Home » Entertainment » Janhvi Kapoor Park Photos Viral
Entertainment

Janhvi Kapoor : పార్కులో చిన్న పిల్లలా చిందేసిన జాన్వికపూర్.. ఫొటో వైరల్

Authored By
mallesh
The Telugu News | Published on: October 5, 2021, 8:00 am
Advertisement

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి తనయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి అందిరికీ తెలిసిందే. ఈ క్రమంలో బీ టౌన్‌లో కొందరు సెలబ్రిటీలు ఆమెను సోషల్ మీడియా క్వీన్ అని చెప్తుంటారు. ఇకపోతే సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలతో ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేసుకునే ఈ భామ.. తాజా ఓ క్యూట్ ఫొటో షేర్ చేసింది. అది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Advertisement

Janhvi Kapoor park photos viral

Janhvi Kapoor : తాను పూలబిడ్డనంటున్న జాన్వికపూర్..

‘పూల బిడ్డ’ అనే క్యాప్షన్‌తో పార్కులో ఎగిరి గంతేస్తున్న ఫొటో ఒకటి జాన్వి కపూర్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. సదరు ఫొటోలో జాన్వి కపూర్ మల్టీ కలర్ ప్యాంట్ ధరించి లైట్ గ్రీన్ టాప్ ధరించి ఉంది. ఒక కాలు పైకి తలలో బ్యూటిఫుల్ ఫ్లవర్ పెట్టుకుని ఉన్న జాన్వి కపూర్ ఫొటో ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ ఫొటోను చూసి నెటిజన్లు ‘సో బ్యూటిఫుల్, క్యూటీ, బ్యూటిఫుల్ మేడమ్, బేబీ’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Janhvi Kapoor park photos viral

ఓ నెటిజన్ ఈ ఫొటోలో జాన్వి కపూర్ ఏడో తరగతి చదువుతున్న అమ్మాయి మాదిరిగా ఉందని పోస్టు పెట్టాడు. ఇక పూల బిడ్డ క్యాప్షన్‌తో పాటు తాను చంద్రుని బిడ్డనని, సూర్యుని ద్వారా పెరిగానని, నక్షత్రాలు నడిచిన ప్రపంచంలో పుష్పాలతో గీసిన ఆకాశంలో ఉంటానని చెప్పకనే చెప్పేసింది జాన్వి‌కపూర్. ఇకపోతే ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేయబడిన ఈ ఫొటోను నెటిజన్లు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా లైక్ చేస్తున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా వైఫ్ తహిరా కశ్యప్ జాన్వికపూర్ ఫొటోకు లైక్ కొట్టింది.

Advertisement

Janhvi Kapoor park photos viral

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి