Janaki Kalaganaledu 8 Oct Today Episode : జానకి చదువు విషయం తెలిసి.. జానకిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన జ్ఞానాంబ.. రామా కూడా జానకితో వెళ్లిపోతాడా? అమ్మ మాటకు విలువిచ్చి ఇంట్లో ఉంటాడా?

Advertisement
Advertisement

Janaki Kalaganaledu 8 Oct Today episode : జానకి కలగనలేదు సీరియల్ 8 అక్టోబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి పుట్టిన రోజు సందర్భంగా రామా, జానకి.. ఇద్దరూ సరదాగా బయటికి వెళ్తారు. అయితే.. కాలేజీకి వెళ్లిన జ్ఞానాంబకు జానకి చదువు విషయం తెలిసిపోతుంది. అంతే కాదు.. తను సివిల్స్ లో టాప్ ర్యాంక్ సాధించింది అన్న విషయం కూడా తనకు తెలుస్తుంది. దీంతో షాక్ అవుతుంది జ్ఞానాంబ.అసలు.. తనకు తెలియకుండా జానకి చదువు విషయం తన దగ్గర ఎందుకు దాచారు.. అని ఆలోచిస్తుంది జ్ఞానాంబ. నాకు తెలియకుండా దాచి.. జానకి పెళ్లి చేయడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తుంది. వెంటనే తన పొలం దగ్గరికి వెళ్లి ఒంటరిగా కూర్చుంటుంది.

Advertisement

janaki kalaganaledu 8 october 2021 episode

మరో వైపు.. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న మల్లిక.. జానకి రూమ్ కు వెళ్లి అక్కడ అంతా వెతుకుతుంది. తన సివిల్స్ పుస్తకాలు కనిపిస్తాయేమో అని అనుకుంటుంది. కానీ.. తనకు జానకి సర్టిఫికెట్లు కనిపిస్తాయి. దీంతో వాటిని తీసుకెళ్లి.. తెలిసిన వాళ్లకు చూపిస్తుంది. వాళ్లు అవి డిగ్రీ సర్టిఫికెట్లు అని చెబుతారు. దీంతో మల్లిక షాక్ అవుతుంది. వెంటనే తన అత్తయ్యకు ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. నీకు ఎలా తెలుసు అని జ్ఞానాంబ మల్లికను అడుగుతుంది. దీంతో జానకి సర్టిఫికెట్లు చూశాను.. అని  చెబుతుంది మల్లిక.

Advertisement

Janaki Kalaganaledu 8 Oct Today Episode : మనిద్దరం ఎప్పుడూ కలిసే ఉండాలని అనుకున్న రామా, జానకి

కట్ చేస్తే.. జానకి, రామా.. గుడికి వెళ్తారు. అక్కడ కాసేపు సరదాగా గడుపుతారు. జానకిని తొలిసారి రామా అదే గుడిలో చూశా అని చెబుతాడు. దీంతో పెళ్లికి ముందే నన్ను మీరు చూశారా.. అని అడుగుతుంది జానకి. అవును అంటాడు రామా.

janaki kalaganaledu 8 october 2021 episode

ఇద్దరూ సాయంత్రం దాకా సరదాగా గడిపి ఇంటికి తిరిగి రాగానే షాక్ అవుతారు. ఆగండి.. అని చెప్పి.. జానకి సూట్ కేసును బయటికి విసిరేస్తుంది జ్ఞానాంబ. ఏం జరిగిందో అర్థం కాక.. షాక్ అవుతుంది జానకి. నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు. ఇంట్లో నుంచి వెంటనే వెళ్లిపో.. అని అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి, రామా.. ఇద్దరూ షాక్ అవుతారు.

అమ్మా… ఏమైందమ్మా.. ఎందుకు అలా మాట్లాడుతున్నావు. జానకి ఏం తప్పు చేసిందని తనను ఇంట్లో నుంచి వెళ్లగొడుతున్నావు… అని అడుగుతాడు రామా. అయినా కూడా జ్ఞానాంబ వినదు. జానకిని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ ఆదేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

1 hour ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.