Janaki Kalaganaledu 9 March Today Episode : జానకికి మరో పెద్ద సమస్య.. జానకి ప్రెగ్నెంట్ అనుకొని ఖుషీ అయిన జ్ఞానాంబ.. ఇంతలో పెద్ద షాక్

Janaki Kalaganaledu 9 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 253 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకికి వాంతులు రావడంతో సింక్ దగ్గరికి వెళ్లి వాంతి చేసుకుంటుంది. అప్పుడే డోర్ తీసి బయటకు వచ్చిన జ్ఞానాంబ.. జానకి వాంతి చేసుకోవడం చూసి సంతోషిస్తుంది. జానకి.. అంటూ తన దగ్గరికి వెళ్తుంది. తన చెవులు పట్టుకుంటుంది. అత్తయ్య గారు అంటూ ఏదో చెప్పబోతుంది జానకి. కానీ.. కొంచెం ఏదో నాకు అన్నా కూడా పట్టించుకోకుండా.. సంతోషంలో మునిగి తేలుతుంది జ్ఞానాంబ. ఆదేవుడు నా బాధను అర్థం చేసుకున్నట్టున్నాడు. అందుకే ఇలా కరుణించాడు. నీ కడుపు నిండిన క్షణంతో ఈ ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి అంటుంది జ్ఞానాంబ. ఈ విషయం వెంటనే మామయ్య గారికి చెప్పాలి అంటుంది. ఇంతలో జానకికి మళ్లీ వాంతులు అవుతాయి.

janaki kalaganaledu 9 march 2022 full episode

వెళ్లి ఏమండీ.. జానకి నెల తప్పిందండి. తను వాంతులు చేసుకుంటుంది. తనకు వేవిళ్లు పడుతున్నాయి చూడండి అంటుంది జ్ఞానాంబ. అమ్మా జానకి.. ఎంత శుభవార్త అమ్మా.. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం అమ్మా. నిన్ను లీలావతి అన్నమాటలకు అత్తయ్య గారు తట్టుకోలేకపోయారు. కానీ.. ఇప్పుడు మీ అత్తయ్య గారిలో ఎప్పుడూ చూడని ఆనందాన్ని చూస్తున్నాను. ఈ సంతోషానికి కారణం నువ్వే తల్లి అంటాడు గోవిందరాజు. నేను, మీ మామయ్య గారు గుడికి వెళ్లి పూజ చేయించుకొని వస్తాం.. అని చెప్పి జానకి మాట్లాడుతున్నా వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు.

అత్తయ్య గారు.. మామయ్య గారు ఇలా అనుకుంటున్నారు. కాదని ఎలా చెప్పాలి. వాళ్లు చాలా సంతోషంలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు అనుకుంటుంది. వెంటనే రామా దగ్గరికి వెళ్లి చాలా పెద్ద సమస్య వచ్చింది అంటుంది జానకి.

మీరు కంగారు పడకుండా సమస్య ఏంటి చెప్పండి అంటాడు రామా. రామా గారు.. ఇదలా తేలికగా తీసుకునే విషయం కాదండి. కంగారులో నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అంటుంది జానకి. నాకు రాత్రి తిన్న భోజనం అరగక.. వాంతులు అయ్యాయి.. అది చూసి అత్తయ్య గారు నెల తప్పానని అనుకొని మామయ్య గారికి చెప్పారు అంటుంది జానకి.

దీంతో రామా షాక్ అవుతాడు. నేను ప్రెగ్నెంట్ అనుకొని పూజ జరిపించడం కోసం మామయ్య గారు, అత్తయ్య గారు గుడికి వెళ్లారు.. అంటుంది జానకి. దీంతో నిన్ను లీలావతి మాట్లాడిన మాటలకు అమ్మ చాలా బాధపడింది. ఇప్పుడు మీరు వాంతి చేసుకోవడం చూసి శుభవార్త అనుకొని ఉంటారు అని అంటాడు రామా.

జానకి గారు.. ఏదో విధంగా నేను అమ్మకు చెబుతాను. మీరు అనవసరంగా కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి అంటాడు రామా. మరోవైపు లీలావతికి 500 ఇచ్చి ఇంట్లో పెట్టిన మంట మామూలుగా లేదు కదా అని అనుకుంటుంది మల్లిక.

Janaki Kalaganaledu 9 March Today Episode : స్వీటు కొట్టు వద్ద స్వీట్లు పంచిన గోవిందరాజు, జ్ఞానాంబ

ఇంతలో చికిత వచ్చి.. జానకి అమ్మ గారు నెల తప్పారు అండి అంటుంది. జానకి అమ్మ గారు ప్రెగ్నెంట్ అండి అంటుంది చికిత. దీంతో మల్లిక షాక్ అవుతుంది. మా అత్త పోలేరమ్మకు అసలే మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాలన్న ఆరాటం. ఇప్పుడు జానకి మనవడో.. మనవరాలినో ఇచ్చిందంటే ఇక పోలేరమ్మ.. జానకిని ఎక్కడో కూర్చోబెడుతుంది అంటుంది మల్లిక.

