Janaki Kalaganaledu 9 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 జూన్ 2022, గురువారం ఎపిసోడ్ 319 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెస్టర్న్ ఫుడ్ తయారు చేయాలని చెఫ్ చెప్పడంతో రామా షాక్ అవుతాడు. ఈ పోటీలో వాడు ఎలా గెలుస్తాడో ఏంటో అని టీవీ చూస్తూ జ్ఞానాంబ షాక్ అవుతుంది. రామాకు అస్సలు ఏం అర్థం కాదు. దీంతో రామా దగ్గరికి వెళ్లి జానకి ఏమైంది అని అడుగుతుంది. దీంతో మీరు చేయగలరు అంటుంది. మీరు పాస్తా చేయండి అని చెబుతుంది జానకి. అతడికి పాస్తా ఎలా చేయాలో చెబుతుంది. జానకి అక్కడ ఉండగా రాముడు ఎలా ఓడిపోతాడు చెప్పు అంటాడు గోవిందరాజు. జానకి గారు మీరు ఇలా రాకూడదు. వెళ్లి మీ సీటులో కూర్చోండి అంటుంది యాంకర్. తను చెప్పినట్టుగా రామా చేయడం ప్రారంభిస్తాడు. కానీ.. తనకు ఎందుకో కాస్త బెరుకు ఉంటుంది.
అయినప్పటికీ టైమ్ అవుతుండటంతో వెంటనే వంట ప్రారంభిస్తాడు. జ్ఞానాంబ, గోవిందరాజు కూడా టీవీలో చూస్తుంటారు. మీకు 10 నిమిషాలు మాత్రమే టైమ్ ఉంది అని యాంకర్ చెప్పడంతో రామా షాక్ అవుతాడు. త్వరగా వంట పూర్తి చేయడం కోసం చూస్తుంటాడు. ఇంతలో టైమ్ అయిపోతుంది. స్టాప్ అని అంటుంది యాంకర్. జడ్జిలు వెళ్లి అందరి ఫుడ్ టేస్ట్ చేస్తుంటారు. రామా దగ్గరికి వస్తుంది జడ్జి. దాన్ని తిని చూసి వాట్ హాపెన్డ్ రామచంద్ర.. డిష్ పూర్తిగా కంప్లీట్ చేయలేదు అంటుంది. దీంతో నాకు ఈ రకమైన వంటల గురించి పెద్దగా తెలియదు అంటాడు. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అంటుంది జడ్జి. అందరు జడ్జిలు తన డిష్ ట్రై చేసి బాగోలేదంటారు. తర్వాత అందరి డిష్ లు ట్రై చేసి మెయిన్ చెఫ్ సంజయ్ విన్నర్స్ ఎవరో అనౌన్స్ చేస్తాడు. అందులో రామచంద్ర పేరు ఉండదు. కాకపోతే రామాకు ఇంకో రౌండ్ కు వెళ్లే చాన్స్ ను ఇస్తాడు చెఫ్.
రేపు జరిగే పోటీల్లో మీరు ఇలాగే చేస్తే.. ముందుగా ఎలిమినేట్ అయ్యేది మీరే అంటాడు సంజయ్. రేపు థర్డ్ రౌండ్ లో క్వాలిఫై అయిన వాళ్లే తర్వాతి రౌండ్ కు వెళ్తారు అని చెబుతుంది యాంకర్. అది సెమీ ఫైనల్ రౌండ్ అని చెబుతుంది. అయితే.. జ్ఞానాంబ మాత్రం ఎందుకో టెన్షన్ పడుతుంది.
మరోవైపు రామా, జానకికి టెన్షన్ పట్టుకుంటుంది. ఆయన దేశమంతా గర్వపడే స్థాయిలో నిలబెడతానని నేను అత్తయ్య గారికి మాటిచ్చాను. ఆ మాటను నేను నిలబెట్టగలనా అని టెన్షన్ పడుతుంది జానకి. ఇంతలో రామా వచ్చి.. తన పుస్తకాలు తీసుకొచ్చి మీరు ఐపీఎస్ కోసం చదువుకోండి అంటాడు.
