్లని నీడలోకి అంటుంది జెస్సీ.
మామయ్య గారు, బావ గారి లాంటి గొప్ప మనుషుల మధ్యలోకి. ప్రేమకి ప్రతిరూపం అయిన జానకి అక్క చెంతకి అంటుంది జెస్సీ. అభిమానం తప్ప అహం అంటే తెలియని మనుషుల జీవితాల్లోకి వచ్చాను. మీరు ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ఇంకోసారి ఇలా వచ్చి మా వాళ్ల మీద ఇలా మాట్లాడితే మీ కూతురు మీదనే మీరు గౌరవం పోగొట్టుకోవాల్సి వస్తుంది అంటుంది జెస్సీ.
చిన్న పొరపాటు వల్ల చెప్పుడు మాటలను నమ్మి ఇక్కడి దాకా వచ్చాం. ఇంకోసారి ఇలా చేయం.. అని జ్ఞానాంబ, గోవిందరాజుకు క్షమాపణలు కోరుతారు పీటర్, ఆయన భార్య. బాబు రామా.. అమ్మ జానకి. ఇవేవీ మనసులో పెట్టుకోకండి అంటాడు పీటర్.
వెళ్లొస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక.. చాలా థాంక్స్ జెస్సీ. మీ అమ్మానాన్న అనుమానాన్ని పోగొట్టావు అంటే.. తల్లిదండ్రులు అయినా సరే నా అత్తగారింటిని అనవసరంగా మాటలు అంటే నేను ఊరుకోను అక్క అని చెప్పి జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి అత్తయ్య గారు మా అమ్మానాన్నల తరుపున నేను క్షమాపణలు చెబుతున్నాను అంటుంది జెస్సీ.
మనసులో ఎలాంటివి పెట్టుకోకండి అంటుంది జెస్సీ. లాస్ట్ కు నా ప్లాన్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అని అనుకుంటుంది మల్లిక. ఆ తర్వాత మల్లిక ఈ ప్లాన్ వేసిందా అని గోవిందరాజుకు డౌట్ వస్తుంది. మరోవైపు రాత్రి అవుతుంది. జానకి.. సీరియస్ గా పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటుంది.
ఇంతలో జెస్సీ అక్కడికి వస్తుంది. అక్కా అని పిలుస్తుంది. నీ చదువు డిస్టర్బ్ చేసినందుకు సారీ. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని అంటుంది జెస్సీ. నేను ఎంతో టెన్షన్ పడ్డ తర్వాత నీ వల్ల అఖిల్ తో పెళ్లి జరిగిందని నేను చాలా సంతోషించా. కానీ.. అత్తయ్య గారు నన్ను దోషిలా చూస్తున్నారు అంటుంది జెస్సీ.
అఖిల్ నాకు సపోర్ట్ గా ఉండటం లేదు. నాతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నాడు. జీవితాంతం ఇక్కడే ఉండాల్సిన దాన్ని. వాళ్లు నాతో అలా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది జెస్సీ. అఖిల్ ది వయసుతో పాటు ఉండే ఆవేశం అంతే అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
This website uses cookies.