Janhvi Kapoor : జాన్వీ అందాలను ఈ రేంజ్ లో చూస్తామని అనుకోరు.. వీడియో..!
ప్రధానాంశాలు:
Janhvi Kapoor : జాన్వీ అందాలను ఈ రేంజ్ లో చూస్తామని అనుకోరు
Janhvi Kapoor : బాలీవుడ్ Bollywood గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ ప్రతిష్టాత్మక ‘లాక్మే ఫ్యాషన్ వీక్’ 2025లో తన అందంతో అందరినీ ఆకర్షించారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా ప్రత్యేకంగా రూపొందించిన డిజైనర్ వేర్ ధరించి ర్యాంప్‌పై మెరిసిపోయారు. స్టేజ్‌పై ఆమె ఎంట్రీ, వాక్, హొయలు చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రతిఏటా ఘనంగా నిర్వహించే ఈ ఈవెంట్‌లో జాన్వీ స్టైల్, ఆమె ఎలిగెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Janhvi Kapoor : జాన్వీ అందాలను ఈ రేంజ్ లో చూస్తామని అనుకోరు.. వీడియో..!
Janhvi Kapoor : చూపరులను కట్టిపడేసిన జాన్వీ కపూర్
ఈ వేడుకలో జాన్వీ కపూర్ బంధాని ఫాబ్రిక్‌తో తయారైన నల్లటి గౌన్ ధరించి మెరిసిపోయారు. పొడవాటి కోటు ధరించి స్టేజ్‌పైకి ప్రవేశించిన ఆమె, కొంతసేపటి తర్వాత కోటును తీసేసి ఫోటోలకు అదిరిపోయే పోజులు ఇచ్చారు. ఆమె క్యారీ చేసిన గ్రేస్, ఫెమినిన్ ఛార్మ్‌కి ఫ్యాషన్ లవర్స్ ఫిదా అయ్యారు. జాన్వీ అద్భుతమైన ర్యాంప్ వాక్, ఆమె మేకోవర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ప్రత్యేక వేడుకలో జాన్వీ కపూర్ డిజైనర్ రాహుల్ మిశ్రా షో స్టాపర్‌గా మారారు. బాలీవుడ్ స్టార్స్ తరచూ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. కానీ జాన్వీ తన స్టైల్, కాన్ఫిడెన్స్‌తో ఈసారి హైలైట్ అయ్యారు. ఈవెంట్‌లో పాల్గొన్న ప్రముఖ స్టార్స్, డిజైనర్లు, ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ ఆమె లుక్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆమె ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.