మీరు ఇలా విలువైన సమయాన్ని వృథా చేయకండి అంటాడు. కానీ.. రేపు పోటీలు ఎలా అని ఆలోచిస్తున్నాను అంటుంది జానకి. రేపటి పోటీల్లో నన్ను ఆ కష్టాల నుంచి తప్పించడం కోసం.. నన్ను గెలిపించడం కోసం ఆ దేవుడు ఎలాగోలా ఎవరినో ఒకరిని పంపిస్తారు కానీ.. మీరు ముందు ఐపీఎస్ చదువుకుంటూ ఉండండి అంటాడు రామా.
ఇంతలో అక్కడికి మిగితా కంటెస్టెంట్లు వచ్చి హేయ్ విలేజ్.. మెడలో టవల్ వేసుకొని నేషనల్ చాంపియన్ షిప్ టైటిల్ కొడదామని వచ్చావా అని హేళన చేస్తారు. దీంతో అక్కడికి వచ్చిన జానకి.. షటప్.. మీరు చదువుకున్నారన్న మాటే కానీ.. మీకు సంస్కారం లేదు అని తిడుతుంది.
రామా గారి లాంటి త్యాగం చేయాలంటే ఆకాశమంత మనసు ఉండాలి. ఏ విషయంలోనూ నా భర్త కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు. అలాంటిది నా భర్తను విమర్శించే స్థాయా నీది. రామా గారు.. పదండి.. అని చెప్పి రామాను అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది జానకి.
మరోవైపు మూడో రౌండ్ పోటీలు ప్రారంభం అవుతాయి. ఈరోజు ఇంకో అతిథి కూడా వచ్చారని చెబుతుంది యాంకర్. అతడు ఎవరో కాదు మిస్టర్ మహేశ్ అంటుంది. అతడు వచ్చి కూర్చుంటాడు. ఈ రౌండ్ గురించి ప్రభ గారు.. సంజయ్ గారు వివరిస్తారు అంటుంది యాంకర్.
ఈ రౌండ్ నుంచి 5 మంది మాత్రమే సెమీ ఫైనల్ కు వెళ్తారు అంటుంది ప్రభ. ఇదొక రకంగా డూ ఆర్ డై సిచ్యుయేషన్ అంటుంది ప్రభ. మరొక్కసారి మీ అందరికీ ఆల్ ది బెస్ట్.. అంటుంది. తర్వాత ఇది కంటెస్టెంట్లకు నచ్చిన రౌండ్ అంటాడు సంజయ్. మీకు నచ్చిన డిష్ చేయాలి అంటాడు.
కాకపోతే ఒక కండిషన్ అంటాడు. ఈ రోజు సాయంత్రం ఎంతో మంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు అంటాడు. ఆలోగా మీరందరూ మీ వంటకాలను తయారు చేసి డిషెస్ పెట్టాలి. అన్ని వంటకాలు ఒకే రేట్ లో ఉంటాయి. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు మీ వంటకాలను కొంటారు. వాళ్లకు ఎక్కువ డబ్బులు వస్తాయి. వాళ్లకే ఎక్కువ మార్కులు వస్తాయి అంటాడు. ఇంతలో రామా అంటూ అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Termites : సాధారణంగా ఇంట్లో చెదలు పట్టడం అనేది సాధారణమైన విషయం. అయితే ఈ చెదలు అనేవి చూడడానికి చిన్నగా ఉన్నా…
Siddharth Vs Allu Arjun : డిసెంబర్ 5న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం భారీ…
Vitamin D : మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ లలో విటమిన్ డీ కూడా ఒకటి. అయితే మన శరీరంలో…
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
This website uses cookies.