
janhvi kapoor cute video in viral
Janhvi Kapoor : అతిలోక సుందరి జాన్వీ కపూర్ ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మ ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తుంటుంది. అప్పుడపుడు తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. దీంతో ఆమె ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి. సోషల్ మీడియాలోనే బిజీగా ఉండే ఈ భామ కుర్రాళ్లకి ఇచ్చే ట్రీట్ మాములుగా ఉండదు. రెగ్యూలర్‌గా తన ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది.వారికి కావాల్సిన పిక్స్ ని అందిస్తూ కనువిందు చేస్తుంది. దీంతో జాన్వీని ఫాలో అయ్యేవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.
నేడు జాన్వీ 26 బర్త్ డే కాగా, ఈ అమ్మడు బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఏదో ప్రాంతానికి వెళుతుంది. ఈ క్రమంలో ఆమె ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించింది. దీంతో అక్కడ ఆమె చూసిన మీడియా జర్నలిస్టులు జాన్వికి అడ్వాన్స్‌గా బర్త్‌డే విషెస్ తెలిపారు. అంతేకాదు ఆమె కోసం బర్త్‌డే కేక్ కూడా తీసుకువచ్చారు. వారి అభిమానాన్ని తిరస్కరించకుండా జాన్వి కేక్ కట్ చేసింది. జర్నలిస్ట్స్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి షాకైన జాన్వీ తెగ సంతోషించింది. అంతేకాదు ఆమె ఆమె వినయం, విధేయతకు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు నెటిజన్స్.
janhvi kapoor cute video in viral
‘హంబుల్, స్వీట్’ అంటూ జాన్వీని ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా దివంగత నటి శ్రీదేవి తనయగా పరిశ్రమలో అడుగు పెట్టింది. తన తొలి చిత్రం థడక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వి తన నటన, ప్రతిభ, డ్యాన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె గుడ్ లఖ్ జెర్రీ మూవీలో నటిస్తోంది. ఇది తమిళ ఫిలిం కొలమావు కోకిల మూవీకి రీమేక్. మరోవైపు ఈ అమ్మడు సౌత్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతుంది. విజయ్ దేదరకొండతో పూరీ జగన్నాథ్ తెరకెక్కించే జనగణమన చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయిక అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.