మరోవైపు జ్ఞానాంబ, గోవిందరాజు.. ఇద్దరూ స్వీటు కొట్టు దగ్గర అందరికీ స్వీట్లు పంచుతుంటారు. మా జానకి తల్లి కాబోతోంది.. ఇంకోటి తీసుకోండి అంటారు. అత్తయ్య గారికి కూడా ఫోన్ చేసి చెప్పండి అంటుంది జానకి. మరోవైపు రామా, జానకి అప్పుడే స్వీటు కొట్టు దగ్గరికి వస్తూ వీళ్లను చూస్తారు.

లీలావతి వెంటనే జానకి దగ్గరికి వెళ్లి.. తెల్లారగానే కడుపు పండటం ఏంటి అమ్మాయి.. చాలా విచిత్రంగా ఉంది కదా.. ఇదిగో లీలావతి.. నువ్వు ఇలారా. నీ నోరు మూయడం కోసమే ఆ దేవుడు మాకు ఈ సంతోషాన్ని ఇచ్చాడు అంటుంది జ్ఞానాంబ.

ఏంటి జ్ఞానాంబ ఇంత హడావుడి చేస్తున్నావు అంటుంది లీలావతి. దీంతో ఇక నుంచి హడావుడి చేస్తూనే ఉంటాను. నేను శపథం చేసినట్టుగానే త్వరలోనే మా ఇంట్లో జరగబోయే బారసాల కార్యక్రమానికి తనను పిలుస్తానని వైజయంతికి చెప్పు అంటుంది జ్ఞానాంబ.

ఇంతలో రామా, జానకి అక్కడికి వెళ్తారు. నీ సీమంతం రోజు ఊరు ఊరందరికీ భోజనాలు పెడతాం చూడు అంటుంది జ్ఞానాంబ. అమ్మ.. అది అంటూ ఏదో చెప్పబోతాడు రామా. కానీ.. వాళ్లు వినరు. అత్తయ్య గారు అంటూ జానకి కూడా చెప్పబోతుంది కానీ.. వాళ్లు వినరు.

జానకి… తీసుకో అంటుంది జ్ఞానాంబ. అమ్మ నీతో ఒక విషయం చెప్పాలమ్మా అంటాడు రామా. దీంతో నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు అంటుంది జ్ఞానాంబ. ఆడపిల్ల మొదటి కాన్పు కోసం పుట్టింటికి పంపాలి కదా.. కానీ ప్రసవం కోసం వాళ్ల అన్నయ్య దగ్గరికి పంపించడం చాలా కష్టం కాబట్టి ఇక్కడే ఉంచుదాం అంటారు అంతే కదా అంటుంది జ్ఞానాంబ.

మరోవైపు ఇద్దరూ కలిసి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. చూశారు కదా రామా గారు.. అత్తయ్య గారు ఎంత సంతోషంగా ఉన్నారో చూశారు కదా. మనకు మాట్లాడే అవకాశం కూడా అత్తయ్య గారు ఇవ్వడం లేదు అంటుంది జానకి. అసలు విషయం తెలిస్తే అత్తయ్య గారు ఏమనుకుంటారో అంటుంది జానకి.

రెండేళ్లు అయితే మీరు ఐపీఎస్ అవుతారు. అప్పటి వరకు ఇవన్నీ మీకు కష్టంగానే ఉంటాయి. అప్పటి వరకు మీరు ఇలాంటి బాధలు పడక తప్పదు అంటాడు రామా. అత్తయ్య గారికి మనం చెప్పడం ఆలస్యం చేసే కొద్దీ ఆవిడ చాలామందికి చెబుతారు. ఇంకా ఇంకా సంతోషపడతారు.

ఆ తర్వాత మనం నిజం చెప్పినా.. అత్తయ్య గారిని ఓదార్చే శక్తి మనలో ఎవ్వరికీ ఉండదు రామా గారు అంటుంది జానకి. అందుకని ఉన్నపళంగా ఈ విషయాన్ని అత్తయ్య గారికి మనమే చెప్పాలి. కానీ.. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంటుంది జానకి.

ఓ పని చేద్దాం జానకి గారు. ముందు ఈ విషయాన్ని నాన్నతో చెబుదాం. అమ్మకు సర్దిచెప్పమని.. నాన్నతో చెబుదాం అంటాడు రామా. కానీ.. లేదు రామా గారు. ఈ విషయం తెలిశాక అత్తయ్య గారిని ఓదార్చడం అంత సులువైన విషయం కాదు. ఊహించుకుంటేనే నాకు భయంతో ఊపిరి ఆడటం లేదు అంటుంది జానకి.

ఇంతలో రామాకు చికిత ఫోన్ చేసి.. పెద్దమ్మ గారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మన్నారు అని చెబుతుంది చికిత. దీంతో ఏంటో అని భయపడతారు. ఇద్దరూ ఇంటికి వెళ్లేసరికి.. చింతకాయలు తీసుకొచ్చి జానకికి ఇస్తుంది జ్ఞానాంబ. ఇంతలో జానకి ఏదో చెప్పబోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

53 minutes ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

3 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

3 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

6 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

9 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

20 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

23 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

1 day ago