
janaki kalaganaledu 8 april 2022 full episode
Janaki Kalaganaledu 8 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 ఏప్రిల్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 275 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మా అమ్మ దేవత కాబట్టే నువ్వు మోసం చేసి నీ చెల్లెలుకు పెళ్లి చేసినా కన్నకూతురులా చూసుకుంది అంటాడు రామా. మరి ఇప్పుడు చేసింది ఏంటి అంటాడు యోగి. దీంతో రామా మళ్లీ యోగిని కొట్టబోతాడు. దీంతో వెంటనే వెళ్లి జానకి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ వెనక్కి తీసుకో అని అంటుంది. దీంతో కంప్లయింట్ అస్సలు వెనక్కి తీసుకునేది లేదు. ఆమెకు శిక్ష పడాల్సిందే అంటాడు యోగి. దీంతో రామాకు మరింత కోపం వస్తుంది.
janaki kalaganaledu 8 april 2022 full episode
మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. గంటలో మా అమ్మ ఇంట్లో ఉండాలి. గంట దాటితే ఈ రాముడు రావణాసూరుడు అవుతాడు అని అంటాడు. ముందు నువ్వు స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ వెనక్కి తీసుకో అన్నయ్య అంటుంది జానకి. దీంతో అది జరగని పని అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు యోగి. ఆ తర్వాత రామాకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో జానకి రామా దగ్గరికి వస్తుంది. ఏమండి అని అంటుంది. తన మీద చేయి వేయబోతుంది. దీంతో తన చేయి తీసేస్తాడు.
రామా గారు అంటుంది. మా అన్నయ్యకు చెప్పాను. నేను వెళ్లి మా అన్నయ్య కేసు వెనక్కి తీసుకునేలా చేస్తాను. మరికాసేపట్లో అత్తయ్య గారు ఇంటికి వచ్చేస్తారు అంటుంది జానకి. దీంతో మీకు ముందే తెలుసు కదా అంటాడు రామా. దీంతో జానకి షాక్ అవుతుంది.
మా అమ్మ మీద మీ అన్నయ్య పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేయాలనుకున్న విషయం మీకు ముందే తెలుసు కదా అని అడుగుతాడు రామా. దీంతో మీరేనా ఇలా అడుగుతోంది అంటుంది జానకి. మీకు తెలియకుండా మీ అన్నయ్య కేసు పెట్టే ధైర్యం చేస్తాడా అంటాడు.
మరి ఇక్కడ జరిగిన విషయాలన్నీ మీ అన్నయ్యకు ఎలా తెలుసు అని అడుగుతాడు రామా. మనం ఇంట్లో నుంచి బయటికి వచ్చిన విషయం ఎలా తెలుసు అని అడుగుతాడు. దీంతో రామా గారు మీరు నన్ను అనుమానిస్తున్నారా అని అంటుంది జానకి.
ఏం మాట్లాడాలో.. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది జానకి. మీరు నన్ను ఇలా నిందిస్తూ మాట్లాడుతారని నేను అస్సలు అనుకోలేదు అంటుంది జానకి. దీంతో నేనే కాదు.. ఎవ్వరైనా ఇలాగే అనుకుంటారు. మీకు తెలియకుండా మీ అన్నయ్య ఇలా చేశాడు అంటే ఎవ్వరూ నమ్మరు అంటాడు రామా.
మీకోపంలో అర్థం ఉంది. కానీ.. ఒక్కటి మాత్రం నిజం రామా గారు. మా అన్నయ్య అమెరికా నుంచి వస్తున్న విషయం కానీ.. కేసు పెట్టబోతున్న విషయం కానీ నాకు తెలియదు. తెలిసి ఉంటే నేను కేసు పెట్టనిచ్చేదాన్నే కాదు. అంతే కానీ.. అత్తయ్య గారిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించేదాన్ని కాదు అంటుంది జానకి.
నేను వెళ్లి మా అన్నయ్య కేసు వెనక్కి తీసుకునేలా చేస్తాను. అత్తయ్య గారు ఇంటికి వచ్చేలా చేస్తాను. లేకపోతే నేను ఎప్పటికీ ఇక్కడికి రాను రామా గారు అంటుంది జానకి. అయినా కూడా రామా ఏం మాట్లాడడు. దీంతో అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోతుంది జానకి.
మరోవైపు జ్ఞానాంబ దగ్గరికి కుటుంబ సభ్యులు అందరూ వెళ్తారు. రాముడు వెళ్లాడు.. నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించేందుకు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అంటాగు గోవిందరాజులు. దీంతో వాడు నాకోసం ఎలాంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అంటుంది జ్ఞానాంబ.
మరోవైపు యోగి తన ఇంటికి వెళ్తాడు. కేసు పెట్టిన విషయం ఊర్మిలకు చెబుతాడు. అప్పుడే జానకి వస్తుంది. మా అత్తయ్య గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మాట్లాడటానికి నువ్వు సరిపోవు కూడా అంటుంది జానకి. ఆరోజు అబద్ధం చెప్పి నా పెళ్లి చేశావు. ఈరోజు ఎవరో చెప్పిన అబద్ధాన్ని విని మా అత్తయ్య గారిని అరెస్ట్ చేయించావు అంటుంది జానకి.
నీ జీవితం బాగుంటుందని ఆరోజు ఏదో ఒక చిన్న అబద్ధం చెప్పాను అంటాడు యోగి. నువ్వు చేసిన పని వల్ల నా ఐపీఎస్ కల కూడా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది అని అంటుంది జానకి. మా అత్తయ్య గారు నిజంగా దేవత అంటుంది జానకి. నన్ను కూతురులా చూసుకుంది తప్పితే ఏనాడూ కంటతడి పెట్టించలేదు అంటుంది జానకి.
అలాంటి ఇంటికి కోడలును అవ్వడం నా అదృష్టం అంటుంది జానకి. మా అత్తయ్య గారి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవాలి అంటుంది జానకి. కానీ.. నువ్వు ఈరోజు కేసు పెట్టి అంతకంటే పెద్ద తప్పు చేశావు అంటుంది జానకి. నువ్వు చెప్పే ప్రతి మాటలోనూ ఆవిడ మీద నీకు ఉన్న భయమే కనిపిస్తోంది అంటాడు.
అందుకే.. నీకు రామాతో విడాకులు ఇప్పించి మాతో పాటు అమెరికా తీసుకెళ్తాం అంటాడు యోగి. దీంతో జానకి షాక్ అవుతుంది. ఆ తర్వాత జానకిని తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు యోగి. మీ అత్తయ్య నిన్ను ఎలాంటి కష్టాలు పెట్టిందో అన్నింటినీ ఎస్ఐ గారికి చెప్పు అంటాడు యోగి.
దీంతో మా అత్తయ్య గారు నన్ను చాలా బాధపెట్టారు అంటుంది జానకి. చాలా కష్టపెట్టారు. ఇది నిజం అంటుంది జానకి. అవును ఎస్ఐ గారు. నేను ఇప్పుడు చెప్పిన ప్రతి మాట నిజం అంటుంది జానకి. ఆ తర్వాత జ్ఞానాంబ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.