Janhvi Kapoor : జలకాలాటలో జాన్వికపూర్.. భారీ అందాలు ప్రదర్శిస్తూ మత్తెక్కిస్తున్న భామ
Janhvi Kapoor : అతిలోక సుందరి తనయ జాన్వికపూర్ బాలీవుడ్ ఎంట్రీ ‘ధడక్’ ఫిల్మ్‌తో అత్యద్భుతంగా జరిగింది. ఈ చిత్రం తర్వాత జాన్వికపూర్ బాలీవుడ్ ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాలో జాన్వికపూర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇకపోతే ఈ భామకు తొలి చిత్రం తర్వాత వచ్చిన అవకాశాలు అన్నిటినీ అందిపుచ్చుకుంది. ఈ క్రమంలోనే వెండితెరను ఓటీటీని కూడా బ్యాలెన్స్ చేసింది. ఓ వైపు వెండితెరపైన అలరిస్తూనే మరో వైపు డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసి సత్తా చాటింది.
Janhvi Kapoor in water Video
Janhvi Kapoor : నదిలో మునకలేస్తూ హోయలు పోతున్న జాన్వి
సినిమాల్లోనే కాదు జాన్వికపూర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంటుంది అతిలోక సుందరి తనయ. ఈ క్రమంలోనే హాట్ ఫొటోస్ షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా ఈ భామ ఇన్ స్టా వేదికగా నదీతీరంలో స్నానం చేసిన వీడియో ఒకటి షేర్ చేసింది. సదరు వీడియోలో జాన్వి కపూర్ అందాలు ఆరబోసినట్లుగా కనబడుతున్నాయి. స్టాప్ అండ్ ప్లే మోడ్‌లో వీడియో ప్లే అవుతుండగా, జాన్వికపూర్ జలకాలాటలో తేలియాడుతోంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నీటిలో మునకలేస్తూ కెమెరా స్టిల్స్‌కు ఫోజులిచ్చింది.
Janhvi Kapoor Latest Pics in Forest
ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాన్వి ఎంచక్కా జలకాలాటలో ఎంజాయ్ చేస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ‘బ్యూటిఫుల్ బేబీ, ఎంజాయ్, వెరీ నైస్’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే జాన్వికపూర్ సినిమాల విషయానికొస్తే ఈ భామ బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రాజ్ కుమార్ రావుతో కలిసి నటించిన ‘రూహి’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ప్రజెంట్ జాన్వి ‘దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, మిలి’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.
Janhvi Kapoor Latest Pics in Forest
